- Home
- Entertainment
- Paradise Mistakes: ప్యారడైజ్ సినిమాపై నెగటివ్ టాక్‌కి 5 కారణాలు.. శ్రీకాంత్ ఓడెల చేసిన మిస్టేక్ ఏంటంటే?
Paradise Mistakes: ప్యారడైజ్ సినిమాపై నెగటివ్ టాక్‌కి 5 కారణాలు.. శ్రీకాంత్ ఓడెల చేసిన మిస్టేక్ ఏంటంటే?
నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీపై నెగటివ్ ప్రచారం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ నెగటివ్ టాక్‌కి కారణాలేంటనేది చూస్తే, ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

ప్యారడైజ్ మూవీపై నెగటివ్ టాక్‌కి 5 కారణాలు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్` మూవీ నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్, కయాదు లోహర్, సంపూర్నేష్ బాబు, సోనాలీ కులకర్ణి, ఈశ్వరీరావు, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భారీ అంచనాలతో నేడు గురువారం రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా వరకు నెగటివ్ టాక్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి కూడా భిన్నమైన రియాక్షన్ కనిపించింది. అయితే మూవీపై చాలా విషయాల్లో ట్రోలింగ్ నడుస్తోంది. మరి ఇంతగా ఈ మూవీపై నెగటివ్ టాక్ రావడానికి కారణమేంటి? అనే దానికి ఐదు కారణాలు చూస్తే.
1.కథలో లోపాలు
దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఎంచుకున్న కథ బాగానే ఉన్నా, దాన్ని సరిగ్గా తెరపై ఆవిష్కరించలేకపోయారు. అది అనేక దారులు తీసుకుంది. అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు రావడంతో కొంత డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. సీరియస్ కథలో నానికి సంబంధించిన కొన్ని ఫన్నీ సీన్లు ఉన్నాయి. అవి కనెక్టింగ్‌గా లేవు. దీనికితోడు ఎంచుకున్న కథ ఒకటి, అంతిమంగా వెళ్లిన దారి మరోటి. స్క్రీన్ ప్లే పరంగా లోపాలున్నాయి. కయాదు లోహర్ పాత్ర బాగున్నా, లవ్ ట్రాక్‌ని ఇరికించినట్టుగా ఉంది. దర్శకుడు టేకింగ్ మరో మైనస్. చాలా చోట్ల లాజిక్ లెస్‌గా ఉంది. ప్యారడైజ్‌లో ఎందుకు నిత్యం వర్షం పడుతుందో అర్థం కాదు.
2.ఎమోషన్స్ మిస్సింగ్
సినిమాలో మెయిన్‌గా ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. ఎపిసోడ్లుగానే మూవీని ప్లాన్ చేశారు. `పుష్ప 2` తరహాలో బ్లాక్స్ ఎపిసోడ్లుగా సినిమాని రూపొందించారు. లో అయిన చోట యాక్షన్ సీక్వెన్స్ తో లేపొచ్చు అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. తల్లికొడుకుల మధ్య ఎమోషన్స్ తేలిపోయాయి. ఆడియెన్స్ వాటిని తీసుకోలేకపోయారు. దీంతో అవి చప్పగా సాగాయి. బలమైన ఎపిసోడ్లు ఉన్నా, వాటిలో ఎమోషన్ లేకపోవడంతో ఆయా సీన్లు పండలేదు.
3.మితిమీరిన యాక్షన్
యాక్షన్ మితిమీరింది. యాక్షన్ లవర్స్ కి నచ్చినా, ఇందులో యాక్షన్ ఓవర్ డోస్ అనిపిస్తుంది. చంపడానికి సంబంధించిన సీన్లకి అడ్డూ అదుపూ లేదు. సినిమా స్థాయిని మించి ఉన్నాయి. అందుకే యాక్షన్ సీన్లలో ఇంపాక్ట్ మిస్ అయ్యింది. దీనికితోడు అనిరుధ్ రవిచందర్ ఆర్‌ఆర్ కూడా ఓవర్‌గా ఉంది. సౌండ్ ఎక్కువగా ఉంది. అది కాస్త పూనకాలు తెప్పించడం కాదు కదా ఇరిటేషన్ తెప్పించింది. డబ్బింగ్‌లో కూడా ఫినిషింగ్ లేదు.
4.నాని పాత్ర
సినిమాలో నాని విశ్వరూపం చూపించారు. నటుడిగా, యాక్షన్ సీక్వెన్స్ లో రెచ్చిపోయాడు. అయితే సినిమా బ్యాక్ డ్రాప్ చాలా బలమైనది. కానీ ఆ స్థాయికి నాని సరిపోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన్ని చూడటం కొంత ఇబ్బందిగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. నానికి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కానీ ఇందులో ఊరమాస్‌గా, క్రూరత్వంతో కూడిన వ్యక్తిగా చూపించడంతో దాన్ని అభిమానులు, ఆడియెన్స్ అంతగా తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతోపాటు తెలంగాణ యాస కూడా నానికి సెట్ కాలేదు. వేగంగా చెప్పే డైలాగుల్లో మాటలు అర్థం కాలేదు.
5.క్లైమాక్స్ , రాజకీయ వివాదం
ఫైనల్‌గా కేసీఆర్ పాత్రని పోలిన పాత్ర. సవారీలకు ఎమ్మెల్యే శేఖరన్న పాత్ర సపోర్ట్ చేసింది. వారికి గుర్తింపు తెచ్చింది. అయితే ప్రియదర్శి చేసిన ఆ పాత్ర కనిపించినప్పుడల్లా థియేటర్లో ఊగిపోయాయి. చివర్లో వచ్చి సినిమా క్రెడిట్ తీసుకున్నట్టుగా ఉంది. దీంతో ఈ మూవీని కాంగ్రెస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు. ఇది సినిమాపై తీవ్రమైన నెగటివ్ ప్రచారానికి దారితీస్తుందని చెప్పొచ్చు. ఇది మూవీపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.

