శోభిత ధూళిపాళ - నాగచైతన్య పెళ్లి ఫోటోలు చూశారా, పట్టు పంచలో చైతూ, కాంచివరం చీరలో శోభిత
నాగచైతన్య. శోభిత ధూళిపాళ పెళ్ళి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఇద్దరు తారలు మెరిసిపోయారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని వారి వారసుడు నాగచైతన్య , హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సబంధించిన ఫోటోలను విడుదల చేశారు అక్కినేని ఫ్యామిలీ.
రాత్రి 8.13 నిమిషాలకు నాగచైతన్య-శోభిత మెడలో మూడు ముళ్లు వేశారు. అన్నపూర్ణ స్టూడియో లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యి దంపతులను ఆశీర్వధించారు. నాగ చైతన్య శోభిత.. పెళ్లి వేడుక అంతా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.
Also Read: ఘనంగా నాగ చైతన్య-శోభిత పెళ్లి వేడుక, మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులు ఎవరంటే..?
పంట్టు పంచలో నాగచైతన్య మెరిసిపోయాడు. కాంచివరం చీరలో శోభిత దేవతలా కనిపించింది. వారి వంశ పారంపర్యంగా వస్తున్న నగలను ధరించి కనిపించింది శోభిత. ముక్కు పుడక ప్రత్యేకంగా కనిపించగా చిరునవ్వు చిందిస్తూ.. పెళ్ళి వేడుకల్లో ఫోటోలకు ఫోజులిచ్చారు దంపతులు.
Also Read: పెళ్లి పీటలెక్కనున్న మరో యంగ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇక ఈ పెళ్ళి సందర్భంగా కింగ్ నాగార్జున కూడా సాంప్రదాయ డ్రెస్టింగ్ స్టైల్ లో కనిపించారు. నూతన దంపతులను ఆశీర్వదించి వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతే కాదు నాగార్జున అక్కినేని తన ఎక్స్ పేజ్ లో పెళ్ళి ఫోటోలను పోస్ట్ చేశారు.
Also Read: అఖిల్ పెళ్ళిపై కొత్త పుకారు.. మ్యారేజ్ డేట్ పై తేల్చేసిన నాగార్జున.
ఈ పెళ్లి వేడుకకు చాలా మంది సినీ తారలు హాజరయినట్టు తెలుస్తోంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, అల్లు అర్జున్ వంటి తారలు ఈ వేడుకకు హాజరయినట్టు సమాచారం. వీరితో పాటు వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి , సుహాసిని, కీరవాణి తదితరులు ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం.