Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పెళ్లి పీటలెక్కనున్న మరో యంగ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?

పెళ్లి పీటలెక్కనున్న మరో యంగ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ స్టార్స్ వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఈక్రమంలోనే సక్సెస్ కోసం ఎదరు చూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ కూడా పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..? 

Mahesh Jujjuri | Published : Dec 04 2024, 08:04 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. వరుసగా యంగ్ స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అక్కినేని ఇంట నాగచైతన్య తో పాటు అఖిల్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెపుతుండగా.. అటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పెళ్ళికి సిద్దం అవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్ళాడబోతుంది. ఇండస్ట్రీలో ఇలా ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు.  ముఖ్యంగా కుర్ర హీరో, హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే  హీరోయిన్  మేఘా ఆకాష్, హీరో  శ్రీసింహా, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ ఏడాది. ఈ లిస్ట్ లోనే చేరబోతున్నాడు మరోయంగ్ హీరో. 

25
Asianet Image

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నాడు  ఈ  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ గురించి అందరికి తెలిసిందే సినిమా ప్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. ఎన్ని ప్రయత్నాలు చేసి.. హిట్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్ల తోసినిమాలు చేసినా.. యావరెజ్ హిట్ల దగ్గరే ఆగిపోయాడు బెల్లంకొండ. 

35
Asianet Image

 టాలీవుడ్ తో లాభం లేదని బాలీవుడ్ లో కూడా ట్రై చేశాడు బెల్లంకొండ కాని అక్కడ కూడా కలిసి రాలేదు. రాజమౌలి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని హిందీలో  వినాయక్ డైరెక్షన్ లో నటించాడు. కాని . కాని అక్కడ ఆమూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక అవన్నీ తరువాత మందు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడో ఏమో.. వెడ్డింగ్ బెల్స్ మెగించి..  లైఫ్ లో సెటిలైపోవడానికి ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ విషయాన్ని ఆయన తండ్రి ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ వెల్లడించినట్టు తెలుస్తోంది. 

45
Asianet Image

అయితే గత కొంత కాలంగా ఓ న్యూస్ వైరల్ అయ్యింది.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమిస్తున్నాడని. ఈ విషయం ఇంట్లో చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట సాయి శ్రీనివాస్. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయం అనౌన్స్ చేయడానికిరెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్ బర్త్ డేసందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ వస్తుందని వార్త వైరల్ అయ్యింది. 

55
Asianet Image

అయితే ఇందులో నిజం లేదని హీరో తండ్రి క్లారిటీ ఇచ్చాడట.. తనకు కాబోయే కోడలికి ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పారట. ఓ వ్యాపారవెత్త కూతురితో శ్రీనివాస్ పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక.  ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఫిబ్రవరిలో వీళ్ళ ఎంగేజ్మెంట్ మార్చిలో పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అటు సాయి శ్రీనివాస్ ఈ విషయంలో స్పందిస్తారో లేదో కూడా చూడాలి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
వైరల్ న్యూస్
 
Recommended Stories
Top Stories