- Home
- Entertainment
- గరికపాటి పై మరోసారి రెచ్చిపోయిన నా అన్వేషణ, నేను బ్రహ్మ, మీరు విష్ణు అంటూ.. ఎగతాళి చేసిన యూట్యూబర్..
గరికపాటి పై మరోసారి రెచ్చిపోయిన నా అన్వేషణ, నేను బ్రహ్మ, మీరు విష్ణు అంటూ.. ఎగతాళి చేసిన యూట్యూబర్..
గరికపాటిపై.. అన్వేష్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎంతమంది విమర్శించినా.. అన్వేష్ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. మరోసారి గరికపాటిపై రెచ్చిపోయి రచ్చ చేశాడు సెలబ్రిటీ యూట్యూబర్.

రెచ్చిపోతున్న అన్వేష్..
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న యూట్యూబర్ అన్వేష్ మరోసారి రెచ్చిపోయాడు. శివాజీ కామెంట్స్ తో మొదలైన కాంట్రవర్సీ.. అనసూయ వైపు మళ్లి.. చివరకు ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ దగ్గరకు చేరింది. ఈవిషయాన్ని మరింత వివాదంగా మార్చి.. రచ్చ రచ్చ చేస్తున్నాడు అన్వేష్. ఇందులోకి ఆధ్యాత్మికవేత్తలైన గరికపాటి, చాగంటిని కూడా లాగాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, అన్వేష్ తన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇంకా రెచ్చిపోయి గరికపాటిపై కామెంట్లు చేస్తున్నాడు అన్వేష్.
గరికపాటిని ఎగతాళి చేస్తూ.. కామెంట్స్
అన్వేష్ గరికపాటిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొద్ది రోజుల క్రితం అన్వేష్ తనను విమర్శించడంపై.. పరోక్షంగా గరికపాటి స్పందించారు. ఈ నేపథ్యంలో అన్వేష్ ఒక వీడియో విడుదల చేస్తూ గరికపాటిని ఉద్దేశించి.. వ్యంగ్యంగా మాట్లాడుతూ.. వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ, “గరికపాటి గారు నా మీద యుద్ధం ప్రకటిస్తారా? మీరు నన్నెవరనుకుంటున్నారు? నేను సాక్షాత్తు బ్రహ్మదేవుడిని. నేను ఒక అవతార పురుషుడిని అనే విషయం రీసెంట్‌గా తెలిసింది. మీరు విష్ణుమూర్తి అవతారం, చాగంటి గారు మహాశివుడు. మన ముగ్గురం త్రిమూర్తుల్లాంటి వాళ్లం. త్రిమూర్తులు స్నేహితులు, స్నేహితుల మధ్య యుద్ధం ఎందుకు? మనం కారణజన్ములం, ఈ దేశాన్ని ఉద్దరించడానికి ఈ అవతారాలు ఎత్తాం” అంటూ ఎగతాళి చేస్తూ.. మాట్లాడాడు.
మండిపడుతున్న నెటిజన్లు..
ఈ వీడియో విడుదలైన వెంటనే నెటిజన్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. కామెంట్లలో అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో ఫారెన్ లో ఉండి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా.. భారత్‌కు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అంటున్నారు. అన్వేష్ విదేశాల్లో ఉండబట్టే.. ఇలా వాగుతున్నాడని.. ఇక ఇండియాకు వస్తే అతనికి బుద్ది చెపుతామంటున్నారు. ఇక మరో యూట్యూబర్.. నా అన్వేషణ యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అన్వేష్ మాత్రం.. నేను కావాలని ఎవరిని అడగలేదు.. నా కంటెంట్ నచ్చి నాఛానెల్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. పోతే పోనివ్వండి.. నేను అనుకున్నదే చెపుతాను అని అన్వేష్ తేల్చి చెప్పాడు.
అన్వేష్ అరెస్ట్ తప్పదా..?
నా అన్వేషణ ఛానెల్ పై, అన్వేష్ పై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు నామోదు అయ్యాయి. ప్రముఖ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేయాలంటున్న హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దాంతో అన్వేష్‌ను రప్పించడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ కు లేఖ రాశారు. ఇన్‌స్టా నుంచి వచ్చే రిప్లై కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అన్వేష్ ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారని సమాచారం.

