MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరి తీరు ఒక్కొ విధంగా ఉంటుంది. ఎవరి ఇమేజ్ వారిది. అయితే అందాల నటుడు శోభన్ బాబకు గ్లామర్ హీరోగా ఎంత పేరు ఉందో.. పీనాసోడు అన్న అపవాదు కూడా ఉంది. ఈ విషయంలో ఆ కాలం స్టార్ నటి రమాప్రభ సంచలన కామెంట్స్ చేసింది. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : May 24 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ అందాల నటుడు..
Image Credit : Asianet News

టాలీవుడ్ అందాల నటుడు..

శోభన్ బాబుకు అందాలనటుడు, సోగ్గాడు, అంధ్రా అందగాడు లాంటి ఎన్నో బిరుదులుండేవి. అప్పట్లోనే.. ఆయన గ్లామర్ ఇమేజ్ ఎలా ఉండేదంటే.. ఓ సారి షూటింగ్ లో ఓ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుందటే శోభన్ బాబు క్రేజ్ గురించి ఇంత కంటే ఏం చెప్పాలి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా శోభన్ బాబును లైక్ చేసేవారు. హీరోయిన్లు అయితే ఆయనతో నటించడానికి పోటీ పడేవారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునేవారు. శోభన్ బాబు కూడా హీరోయిన్లతో చాలా సరదాగా ఉండేవారు. కానీ తన హద్దులు దాటిన సందర్భాలు మాత్రం లేవు. కానీ డబ్బు విషయంలో మాత్రం శోభన్ బాబు అతి జాగ్రత్త.. ఆయనకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డబ్బు విషయంలో శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్..
Image Credit : our own

డబ్బు విషయంలో శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్..

శోభన్ బాబుకు నటుడిగా ఎంత మంచి ఇమేజ్ ఉందో.. డబ్బు విషయంలో అన్ని విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి. ఆయన కొన్నివిషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. రెమ్యునరేషన్ అనుకున్నంత ఇవ్వాలి, కరెక్ట్ టైమ్ కు చేతిలో పెట్టాలి, తగ్గినా లేట్ అయినా ఒప్పుకోరు. సాయంత్రం 6 గంట కొడితే షూటింగ్ పేకప్ చెప్పాల్సిందే. ఎవరికి అపాత్రదానం చేయరు. ఎవరు రూపాయి అడిగినా ఇవ్వరు. నిర్మాతలను డబ్బు విషయంలో ఇబ్బందులు పెట్టారన్న టాక్ కూడా ఉంది. దాంతో ఇండస్ట్రీలో శోభన్ బాబుకి పీనాసోడు అన్న పేరు పడిపోయింది. కానీ ఆయన కూడా కొన్ని గుప్త దానాలు చేశారని. వాటిని ఎక్కడా చెప్పుకోలేదని కృష్ణం రాజు లాంటి హీరోలు పలు సందర్భాల్లో వెల్లడించారు.

Related Articles

Related image1
Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Related image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
36
శోభన్ బాబు గురించి రమాప్రభ ఏమన్నారంటే?
Image Credit : Asianet News

శోభన్ బాబు గురించి రమాప్రభ ఏమన్నారంటే?

ఆకాలం నటీనటులకు.. ఇప్పటి జనరేషన్ తారలకు వారధిగా ఉన్న అతి తక్కువ మందిలో రమాప్రభ ఒకరు. ఆమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ.. అప్పటి విశేషాలను షేర్ చేసుకుంటుంటారు. చాలా కాలం క్రితం రమాప్రభ ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి చెప్పమని అడిగితే.. సింపుల్ గా నాలుగు మాటల్లో తేల్చేశారు. 

46
రమాప్రభ మాట్లాడుతూ..
Image Credit : Asianet News

రమాప్రభ మాట్లాడుతూ..

రమాప్రభ మాట్లాడుతూ..'' ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన చాలా పీనాసోడు, బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు తప్పించి ఆయన నోటి నుంచి ఇంకో మాట రాదు, ఎవరికి రూపాయి ఇవ్వడు, తన తిండే తాను తినడు, తన బట్టలు తాను కట్టడు. ఇంతకంటే ఏం చెప్పాలి. ఇవి చాలు ఆయన ఎలాంటి వాడో మీరే అర్ధం చేసుకోండి''. అని అన్నారు. ఓ చిన్న ట్రైలర్ తో ఆయన గురించి నాలుగు మాట్లలో చెప్పేశారు రమాప్రభ.

56
క్లారిటీ ఇచ్చిన శోభన్ బాబు..
Image Credit : google

క్లారిటీ ఇచ్చిన శోభన్ బాబు..

ఇండస్ట్రీలో అందరు తనను పీనాసి అనడంపై శోభన్ బాబు ఓసందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. '' అందరు నన్ను పిసినారి అంటున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు. నా అభిమానులందరికి తలా ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తే.. ఆతరువాత ఆ రూపాయి నేను అందరిని అడుక్కోవలసి వస్తుంది.. అని అనేవారు. అందుకే నేను అపాత్రదానం చేయను. అర్ధం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసం. 

అవసరం ఉన్న చోట మాత్రమే నేను ఖర్చు చేస్తాను. అది నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు. నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని నేను జాగ్రత్తగా ఉంటాను. ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంత మంది నావల్ల చదవుకుంటున్నారు, మంచి పోజిషన్ లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా.. నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు'' అని శోభన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

66
శోభన్ బాబు 10000 కోట్ల ఆస్తులు..?
Image Credit : Facbook / Sobhan Babu fans

శోభన్ బాబు 10000 కోట్ల ఆస్తులు..?

శోభన్ బాబు డబ్బును వృధా చేసేవారు కాదు. ఆయన సంపాధించిన సొమ్మ అంతా బిజినెస్ లో పెట్టారు. ప్రతీ పైసా ఆయన భూమిపై పెట్టారు. చెన్నైలో సగం భూములు శోభన్ బాబు కోనేశారని అంటుంటారు. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ దాదాపు 10 వేల కోట్లు ఉంటుందని అంచన. శోభన్ బాబు హీరోగా ఎంత స్టార్ డమ్ చూసినా.. తన ఫ్యామిలీని మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వలేదు . తన దగ్గర పనిచేసేవారిని చాలా బాగా చూసుకునే వారు శోభన్ బాబు. ఇంట్లో పనిచేసేవారి కుటుంబాలకు కావల్సిన ఆర్ధిక అవసరాలు శోభన్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. వారి పిల్లలను కూడా ఆయన చదివించేవారు. శోభన్ బాబు చేసిన గుప్తదానాల గురించి హీరో కృష్ణం రాజు ఓ సందర్భంలో ఎంతో గొప్పగా చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
శోభన్ బాబు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Related Stories
Recommended image1
Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Recommended image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved