MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhanbabu: శోభన్‌బాబు సినిమాలు మానేయడానికి కారణం ఎవరో తెలుసా? ఆ లేడీ మొఖం పట్టుకొని అంత మాట అన్నదా?

Sobhanbabu: శోభన్‌బాబు సినిమాలు మానేయడానికి కారణం ఎవరో తెలుసా? ఆ లేడీ మొఖం పట్టుకొని అంత మాట అన్నదా?

శోభన్‌బాబు చాలా సిస్టామాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేశారు. అయితే ఆయన రిటైర్‌మెంట్‌ వెనుక పెద్ద కారణం ఉంది. ఒక లేడీ అన్న మాటతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 20 2026, 06:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన శోభన్‌బాబు
Image Credit : youtube/etv

ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన శోభన్‌బాబు

సోగ్గాడు శోభన్‌ బాబు.. తెలుగు ఆడియెన్స్ మరిదిలో ఒక సూపర్‌ స్టార్‌గా నిలిచిపోయారు. ఆయన మహిళా ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టారు. అప్పట్లో మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్న హీరోగా శోభన్‌బాబు నిలిచారు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలు చేయడం, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు, భార్యాభర్తల మధ్య అనుబంధాలకు సంబంధించిన కథలతో ఎక్కువగా సినిమాలు చేయడంతో లేడీ అభిమానులు ఎక్కువగా ఆయన్ని ఇష్టపడ్డారు. అందంలోనూ ఎవర్‌ గ్రీన్‌ అనిపించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సిస్టమాటిక్‌ లైఫ్‌ లీడ్‌ చేసిన సోగ్గాడు
Image Credit : our own

సిస్టమాటిక్‌ లైఫ్‌ లీడ్‌ చేసిన సోగ్గాడు

అయితే శోభన్‌బాబు ఏం చేసినా సిస్టమాటిక్‌గా ఉంటుంది. ఆయన షూటింగ్‌ ల విషయంలోనూ టైమింగ్స్ ని ఫాలో అయ్యేవారు. సాయంత్రం ఆరు దాటితే షూటింగ్‌ చేసేవారు కాదు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఉంటే ముందే చెప్పాలి. మాక్సిమమ్‌ ఆరు తర్వాత షూటింగ్‌లు బంద్‌. ఆ తర్వాత తన వ్యక్తిగతంగా టైమ్‌ కేటాయించుకునేవారు. ఫ్యామిలీకి టైమ్‌ ఇచ్చేవారు. అదే సమయంలో సినిమాలకు గుడ్‌ బై చెప్పే విషయంలో ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారట. 1980 దాటి 90 వస్తున్న సమయంలోనే ఆయన సినిమాలు మానేయాలనుకున్నారట. యాభై ఏళ్లు దాటిన నేపథ్యంలో ఇక సినిమాలు మానేయాలనుకున్నారట. కానీ కొందరు శ్రేయోభిలాషులు సలహా మేరకు షూటింగ్‌లు చేశారు.

34
శోభన్‌బాబు సినిమాలు మానేయడం వెనుక లేడీ
Image Credit : youtube/etv

శోభన్‌బాబు సినిమాలు మానేయడం వెనుక లేడీ

అయితే ఆయన సినిమాలు మానేయడానికి, పబ్లిక్‌ కి దూరంగా ఉండటానికి ఒక కారణం ఉందట. జనాల్లో తాను ఎప్పటికీ సోగ్గాడిగానే నిలిచిపోవాలని, అందగాడిగానే ఉండాలని తాను కోరుకున్నారు. అందుకు ముందుగానే రిటైర్‌మెంట్‌ ఇవ్వాలనుకున్నారు. అయితే అరవై ఏళ్లు దాటాక ఆయన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లాడట. ఫంక్షన్‌ అయిపోయాక కారు వద్దకు వెళ్తుంటే ఒక లేడీ వచ్చి పలకరించిందట. ముసలితనం కనిపిస్తుందిగా అని అన్నదట. అంతే ఆ దెబ్బతో ఇక పబ్లిక్‌లోకి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నారట.

44
సినిమాలు మానేసి ఇంటికే పరిమితమైన సోగ్గాడు
Image Credit : our own

సినిమాలు మానేసి ఇంటికే పరిమితమైన సోగ్గాడు

ఆ తర్వాత నుంచి సినిమాలు మానేశారు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. తన గార్డెన్‌, ఇళ్లు, పుస్తకాలు చదివే రూమ్‌ అంతటికే పరిమితమయ్యారట. ఆ తర్వాత అభిమానులు వస్తే వారితో మాట్లాడేవారట. అంతకు ముందు అభిమానులను పట్టించుకోలేదని, రిటైర్‌మెంట్‌ తర్వాత మాత్రం వారిని ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని, వారికి టైమ్‌ కేటాయించేవారని సీనియర్‌ జర్నలిస్ట్, రైటర్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు. 1959లో `దైవబలం` అనే సినిమాతో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన శోభన్‌బాబు.. 1996లో హలో గురు చిత్రంతో సినిమాకు గుడ్‌ బై చెప్పారు. అరవై ఏళ్లకే ఆయన రిటైర్‌మెంట్‌ తీసుకొని ఫ్యామిలీకే పరిమితమయ్యారు. 2008లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. సోగ్గాడు మన మధ్యలో లేకపోయినా తన సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun Vs Rohith: నక్కలని కొట్టాలంటే నక్కలాగే మారాలి, రోహిత్ పై త్రిగుణ్..చెంప పగులుద్ది, బయట చూసుకుందాం
Recommended image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ బాల్యంలో గడిపిన స్థలం.. పుట్టపర్తిలో రష్మిక ప్రత్యేక పూజలు, ఫోటోస్ ఇవిగో
Recommended image3
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి సెకండ్ సింగిల్, బావుంది కానీ.. ట్రోలర్స్ కి ఛాన్స్ ఇచ్చిన తమన్
Related Stories
Recommended image1
Brahmanandam: కోటీశ్వరులు కావడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం.. ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు రావట
Recommended image2
Udaya Bhanu: భర్త గురించి నిజాలు బయటపెట్టిన ఉదయ భాను.. ఆయన హస్బెండ్‌ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved