- Home
- Entertainment
- Brahmanandam: కోటీశ్వరులు కావడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం.. ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు రావట
Brahmanandam: కోటీశ్వరులు కావడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం.. ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు రావట
డబ్బులు సంపాదించడం కోసం జనాలు చాలా కష్టాలు పడుతున్నారు. డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కానీ బ్రహ్మానందం దానికి సింపుల్ ట్రిక్ చెప్పాడు. అది చేస్తే కోటీశ్వరులు అవడం పక్కా అట.

డబ్బులు సంపాదించడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం
డబ్బులు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరు నానా తంటాలు పడుతుంటారు. అనేక రకాల పనులు చేస్తుంటారు. కొందరికి ఎంత కష్టపడ్డా డబ్బులు రావు. ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో డబ్బులు సంపాదించడానికి సంబంధించిన సింపుల్ ట్రిక్ చెప్పాడు. ఇలా చేస్తే ఎలాంటి సంక్షోభం వచ్చినా ఇతరులను చేయి చాచే అవసరం రాదట. మరి బ్రహ్మానందం ఏం చెప్పాడనేది చూస్తే.
డబ్బుని ప్రేమిస్తే, డబ్బు మనల్ని ప్రేమిస్తుంది
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సింపుల్ ట్రిక్ చెప్పాడు. అదే డబ్బుని ప్రేమించడం. డబ్బుని మనం ప్రేమిస్తే డబ్బు మనల్ని ప్రేమిస్తుందట. దీనికి సంబంధించిన ఒక డైలాగ్ చెప్పారు బ్రహ్మీ. `డబ్బుకి ప్రతి వాడు రెస్పెక్ట్ ఇవ్వాలని, భార్యామూలం మిదం గృహం, కృషి మూలం మిదం వ్యవసాయం, ధనం మూలం మిదం జగత్తు` అని తెలిపాడు. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూశారు. ఇతరుల కోసం చేతులు చాచే పరిస్థితి వచ్చింది. కానీ ఏ ఒక్కరికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇతరుల వద్ద చేయి చాచే పరిస్థితి రాకూడదు. అందుకే డబ్బుని మనం ప్రేమిస్తే, అది మనల్ని ప్రేమిస్తుంది. డబ్బు కొరత ఉండదు` అని తెలిపారు.
కోటీశ్వరులు కావాలంటే ఈ పని చేయాల్సిందే
ఈ లెక్కన బ్రహ్మానందం డబ్బుని సంపాదించడానికి ఈజీ మార్గం చెప్పారని చెప్పొచ్చు. డబ్బుని ఎంత ఎక్కువ ప్రేమిస్తే, అంత ఎక్కువగా సంపాదించవచ్చు, కోటీశ్వరులు కావచ్చు అని బ్రహ్మానందం చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. నిజానికి ఆయన చెప్పింది నిజమే డబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కడ ఎంత ఖర్చుచేయాలో అంతే చేస్తే, ఆర్థిక ఇబ్బందులు రావు, అదే సమయంలో డబ్బుని ప్రేమిస్తే, సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. దానికోసం కష్టపడతాం. సంపాదిస్తాం. అది అంతిమంగా మనల్ని ఆర్థికంగా మంచి స్థానంలో ఉంచుతుంది. వారి వారి స్థాయిలను బట్టి కోటీశ్వరులను చేస్తుందని చెప్పొచ్చు.
బ్రహ్మానందానికి తగ్గిన సినిమాలు
బ్రహ్మానందం ఒకప్పుడు కామెడీ ప్రపంచాన్ని శాసించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. కమెడియన్గా అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా నిలిచారు. ఇప్పుడు తగ్గించారు. కొత్త హాస్యనటులు రావడంతో బ్రహ్మానందానికి ఆఫర్లు తగ్గాయి. పైగా ఆయన కూడా చాలా సెలక్టీవ్గా వెళ్తున్నారు. ఇటీవల `మహేంద్రగిరి వారాహి` మూవీలో ఆయన నెగటివ్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే.

