MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10 :హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే నోటికి పని చెప్పిన షాలిని..గేమ్ లో సత్తా చూపించిన రామ్ ప్రసాద్

Bigg Boss 10 :హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే నోటికి పని చెప్పిన షాలిని..గేమ్ లో సత్తా చూపించిన రామ్ ప్రసాద్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా 45వ రోజు బిగ్ బాస్ ఊహించని గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో రామ్ ప్రసాద్, ఝాన్సీ సత్తా చాటారు. ఫైనల్ గా ఒకరినే విజయం వరించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 21 2026, 11:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ హౌస్ లో 45వ రోజు షాలిని రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెని ఎలిమినేట్ చేసినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్ లో ఉంచారు. కానీ షాలిని బిగ్ బాస్ ఆదేశాలతో బుధవారం రోజు హౌస్ లోకి సడెన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. దీనితో అంతా సర్ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ ఆమెని హగ్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. షాలిని రాగానే నోటికి పని చెప్పింది. టాస్క్ లో భాగంగా ఆమె దక్షిపై విరుచుకుపడింది. అసభ్యంగా మాట్లాడబోయి కంట్రోల్ చేసుకుంది. కొన్నిసార్లు ఆమెని ఇతర సభ్యులు కంట్రోల్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఆసక్తికర గేమ్ మొదలు పెట్టారు. హౌస్ లోని సభ్యులని రెడ్, ఎల్లో, గ్రీన్ లెవల్ గా విభజించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్
Image Credit : Asianet News

రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్

ఆటతీరుని బట్టి, ఆడియన్స్ ఓటింగ్ ని బట్టి బిగ్ బాస్ కొందరిని రెడ్ లెవల్ లో , మరికొందరిని ఎల్లో లెవల్ లో ఉంచారు. రెడ్ లెవల్ లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్లు. ఝాన్సీ, రామ్ ప్రసాద్, రోహిత్, స్వేత, సుధీర్, ఆర్కే, షాలిని, వంశీ రెడ్ లెవల్ లో ఉన్నారు. త్రిగున్, నరేష్, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, అమన్, శివ కుమార్ ఎల్లో లెవల్ లో ఉన్నారు. నెక్స్ట్ లెవల్ గ్రీన్. గ్రీన్ కి చేరుకున్న వాళ్లకు బిగ్ బాస్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి.

34
బిగ్ బాస్ ఇచ్చిన గేమ్
Image Credit : Asianet News

బిగ్ బాస్ ఇచ్చిన గేమ్

ఎల్లో ఉన్న వాళ్లు గ్రీన్ కి చేరుకోవడానికి ఒక్క అడుగు మాత్రమే దూరం. ముందుగా రెడ్ లెవల్ లో ఉన్న వాళ్ళు ఎల్లో కి చేరుకోవాలి. దీనితో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక సర్కిల్ లో బోన్ లాంటిదాన్ని ఉంచుతారు. రెడ్ లెవల్ లో ఉన్న సభ్యులు సర్కిల్ చుట్టూ నిలబడి బజర్ మోగినప్పుడు బోన్ ని దక్కించుకోవాలి. ఎవరైతే బోన్ ని దక్కించుకుంటారో వాళ్ళు అక్కడ అమర్చిన బాక్స్ లని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ చేసినప్పుడు బాక్స్ నుంచి ఎల్లో కలర్ వస్తే వాళ్ళు గేమ్ నుంచి ఒకరిని కానీ లేదా ఇద్దరినీ కానీ బిగ్ బాస్ చెప్పినట్లు ఎలిమినేట్ చేయొచ్చు.

44
పోరాడిన ఝాన్సీ, విజయం రామ్ ప్రసాద్ దే..
Image Credit : Asianet News

పోరాడిన ఝాన్సీ, విజయం రామ్ ప్రసాద్ దే..

అలా చివరి రౌండ్ వరకు ఎవరు మిగిలితే వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో సుధీర్, రామ్ ప్రసాద్, ఝాన్సీ, స్వేత గాయాలు అవుతున్నా తెగించి గేమ్ ఆడారు. వాళ్ళ ఆటతీరు బావుంది. కానీ చివరికి మిగిలింది రామ్ ప్రసాద్, ఝాన్సీ మాత్రమే. ఫైనల్ రౌండ్ లో రామ్ ప్రసాద్ విజయం సాధించాడు. దీనితో రామ్ ప్రసాద్ రెడ్ లెవల్ నుంచి ఎల్లో లెవల్ కి చేరుకున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor: రామాయణ ఈవెంట్ లో నోరు జారిన రణబీర్ కపూర్.. ఆడుకుంటున్న నెటిజన్లు!
Recommended image2
AK47: 20 ఏళ్ళ తర్వాత మ్యాజిక్, ఆదర్శ కుటుంబంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో
Recommended image3
నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన
Related Stories
Recommended image1
నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన
Recommended image2
Nithiin Super Hit Movie: నితిన్ సూపర్ హిట్ మూవీకి రచయిత, తీవ్ర అవమానం.. సారీ కూడా చెప్పకుండా ఏం చేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved