MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది

ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది

Sobhan Babu : కష్టాల్లో ఉన్న శోభన్ బాబుని ఆదుకోవడానికి కృష్ణ ముందుకు వచ్చారు. కానీ కృష్ణకే శోభన్ బాబు నమ్మక ద్రోహం చేశారు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శోభన్ బాబు కష్టాలు
Image Credit : Asianet News

శోభన్ బాబు కష్టాలు

సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ ఒక సందర్భంలో కృష్ణ, శోభన్ బాబు మధ్య విభేదాలు తలెత్తాయి. కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే స్టార్ హీరోగా ఎదిగారు. కానీ శోభన్ బాబుకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. హీరోగా అవకాశాలు వచ్చిన తర్వాత కూడా ఒక దశలో శోభన్ బాబు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణని సాయం కోరిన శోభన్ బాబు 
Image Credit : Asianet News

కృష్ణని సాయం కోరిన శోభన్ బాబు 

ఆ టైంలో శోభన్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ నుంచి సాయం ఆశించారట. ఈ విషయాన్ని కృష్ణ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శోభన్ బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఆ టైంలో శోభన్ బాబు నన్ను సాయం కోరారు. ఓ వ్యక్తి ద్వారా నాకు కబురు పంపారు. నేను ఫ్లాపుల్లో ఉన్నాను. నిర్మాతలు రావడం లేదు. కృష్ణతో నాతో కలసి నటించమని చెప్పండి. మేమిద్దరం కలిసి నటిస్తే బావుంటుంది. నాకు కూడా సాయంగా ఉంటుంది. మంచి పేరు వస్తుంది. కృష్ణనే ఆ సినిమాని నిర్మించమని చెప్పండి అని శోభన్ బాబు నా దగ్గరకి ఓ వ్యక్తిని పంపారు. 

35
హిట్ పడగానే ప్లేట్ తిప్పేసిన శోభన్ బాబు 
Image Credit : Social Media

హిట్ పడగానే ప్లేట్ తిప్పేసిన శోభన్ బాబు 

నేను వెంటనే ఆ ప్రపోజల్ కి ఒకే చెప్పను. శోభన్ బాబు, నా కాంబినేషన్ లో మూవీ కంఫర్మ్ అని చెప్పాను. శోభన్ బాబుకి అడ్వాన్స్ గా 25 వేలు డబ్బు ఇచ్చి పంపాను. ఆ టైంలో శోభన్ బాబు నటిస్తున్న మల్లెపూవు మూవీ విడుదలై హిట్ అయింది. కొన్ని రోజుల తర్వాత స్టోరీ రెడీ చేసి శోభన్ బాబు దగ్గరకి పంపాను. మల్లెపూవు హిట్ కావడంతో ఇక నా సాయం అవసరం లేదని శోభన్ బాబు భావించారు. కథ నాకు నచ్చలేదు.. కృష్ణతో నేను సినిమా చేయను అని నమ్మక ద్రోహం చేశాడు. 

45
కృష్ణ, ఏఎన్నార్ కాంబినేషన్ 
Image Credit : our own

కృష్ణ, ఏఎన్నార్ కాంబినేషన్ 

 అడ్వాన్స్ డబ్బు కూడా వెనక్కి పంపేశాడు. నాకు కోపం వచ్చింది. శోభన్ బాబుని మించిన స్టార్ తో  వారంలోగా మనం సినిమా మొదలు పెట్టాలి అని విజయ నిర్మలకు చెప్పాను. వెళ్లి ఏఎన్నార్ ని తనతో కలసి సినిమా చేయమని రిక్వస్ట్ చేశాం. అప్పటికి దేవదాసు విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న విభేదాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి జాలీగా, మంచి స్నేహితులుగా ఈ సినిమాలో కలసి వర్క్ చేద్దాం అని ఏఎన్నార్ కి చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. 

55
శోభన్ బాబు మైండ్ బ్లాక్ చేసిన కృష్ణ 
Image Credit : our own

శోభన్ బాబు మైండ్ బ్లాక్ చేసిన కృష్ణ 

అమితాబ్ బచ్చన్ డాన్ మూవీ స్ఫూర్తితో కథ రెడీ చేశాం.  ఆ చిత్రమే హేమా హేమీలు. విజయ నిర్మల దర్శకత్వం వహించింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా గురించి న్యూస్ పేపర్ లో శోభన్ బాబు తెలుసుకుని షాక్ అయ్యారు. ఇంత త్వరగా వీళ్ళకి ఎలా సాధ్యం అయింది అని శోభన్ బాబు కంగుతిన్నట్లు కృష్ణ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని
శోభన్ బాబు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image2
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Related Stories
Recommended image1
వరుసగా 5 అట్టర్ ఫ్లాపులు తీసిన డైరెక్టర్ తో నితిన్ సినిమా, అస్సలు ఊహించలేరు..ఈ కాంబోలో మూవీ అంటే పెద్ద రిస్కే
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9లో మెగా వర్సెస్ అల్లు, కారణం వాళ్ళిద్దరేనా.. నాగబాబు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ మధ్య మరింత రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved