- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9లో మెగా వర్సెస్ అల్లు, కారణం వాళ్ళిద్దరేనా.. నాగబాబు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ మధ్య మరింత రచ్చ
బిగ్ బాస్ తెలుగు 9లో మెగా వర్సెస్ అల్లు, కారణం వాళ్ళిద్దరేనా.. నాగబాబు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ మధ్య మరింత రచ్చ
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో విషయంలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొలి వారంలోనే రసవత్తరంగా మారింది. నటి సంజన, ఫ్లోరా షైనీ లాంటి కంటెస్టెంట్స్ హంగామా మొదలు పెట్టారు. నటుడు భరణి, కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ లాంటి సెలెబ్రిటీలు ఎలాగూ ఉన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభమైందో లేదో అప్పుడు తమ అభిమాన కంటెస్టెంట్స్ కి మద్దతు తెలిపే గ్రూపులు, సోషల్ మీడియా పేజీలు సిద్ధం అయిపోయాయి. ఇది ప్రతి సీజన్ లో జరిగే తంతే.
కొందరు కంటెస్టెంట్స్ పైడ్ ప్రమోషన్స్ చేయించుకుంటారు అనే ప్రచారం కూడా ఉంది. తమ అభిమాన కంటెస్టెంట్స్ కి మద్దతు తెలిపే క్రమంలో నెటిజన్లు మరో కంటెస్టెంట్ ని ట్రోల్ చేయడం కూడా సాధారణంగానే జరుగుతోంది. అయితే సీజన్ 9లో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ తెలుగు 9 విషయంలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. సాధారణంగా అల్లు, మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవకి దిగేది ఎందుకు ? అని అంటే.. అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాల విషయంలో కానీ.. పవన్ కళ్యాణ్ రాజకీయాలకి సంబంధించి కానీ గొడవలు జరుగుతుంటాయి అనే వాదన వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు అంటే.. కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 9లో కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. శ్రేష్ఠి వర్మ గతంలో గాను లైంగిక వేధింపులకు గురయ్యానని పోలీసులని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. జానీ మాస్టర్ పైనే శ్రేష్ఠి వర్మ ఆరోపణలు చేసింది. ఆ సమయంలో శ్రేష్ఠి వర్మకి అల్లు ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్.. శ్రేష్ఠి వర్మకి సపోర్ట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది.
ప్రముఖ బుల్లితెర నటుడు భరణి కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. భరణి శంకర్ కి నాగబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నారు. గతంలో భరణి శంకర్ నాగబాబుతో శిఖరం అనే టివి సీరియల్ లో నటించారు. ఆ అనుబంధంతో భరణి శంకర్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళినప్పుడు మద్దతు తెలుపుతూ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ కారణంతోనే కొందరు అల్లు ఫ్యాన్స్ శ్రేష్ఠి వర్మకి కొందరు మెగా ఫ్యాన్స్ భరణి శంకర్ కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో 100 రోజులకు పైగా ఉంటుంది. మరి ఈ టైంలో మెగా, అల్లు ఫ్యాన్స్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.