- Home
- Entertainment
- వరుసగా 5 అట్టర్ ఫ్లాపులు తీసిన డైరెక్టర్ తో నితిన్ సినిమా, అస్సలు ఊహించలేరు..ఈ కాంబోలో మూవీ అంటే పెద్ద రిస్కే
వరుసగా 5 అట్టర్ ఫ్లాపులు తీసిన డైరెక్టర్ తో నితిన్ సినిమా, అస్సలు ఊహించలేరు..ఈ కాంబోలో మూవీ అంటే పెద్ద రిస్కే
వరుస ఫ్లాపుల కారణంగా నితిన్ నటించాల్సిన తదుపరి చిత్రం ఎల్లమ్మ కూడా హోల్డ్ లో పడింది. నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్.

యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. గతంలో నితిన్ కి పదేళ్ల పాటు విజయాలు లేవు. ఆ టైంలో నితిన్ ఇష్క్ చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి సాలిడ్ గా తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ అప్పటి పరిస్థితులని గుర్తు చేసేలా నితిన్ కి వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి.
వరుస ఫ్లాపుల కారణంగా నితిన్ నటించాల్సిన తదుపరి చిత్రం ఎల్లమ్మ కూడా హోల్డ్ లో పడింది. తనకి ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ కమిటయ్యారు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు.
ఈలోపు నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్. ఆగడు చిత్రం నుంచి వరుసగా అట్టర్ ఫ్లాపులు తీస్తున్న శ్రీను వైట్లకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. శ్రీను వైట్ల ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ కథపై నమ్మకంతోనే నితిన్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రచయిత నందు కథ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండటం మరో ఆశ్చర్యకర అంశం. ఎందుకంటే శ్రీనువైట్లతో మైత్రి సంస్థ అమర్ అక్బర్ ఆంటోని నిర్మించారు. ఆ మూవీ ఊహించని డిజాస్టర్ అయింది. నితిన్ రాబిన్ హుడ్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో కూడా భారీగా నష్టపోయారు. అయినప్పటికీ నితిన్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో సినిమా నిర్మించేందుకు మైత్రి నిర్మాతలు ముందుకు వచ్చారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కంటే ముందుగానే శ్రీనువైట్ల చిత్రాన్ని నితిన్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.