- Home
- Entertainment
- Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Balakrishna Favourite : అఖండ 2 తో థియేటర్లలో తాండవమాడుతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక ఆయన కెరీర్ లో బాగా ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా..? ఆ ఇద్దరు మాత్రమే ఎందుకు ఇష్టం.

బాలయ్య అఖండ తాండవం..
నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ తాండవం చేస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్ బాలయ్య నటించిన నాలుగో సినిమా అఖండ 2 ఈరోజు ( డిసెంబర్ 12) థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్ తో దూసుకుపోయింది. అఘోరాగా బాలయ్య ను చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా అడ్డంకులు ఫేస్ చేసింది. కాగా ఈసినిమాతో వరుసగా 5 సూపర్ హిట్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు బాలకృష్ణ.. ఇంకొక్క సినిమా హిట్ అయితే.. డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ తో రేర్ రికార్డును బాలయ్య ఖాతాలో వేసుకోవడం ఖాయం. 65 ఏళ్ల వయసులో కుర్ర హీరోలు కూడా సాధించలేని విజయాలు సాధిస్తూ.. దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.
బాలకృష్ణకు విపరీతమైన ఇష్టం..
నందమూరి వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ .. సొంత ట్యాలెంట్ తో ఎదిగి చూపించారు. వరుస సక్సెస్ లతో నందమూరి నట వారసత్వాన్ని నిలబెట్టారు. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సాధించి.. తనకంటూ సొంతంగా భారీ ఫాలోయింగ్ ను, అభిమానులను కూడా సంపాదించుకున్నారు. అయితే ఆయన తన జీవితంలో బాగా ఇష్టపడే హీరో ఎవరో కాదు ఆయన తండ్రి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. తన తండ్రి ననటన అంటే ఆయనకు ఎంతో ఇష్టం. కొన్ని విషయాలలో ఆయన ఎన్టీఆర్ నే ఫాలో అవుతుంటారు. క్రమశిక్షణ విషయంలో రామారావుని ఆదర్శంగా తీసుకుంటారు బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఒక దేవుడు లాంటివాడని బాలయ్య ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇక ఎన్టీ రామారావు కాకుండా బాలయ్య కు తెలుగు పరిశ్రమలో మరో హీరో అంటే కూడా ఇష్టమట.
ఎన్టీఆర్ కాకుండా బాలయ్య ఫేవరెట్ హీరో
సీనియర్ ఎన్టీఆర్ పాత తరం హీరో.. బాలయ్యకు ముందు నుంచి ఆయనే ఇష్టం. ఇక పెద్దాయన కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ తరం హీరోల్లో బాలకృష్ణకు మరో ఫేవరెట్ హీరో ఉన్నారు. ఆయన మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అవును బాలయ్యకు టాలీవుడు నుంచి నచ్చిన హీరో ప్రభాస్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో బాలయ్య చెప్పుకొచ్చారు కూడా. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని పలు సందర్భాల్లో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాను పాన్ ఇండియాలోకి తీసుకెళ్లిన మొదటి హీరోగా బాలకృష్ణ ప్రశంసలు అందుకున్నారు ప్రభాస్.
బాలకృష్ణకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
బాలకృష్ణకు ఇష్టమైన హీరోయిన్ ఒకరు కాదు చాలామంది ఉన్నారు. హీరోయిన్లలో బాగా నటించేవారు, బాలయ్య ఫెవరేట్ హీరోయిన్లలో ముందుగా సావిత్రి గారు ఉంటారు. ఆతరువాత తరం హీరోయిన్లలో విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ అంటే బాలయ్యకు ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. బాలకృష్ణకు గతంలో పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంగా నందమూరి ఫ్యామిలీ అంతా ఒక స్పెషల్ ఈవెంట్ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణకు వారి ఫ్యామిలీ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
నయనతార కూడా
ఈ క్రమంలో బాలయ్య సోదరి నారా భుననేశ్వరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముగ్గురు హీరోయిన్లు పేర్లు చెప్పారు బాలకృష్ణ. అంతే కాదు నటసింహం ఫెవరేట్ హీరోయిన్ల లిస్ట్ లో నయనతార కూడా ఉన్నారు. ఆమె నటన నచ్చి వరుసగా అవకాశాలు కూడా ఇచ్చాడు బాలకృష్ణ. ఆయనతో కలిసి దాదాపు మూడు సినిమాల్లో నటించింది నయనతార. బాలకృష్ణ నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో చేయబోయే సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.

