- Home
- Entertainment
- Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
హీరోగా కథ బాగుంటేనే సినిమా చేసేవారు శోభన్ బాబు. తన పాత్రకు ఇంపార్టెన్స్ తగ్గితే నటించేవారు కాదు. అలా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భం ఒకటి ఉంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా హీరో?

కథ విషయంలో చాలా స్ట్రిక్ట్
అందాల నటుడు శోభన్ బాబు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. అనవసర ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు. అయితే డబ్బు విషయంలో మాత్రమే కాదు.. సినిమాల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు శోభన్ బాబు. కథలు సెలక్ట్ చేసుకునే విషయంలో ఆయన అందరు హీరోల కంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. గ్లామర్ హీరోగా మంచి పేరు సంపాదించిన ఆయన.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఉండే సినిమాలను అస్సలు ఒప్పుకునేవారు కాదట. డీ గ్లామర్ రోల్స్ చేయడం శోభన్ బాబుకు నచ్చేది కాదు. అంతే కాదు తన పాత్ర కంటే హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువన్నా కానీ.. ఆసినిమానను రిజెక్ట్ చేసేవారు శోభన్ బాబు. అలానే ఓ సినిమాను రిజెక్ట్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ అయ్యారు నటభూషణుడు.
శోభన్ బాబు మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..
శోభన్ బాబు మిస్ అయిన ఆ సినిమా మరేదో కాదు పొట్టేలు పున్నమ్మ. త్యాగరాజన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ సినిమా కోసంముందుగా శోభన్ బాబును తీసుకోవాలని అనుకున్నారట నిర్మాత. అయితే ఈసినిమా కథ విన్న తరువాత శోభన్ బాబు వెంటనే ఈసినిమాను రిజెక్ట్ చేశారట. ఎందుకంటే.. ఈసినిమాలో హీరో కంటే హీరోయిన్ పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది. టైటిల్ కూడా పొట్టేలు పున్నమ్మ అని.. ఆమె చుట్టునే కథ నడుస్తుంది. ఇటువంటి సబ్జెక్ట్స్ తాను చేయను.. చేసినా ఆడవుఅని శోభన్ బాబు నిక్కచ్చిగా చెప్పేశారట. దాంతో ఈసినిమాలో హీరోగా మురళీమోహన్ కు ఛాన్స్ ఇచ్చారు.
బ్లాక్ బస్టర్ హిట్ పొట్టేలు పున్నమ్మ
శోభన్ బాబు వద్దని రిజెక్ట్ చేసిన పొట్టేలు పున్నమ్మ సినిమాలో మురళీ మోహన్ హీరోగా నటించి.. సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. త్యాగరాజన్ డైరెక్షన్ లో మరళీమోహన్, శ్రీప్రియ, మంచు మోహన్ బాబు, పద్మప్రియ ముఖ్య పాత్రలు పోషించిన ఈసినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 1978 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి కె వి మహదేవన్ సంగీతం సమకూర్చారు. మ్యూజికల్ కూడా ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. మురళీ మోహన్ తో పాటు మోహన్ బాబు కెరీర్ కు కూడా ఈసినిమా చాలా ఉపయోగపడింది.
60 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హీరో..
ఆంధ్రా అందగాడు, సోగ్గాడు,అందాల నటుడు ఎవరంటే ఎన్నితరాలు మారినా శోభన్ బాబు మాటే వినిపిస్తుంది. తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న శోభన్ బాబు.. 60 ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్ధిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్ బాబు, తను సినిమాల్లో సంపాదించిన ప్రతీ పైసా భూమిపైనే పెట్టాడు, రియల్ ఎస్టేట్ లో కోట్లు గడించాడు. రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ ను విస్తరించి దాదాపు 5 వేల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు. ఆయన స్పూర్తితోనే హీరో మురళీ మోహన్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి కోట్లలో సంపాదించారు. జయభేరి సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తూ.. అటు రియల్ వ్యాపారం కూడాచేశాడు మురళీ మోహన్. అయితే తాను నటించిన పొట్టేలు పున్నమ్మ సినిమా లో శోభన్ బాబు నటించాల్సి ఉందని.. ఆయన ఒప్పుకోకపోవడంతోనే తనకు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని మురళీ మోహన్ ఓ సందర్భంలో వెల్లడించారు.

