ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, 'అభినవ కృష్ణదేవరాయ' బిరుదు అందుకున్నారు. భగవద్గీత మానవత్వానికి అత్యున్నత ప్రణాళిక అని అభివర్ణించిన పవన్.. ధర్మం, రాజ్యాంగం లక్ష్యం ఒక్కటేనని అన్నారు.
పవన్ కళ్యాణ్ కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు
ధర్మం, రాజ్యాంగం వేర్వేరు కాదని, రెండింటి ఉద్దేశం శాంతియుత సమాజ నిర్మాణమేనని టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం ఉడుపిలొని పుట్టిగే మఠంలో నెల రోజుల పాటు నిర్వహించిన బృహత్ గీతోత్సవ ముగింపు వేడుకలో పర్యాయ శ్రీ సుగుణేంద్ర తీర్థ నుంచి 'అభినవ కృష్ణదేవరాయ' బిరుదును పవన్ కల్యాణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు పవన్.
సనాతన ధర్మ శక్తిని నాశనం చేయడం అసాధ్యం
'కృష్ణ సన్నిధికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, శ్రీవారికి నమస్కారాలు' అని కన్నడలో ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్, కన్నడ రానందున ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని కొనసాగిస్తానని అన్నారు. ఇంగ్లీషు భాష భారతదేశ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుందని ..కానీ సనాతన ధర్మ శక్తి ముందు అది సాధ్యం కాలేదు. వేదాలు, గీత మన సంస్కృతిని కాపాడాయని'' పవన్ అన్నారు.
ఉడిపి ఆధ్యాత్మిక పవర్ హౌస్
‘’ఉడిపి ఒక ఆధ్యాత్మిక పవర్ హౌస్ లాంటిది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక ఆకర్షణను చూశాను. శ్రీవారు కోటి మందితో గీతను రాయిస్తున్నారు, నేను కూడా గీతా లేఖన యజ్ఞ సంకల్పాన్ని స్వీకరించాను, నేను కూడా భగవద్గీత రాస్తాను అన్నారు. యువత భగవద్గీతను తమతో ఉంచుకోవాలి. భగవద్గీత మానవత్వానికి అత్యున్నత ప్రణాళిక. మన రాజ్యాంగంలో కూడా భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత మూఢనమ్మకం కాదు, అదొక విజ్ఞానం. కృష్ణుడి జీవనోత్సవమే భగవద్గీత సారాంశం. కృష్ణుడు నా జీవితానికి ప్రేరణ. నాకు భగవద్గీత శ్లోకాలు తెలియవు, కానీ దాని శక్తి తెలుసు. నిష్కామ కర్మను భగవద్గీత నుంచే నేర్చుకున్నాను, అందుకే గెలుపోటములు నన్ను బాధించవు'' అని పవన్ అన్నారు.
భగవద్గీత బహుమతిగా
ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భగవద్గీతను బహుమతిగా ఇవ్వడం చాలా సమయోచితమైనది. అక్కడి ప్రస్తుత యుద్ధ సమయంలో పాఠం చెప్పే బహుమతి అది. గతం కంటే ఇప్పుడు భగవద్గీత మరింత ప్రాసంగికంగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు.పుట్టిగే మఠం చిన్న శ్రీ సుశ్రీంద్ర తీర్థ స్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం శ్రీ విద్యాప్రసన్న తీర్థ, మాయాపూర్ ఇస్కాన్ శ్రీ సుభాగ్ స్వామి గురుమహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పవన్ వెంటవెళ్లిన తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్ సభ్యులు ఆనంద్ సాయి, నరేష్ స్వామి, హైదరాబాద్ వ్యాపారవేత్తలు రాఘవేంద్ర హెబ్బార్, మురళీ బల్లాల్‌ను శ్రీవారు సత్కరించారు.
పాఠ్యాంశాల్లో గీతను చేర్చండి
పుట్టిగే మఠం శ్రీవారు మాట్లాడుతూ.. ‘’ మన కన్నడ రాష్ట్రంలో పాఠ్యాంశాల్లో భగవద్గీత చేర్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో గీతను చేర్చి, ఈ విషయంలో ముందుండి నిర్ణయం తీసుకోండి'' అని పుట్టిగే శ్రీవారు డీసీఎం పవన్ కళ్యాణ్‌కు సలహా ఇచ్చారు. ‘’ఆంధ్ర పాఠ్యాంశాల్లో ఇప్పటికే ఆచార్య శంకరులు, రామానుజాచార్యులు, బసవన్నల గురించి పాఠాలు ఉన్నాయి. అలాగే ఆచార్య మధ్వుల పాఠాన్ని చేర్చండి. త్యాగరాజు 24,000 కీర్తనలు రాశారు, కానీ కేవలం 700 కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంపై పరిశోధన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీవారు ;పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు.


