- Home
- Entertainment
- Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
Rithu Remuneration : అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొక్కటి. ఈసారి సుమన్ శెట్టి ఎలిమినేషన్ పక్కా అనుకుంటే.. రీతూను బయటకు పంపించి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక 13 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందుకు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

మళ్లీ మిస్సైన సుమన్ శెట్టి..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు వచ్చింది. ఎండ్ కార్డుకు ఇంకా వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఇక 13వ వారం బిగ్ బాస్ నుంచి పక్కాగా సుమన్ శెట్టి బయటకు వెళ్తాడు అని అంతా అనుకున్నారు. నామినేషన్స్‌లో రీతూ, భరణి, సుమన్, సంజన లు డేంజర్ జోన్‌లో ఉండగా.. సుమన్ కంటే మిగిలిన వారు చాలా స్ట్రాంగ్ కదా.. పక్కాగా సుమన్ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరిగింది. అంతే కాదు ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చనే టాక్ వినిపించింది. హౌస్ లో 8 మంది ఉండగా.. ఈవారం ఇద్దరు.. చివరి వారంలో ఒకరు బయటకు వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా అందరికి షాక్ ఇస్తూ.. చివరి నిమిషంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రీతూ చౌదరిని ఎలిమినేట్ చేశారు. టాప్ 5 లో ఉంటుంది అనుకున్న రీతూ.. ఎలిమినేట్ అవ్వడంతో.. సుమన్ శెట్టిని కావాలనే కాపాడుతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.
రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు
రీతూ చౌదరి మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. అయితే ఆమె ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం అస్సలు నచ్చలేదు. పవన్ తో ఆమె ట్రాక్ ను చాలామంది ఎంజాయ్ చేసినా.. కొంతమందికి ఇది నచ్చలేదు. రీసెంట్ గా సంజన ఎపిసోడ్ లో రీతూ బాగా నెగెటివిటీని మూటగట్టుకుంది. ఇక పవన్ తో కాంబినేషన్ బాగుందన్న కారణంతోనే ఆమెను సేవ్ చేస్తున్నారు అన్న టాక్ కూడా వినిపించింది. రీతూపై ఎంత నెగెటీవ్ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఆమె గేమ్ తో ఆకట్టుకుంది. ప్రతీ విషయంలో స్టాండ్ తీసుకుని తన వాయిస్ ను గట్టిగా వినిపించింది. తను మాత్రమే కాదు.. పవన్ తరపున కూడా తానే మాట్లాడి తెలియకుండానే అతడిని డమ్మీని చేసింది. ఇది కూడా ఆమెకు నెగెటీవ్ గా మారింది. అంతే కాదు రీతూ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతోందని విమర్శలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆమె ఓటింగ్ పై గట్టిగా ప్రభావం చూపించాయి. అతే ఇప్పటికే ఆమె ఎలిమినేట్ అయ్యి ఉండాల్సింది... ఇక్కడి వరకూ వచ్చింది కానీ.. సుమన్ శెట్టి కంటే తక్కువ ఓట్లతో బయటు వెళ్లాల్సిన కంటెస్టెంట్ మాత్రం ఆమె కానే కాదు. రీతూ టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ చివరి నిమిషం ట్విస్ట్‌తో హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
రీతూ చౌదరి రెమ్యునరేషన్
ఇక రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉంది. అంటే దాదాపు టాప్ 5 కంటెస్టెంట్స్ కు ఏమాత్రం తక్కువ కాదు. ఆమె టెలివిజన్ సెలబ్రిటీ, సోషల్ మీడియా స్టార్ కూడా.. దాంతో రీతూకు రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందన్న టాక్ ఉంది. బిగ్ బాస్ నుంచి ఆమె భారీగానే వసూలు చేసిందని అంటున్నారు. బిగ్ బా్ విన్నర్ రేంజ్ లో రీతూ చౌదరి తీసుకుందని టాక్. రీతూ బిగ్ బాస్ లో ఉన్నందకు రోజుకు 30 వేల నుంచి 40 వేల మధ్య వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె వారానికి 2 లక్షలకు పైగా సంపాదించినట్టు సమాచారం. 13 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందుకు సుమారు 35 లక్షలకు పైగా రీతూ చౌదరి సంపాదించినట్టు అంచనా. అధికారికంగా తెలియకపోయినా.. ఇది నిజమైతే ఈ సీజన్‌లో టాప్ రెమ్యునరేషన్ రీతూదే అవుతుంది.
సోషల్ మీడియా స్టార్
జబర్దస్త్ షోతో స్టార్ గా మారిన రీతూ చౌదరి నెమ్మదిగా సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీని సంపాదించింది. బోల్డ్ బ్యూటీగా ఆమెకు పేరుంది. గ్లామర్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. నెట్టింట భారీగా ఫాలోవర్స్ పెంచుకుంది రీతూ.. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరికి 1.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ నటిగా మాత్రమ కాదు.. రీతూ కొన్నిసినిమాల్లో కూడా నటించింది. యాంకర్ గా కూడా రాణించింది. సోషల్ మీడియా పాపులారిటీ ఆమెను బిగ్ బాస్ వరకూ నడిపించింది. రీతూ హౌస్‌లోకి అడుగుపెట్టే వరకు ప్రేక్షకుల్లో పెద్దగా నెగెటివిటీ లేకపోయినా, బిగ్ బాస్ జర్నీలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
బిగ్ బాస్ ఆమెకు కలిసొస్తుందా?
బిగ్ బాస్ ఇమేజ్ చాలామందికి కలిసిరాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తరువాత చాలామంది స్టార్స్ అసలు కనిపించకుండా పోయారు. కొంత మంది మాత్రం బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మంచి మంచి ప్రాజెక్ట్స్ ను సాధించారు. మరి రీతూ చౌదరి కెరీర్ ఎలా ఉండబోతోంది..? బిగ్ బాస్ రీతూకు కలిసొస్తుందా? ఆమె పాపులారిటీ ఇంకా పెరుగుతుందా..? లేక చాలా మందిలా ఆమె కూడా ఇండస్ట్రీలో కనుమరుగవుతుందా చూడాలి.

