49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
ఫిల్మ్ ఇండస్ట్రీ లో నటిగా స్టార్ డమ్ చూసిన ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ కూడా లో దూసుకుపోతోంది. ఏదో సరదాకి, ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తుందిలే అనుకుంటే.. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది.

నటి మాత్రమే కాదు..
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలిసిందే. సినిమాల్లో అమ్మ, వదిన, అక్క పాత్రలో అద్భుతంగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా వీడియోలు, ఫోటోలతో సందడి చేస్తుంది. ఇక ఆమె నటిగా మాత్రమే కాకుండా.. ఫిట్ నెస్ వీడియోలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె వీడియోలు చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ప్రగతీ ఫిట్నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే.. డైలీ వర్కౌట్లు, యోగా, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. షూటింగ్ లేకపోతే జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతుంటుంది ప్రగతి. వెయిట్ లిఫ్టింగ్ లో నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించింది కూడా.
సరదాకు చేస్తుంది అనుకుంటే?
ప్రగతి ఏదో ఫిట్ నెస్ కోసం.. హోమ్ వర్కౌట్లు చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆమె టార్గెట్ ఏంటో తరువాత తరువాత అందరికి తెలిసింది. ఆమె సాధిస్తూ వస్తున్న సక్సెస్ లు చూసి . అంతా నోరెళ్ళబెట్టారు. ఆమె సరదాకు చేస్తుంది అనుకున్న వెయిట్ లిఫ్టింగ్, జిమ్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతే కాదు పోటీలకు కూడా సై అంది. జాతీయ స్థాయిలో నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన ప్రగతి.. తాజాగా ఇంటర్నేషనల్ లెవల్లో ఇండియాకు మెడల్ ను కూడా సాధించింది.
వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించిన ప్రగతి
గత కొంతకాలంగా వెయిట్ లిఫ్టింగ్‌లో సీరియస్‌గా తీసుకున్న ప్రగతి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఇప్పటికే అనేక పతకాలు సాధించింది. తన ట్రైనింగ్ , పోటీల్లో సాధించిన విజయాలను ప్రగతి తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తోంది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్టేజ్ పై మెరిసింది ప్రగతి. 2025 ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున పాల్గొన్న ప్రగతి, ప్రధానంగా 84 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ చూపింది. ఈ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ సాధించి ఇండియాకు ఘనత తీసుకువచ్చింది.
నాలుగు పతకాలు సాధించిన నటి
అంత కాదు ప్రగతి వీటికి అదనంగా డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, స్క్వాడ్ విభాగాల్లో ఒక గోల్డ్, రెండు సిల్వర్‌లు గెలుచుకుని మొత్తంగా నాలుగు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయాల వివరాలను ప్రగతి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, ఫిట్‌నెస్ కమ్యూనిటీ సభ్యులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. యాక్టింగ్ మాత్రమే కాదు.. ఇలా స్పోర్ట్స్ లో కూడా సత్తా చాటుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రగతి కూడా తన పోస్ట్‌లో ట్రైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన కోచ్ ఉదయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

