ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా, పాటల రచయితగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్న ధనుష్ తాజాగా తన తాజా సినిమా కుబేర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు.
నటన - దర్శకత్వం ధనుష్ కు ఏది ఇష్టం
రీసెంట్ గా ధనుష్ తాను నటిస్తున్న కుబేర సినిమా ఈవెంట్ లో ఓ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఆయన మాట్లాడుతూ, తనకు కెమెరా ముందు నటుడిగా కంటే, కెమెరా వెనుక దర్శకునిగా ఉండడమే ఎక్కువ ఇష్టమని అన్నారు."నన్ను నటుడిగా , దర్శకునిగా రెండింటి మధ్యలో నిలబెట్టి, ఒకటి సెలక్ట్ చేసుకోమంటే నేను ఖచ్చితంగా దర్శకత్వాన్నే ఎంచుకుంటాను," అని ధనుష్ స్పష్టం చేశారు.
అంతే కాదు అభిమానుల సంతోషం కోసమే తాను నటుడిగా కొనసాగుతున్నానని, లేదంటే పూర్తి స్థాయిలో దర్శకత్వం వైపే వెళ్ళేవాడినని ధనుష్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా , సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. తన అభిరుచి దర్శకత్వం పైన ఉండడం ధనుష్ ముందు ముందు దర్శకుడిగా అద్భుతమైన సినిమాలు చేస్తారని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
దర్శకుడిగా ధనుష్ సినిమాలు
రీసెంట్ గా ధనుష్ దర్శకునిగా చేసిన "పా పండీ" సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దర్శకుడిగా తన టాలెంట్‌ను మరోసారి రుజువు చేసిన ధనుష్, నటనకు తగ్గ విలువే దర్శకత్వానికి ఉన్నదని నిరూపిస్తున్నారు. ధనుష్ నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన రాయన్' సినిమాకు మంచి ప్రశంసలే అందుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న పలు ప్రాజెక్టులతో ధనుష్ బిజీగా వున్నాడు.
కాగా 'రాయన్'తో డైరెక్టర్ గా అందరి మెప్పు పొందిన ధనుష్ ఇదే ఎనర్జీతో రీసెంట్ గా తన మేనల్లుడిని హీరోగా పెట్టి జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది తెలుగు వర్షన్ టైటిల్ కాగా.. తమిళంలో నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం టైటిత్ తో తెరకెక్కింది. ఈసినిమా సూపర్ హిట్ కాకపోయినా.. దర్శకుడిగా ధనుష్ మేకింగ్‌కు, మంచి మార్కులే పడ్డాయి. దాంతో ధనుష్ దర్శకుడిగా సెటిల్ అవ్వడానికి రూట్ వెతుక్కుంటున్నట్టు అందరికి అర్ధం అయ్యింది. అందులోను ఆయనకు నటన కంటే ఎక్కువగా డైరెక్షన్ అంటేను ఇష్టం.

52 సినిమాను డైరెక్ట్ చేసుకుంటున్న ధనుష్
ఇక ధనుష్ తన 52వ సినిమాను కూడా తానే డైరెక్ట్ చేస్తున్నాడు. డాన్ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థలో ఆయన తన కెరీర్‌లో 52వ సినిమాను చేస్తున్నాడు. ఇడ్లీ కడాయి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ను ఆయనే స్వయంగా రచించి, దర్శకత్వం చేస్తున్నారు. ఈమూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నిత్యా మీనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ధనుష్ హీరోగా సినిమాలు దగ్గించి ఇక దర్శకుడగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింగర్ , రైటర్ గా ధనుష్
నటనతో పాటు, ధనుష్ గాయకుడు , పాటల రచయిత కూడా. ఇండియాలో ఫేమస్ అయిన వై దిస్ కొలవెరి డి ఈ పాటను ధనుష్ రాసి ఆలపించారు. ఇది ఒక వైరల్ హిట్ అయింది, ధనుష్ కు స్టార్‌డమ్ తీసుకువచ్చిందీ పాట. ఈ పాటతో పాటు, ధనుష్ రాసిన అనేక ఇతర హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ధనుష్ ఇప్పటికే తమిళ సినిమాల్లో చాలా పాటలు పాడారు. దీని తర్వాత ఇక రీసెంట్ గా కూడా దేవిశ్రీ కంపోజ్ చేసిన కుబేర సినిమాలో ఓ సూపర్ పాట పాడాడని తెలుస్తుంది. డీఎస్పీ కంపొజిషన్ లో ధనుష్ పాడిన తొలి పాట ఇదే కావడం విశేషం.
ధనుష్ కుబేర సినిమా సంగతులు
ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కుబేర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈసినిమా జూన్ 20 రిలీజ్ కాబోతోంది. ఈసందర్భంగా జరిగిన ప్రమోషన్స్ లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. భవిష్యత్తులో మరిన్ని సినిమాలను ఆయన దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఈ కామెంట్స్ తో అర్ధం అవుతోంది. అయితే, ఈ మాటలు పూర్తిగా ఆయన అభిమానుల్ని ఉద్దేశించినవని స్పష్టంగా తెలియజేశారు.
ధనుష్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నా, ఆయన లోపల ఉన్న దర్శకుడు ఇప్పుడిప్పుడే ఎక్కువగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కుబేర ప్రమోషన్‌లో బయటకు వచ్చిన ఈ కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ధనుష్ కెరీర్ పై ఆసక్తికర చర్చలకు దారితీశాయి.అటు ఫ్యాన్స్.. ఇటు కామన్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ధనుష్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఇడ్లీ కడాయి సినిమా రిజల్ట్ ను బట్టి.. దర్శకుడిగా ఆయన ప్రభావం బయటపడుతుంది.
