హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ విషయంలో వినుత్న ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. అందులో భాగంగా ఈసారి ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేశారు. మరీ ముఖ్యంగా రాజాసాబ్ సినిమా డైలాగ్ తో వాళ్ళు ఏం చేశారంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ ప్రస్తుతం భారీ అంచనాల మధ్య నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది. ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులలోనూ ఆసక్తిని కలిగించింది. కామెడీ డైలాగులు, అద్భుతమైన విజువల్స్‌తో టీజర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రభాస్ డైలాగ్స్ ను వాడేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్
ఇక ఈ టీజర్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిఫరెంట్ గా వాడేస్తున్నారు. ఈ టీజర్ డైలాగులను ట్రాఫిక్ అవగాహన కోసం కొత్తగా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ విషయంలో వినుత్న ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా రకరకాల ప్రయోగాలు చేసిన అనుభవం వారికి ఉంది. ఈక్రమంలో బాగా పాపులర్ అయిన విషయాలను ఈ విధంగా వాడేస్తుంటారు. అందులో భాగంగా ఈసారి ప్రభాస్ డైలాగ్స్ ను ఉపయోగించి మంచి సందేశం తయారు చేశారు. మరీ ముఖ్యంగా రాజాసాబ్ సినిమా డైలాగ్ ను వారు వాడిన విధానం అందరికి నచ్చింది.
జూన్ 16న తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ‘రాజాసాబ్’ టీజర్‌లో ఓ అద్భుతమైన డైలాగ్ ఉంది. బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంతమాత్రం. ఈ డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ట్రాఫిక్ పోలీసులు ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను సద్వినియోగం చేసుకున్నారు. దీనిపై ప్రత్యేకంగా వీడియోనే తయారు చేశారు.
రాజాాసాబ్ డైలాగ్స్ తో స్పెషల్ వీడియో తయారు చేసిన ట్రాఫిక్ పోలీస్
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ శాఖ వారు రూపొందించిన స్పెషల్ అవగాహన వీడియోలో, ప్రభాస్ ‘సాహో’ చిత్రం నుంచి “ఇట్స్ షో టైమ్” డైలాగ్‌తో వీడియో ప్రారంభమవుతుంది. దాన్ని అనుసరించి ఓ బైక్ వేగంగా వెళ్తున్న దృశ్యాన్ని చూపించారు. వెంటనే ‘రాజాసాబ్’ టీజర్ నుంచి “హలో హలో బండి కొంచెం మెల్లగా” డైలాగ్ వినిపిస్తుంది. తర్వాత ‘మిర్చి’ సినిమాలోని ప్రభాస్ నెమ్మదిగా బైక్ నడుపుతున్న సన్నివేశాన్ని జోడించారు. ఆ తర్వాత “అసలే మన లైఫ్ అంతంతమాత్రం” డైలాగ్ వినిపించి, చివరగా ప్రభాస్ హెల్మెట్ తొలగిస్తున్న దృశ్యాన్ని చూపిస్తూ “హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి” అనే స్పష్టమైన సందేశాన్ని అందించారు.
ఈ అవగాహన వీడియోను ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా #HYDTPweBringAwareness లో హ్యాష్‌ట్యాగ్‌తో సహా షేర్ చేస్తూ, “హలో... హలో....! బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్” అని క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పాటు షేర్ అవుతోంది.ప్రభాస్ అభిమానులు టీజర్‌ను ఇష్టపడటమే కాకుండా, ట్రాఫిక్ శాఖ వీడియోపై ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు. ప్రజల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచేందుకు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రశంసలందుకుంటోంది.
ప్రభాస్ రాజా సాబ్ ఎంత వరకూ వచ్చింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘రాజాసాబ్’ చిత్రం ఒక రొమాంటిక్ హారర్ కామెడీగా రూపొందుతుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మూవీ టీమ్ చెపుతున్నదాని ప్రకారం, సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల పేర్కొన్నారు.
రాజా సాబ్ టీజర్ కు భారీగా రెస్పాన్స్
జూన్ 16న విడుదలైన ‘ది రాజాసాబ్’ టీజర్‌కు 24 గంటల్లోనే 59 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఈ టీజర్ కు రికార్డు స్థాయి స్పందన వస్తోంది. ప్రభాస్ నటన, డిఫరెంట్ లుక్. కామెడీ ప్లాస్ యాక్షన్, హారర్‌తో మేళవించిన కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు.ఈ భారీ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి రికార్డ్ కొట్టేస్తాడంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. మరి ఈమూవీ రిలీజ్ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.
ప్రభాస్ నెక్ట్స్ చేయబోయే సినిమాలు
రాజాసాబ్ తో పాటు మరికొన్ని సినిమాలు ప్రభాస్ లైన్ చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది హనూరాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా. ఈ సినిమాకు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈసినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ కు సబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.
వీటితో పాటు ప్రభాస్ నటించిన సలార్, కల్కి సినిమాల నుంచి రెండో భాగాలకు సబంధించి షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. వీటితో పాటు మరో రెండు సినిమాలను ప్రభాస్ హెల్డ్ లో ఉంచినట్టు తెలుస్తోంది. ఇలా దాదాపు అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతే కాదు రాజమౌళితో బాహుబలి పార్ట్ 3 సినిమాను కూడా తెరపైకి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది కాకపోతే ఇది ఇప్పటి వరకూ రూమర్ గానే ఉంది. ఇదే నిజం అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్ కోసం ప్రభాస్ వెయిటింగ్
బాహుబలి తరువాత ప్రభాస్ వరుస గా మూడు ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. హ్యాట్రిక్ సినిమాలు ప్లాప్ అయినా ఎక్కడా ఆయన ఇమేజ్ తగ్గలేదు. వరుసగా సాహో, ఆదిపురుష్, రాధే శ్యామ్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆతరువాత సాహో సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టాడు ప్రభాస్, ఆ వెంటనే కల్కీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెబల్ స్టార్ ఊపిరి పీల్చుకున్నారు. కల్కీ సినిమా దాదాపు 12 వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ సాధిస్తాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ప్రభావం నుంచి కాస్తైనా భయటపడే అవకాశం ఉంటుంది. మరి రాజా సాబ్ రిజల్ట్ ఏమౌతుందో చూడాలి.
