MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు

Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు

Sobhan Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో శోభన్ బాబుకి అందాల నటుడు అనే కాదు.. పిసినారి, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయరు అనే పేరు కూడా ఉంది. కానీ చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. శోభన్ బాబు గురించి దివంగత నటుడు కృష్ణంరాజు, గానగాంధర్వుడు ఎస్పీ బాలు ఏం చెప్పారంటే.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 09 2026, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శోభన్ బాబు ఆర్థిక క్రమశిక్షణ
Image Credit : Asianet News

శోభన్ బాబు ఆర్థిక క్రమశిక్షణ

శోభన్ బాబు సమయం, డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. షూటింగ్‌లో తన పని తాను చూసుకునేవారు. సాయంత్రం 6 గంటలు దాటితే ప్యాకప్ చెప్పాల్సిందే! సెట్‌లో కూడా ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. తన షాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూట్ గ్యాప్‌లో ఓ పక్కకు కూర్చుని పుస్తకాలు చదువుకునేవారు. ఎవరైనా డబ్బు అడిగితే ఊరికే ఇచ్చేవారు కాదు, తనకు రావలసిన డబ్బును రూపాయి కూడా వదలకుండా తీసుకునేవారు. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు శోభన్ బాబు. ఇతరుల డబ్బుపై ఆశపడే అలవాటు లేదు, తన డబ్బు ఎవరికీ ఊరికే ఇచ్చే అలవాటూ లేదు సోగ్గాడికి. దాంతో చాలామంది ఆయన ఆర్థిక క్రమశిక్షణకు 'పీనాసి' అని పేరు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ అందాల నటుడు
Image Credit : Asianet News

టాలీవుడ్ అందాల నటుడు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరో అంటే ముందుగా శోభన్ బాబు పేరే వినిపించేది. ఆయన గ్లామర్ ఎలా ఉండేదంటే.. 'సోగ్గాడు', 'అందగాడు' అనే బిరుదులు ఆయనకు మాత్రమే సొంతం. శోభన్ బాబును సామాన్య మహిళా ప్రేక్షకుల దగ్గర నుంచి కథానాయికల వరకూ.. ఎంతో మంది పిచ్చిగా ప్రేమించేవారు. ఒకసారి అవుట్‌డోర్ షూటింగ్‌లో ఒక మహిళ సడెన్‌గా వచ్చి ఆయనకు ముద్దు పెట్టేసిందట. ఆ రోజుల్లో శోభన్ బాబు ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉండేది. అంతేకాదు, శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్‌గా కూడా ఉండేవారు. శోభన్ బాబు ఎక్కువగా ఖర్చు పెట్టరు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో ఆయనకు 'పిసినారి' అనే పేరు కూడా వచ్చింది.

35
కృష్ణంరాజు ఏమన్నారంటే..?
Image Credit : our own

కృష్ణంరాజు ఏమన్నారంటే..?

శోభన్ బాబు గురించి ఓ సందర్భంలో దివంగత నటుడు, ఆయన ఆప్తమిత్రుడు కృష్ణంరాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "శోభన్ బాబు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టరని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. అనవసరంగా ఖర్చు చేయరు, అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతారు. మేమిద్దరం కలుసుకుంటే తానే ఖర్చంతా భరించేవాడు. స్నేహితులంటే ప్రాణమిస్తాడు. డబ్బు దాచుకోవడమే కాదు, అప్పుడప్పుడూ పొలం కానీ, ల్యాండ్ కానీ కొనాలని చెప్పేవాడు. ఆయన గుప్తదానాలు ఎన్నో చేశారు. కానీ ఎప్పుడూ వాటి గురించి ప్రచారం చేసుకోలేదు. ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపాడు. ఎంతో మందిని చదివించాడు. అవన్నీ తెలియని వారు ఏదో అంటుంటారు. శోభన్ బాబు గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవు" అని అన్నారు.

45
శోభన్ బాబు ఫామ్‌హౌస్‌లో ఎస్పీ బాలు కూతురు పెళ్లి..
Image Credit : Asianet News

శోభన్ బాబు ఫామ్‌హౌస్‌లో ఎస్పీ బాలు కూతురు పెళ్లి..

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో గానగాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) మరియు సోగ్గాడు శోభన్ బాబు మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. శోభన్ బాబు నటించిన ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలకు బాలు గారు పాడిన పాటలు ప్రాణం పోశాయి. ఒక వేదికపై ఎస్పీ బాలు శోభన్ బాబు గురించి, ఆయనతో తనకున్న సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం గురించి పంచుకున్న విశేషాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి.

అప్పట్లో శోభన్ బాబుకి ఆస్తులు భారీగా ఉండేవి. చెన్నైలో ఆయనకి భూములు, ఫామ్‌హౌస్‌లు ఉండేవి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. "నాకు, శోభన్ బాబు గారికి మధ్య చెరగని స్నేహబంధం ఉండేది. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఒకసారి నా కుమార్తె పల్లవి పెళ్లి కోసం కళ్యాణ మంటపాలు వెతుకుతున్నాను. ఎక్కడా దొరకలేదు. 'మీ ఫామ్‌హౌస్ ఇస్తారా? అందులో పెళ్లి చేస్తాను' అని శోభన్ బాబు గారిని రిక్వెస్ట్ చేశాను. 'అది సినిమా షూటింగ్‌లకు కూడా ఇవ్వడం లేదు' అని కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.

ఇక ఆయన ఇవ్వరని అనుకుని మేము ముహూర్తం మార్చుకుని వేరే కళ్యాణమంటపం చూసుకోవాలని అనుకున్నాము. వెంటనే ఆయన 'మన అమ్మాయి పెళ్లి కదా.. ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇక్కడే చేసేద్దాం పెళ్లి' అన్నారు. అంతేకాదు.. దగ్గరుండి అక్కడ రంగులు వేయించి, ఉదయం 4 గంటలకే తన మనవడిని ఎత్తుకుని పెళ్లి పనులన్నీ ఆయనే దగ్గరుండి చేయించారు" అని బాలు ఎంతో సంతోషంగా చెప్పారు.

55
శోభన్ బాబు రూ.10,000 కోట్ల ఆస్తులు..?
Image Credit : Asianet News

శోభన్ బాబు రూ.10,000 కోట్ల ఆస్తులు..?

శోభన్ బాబు డబ్బును వృథా చేసేవారు కాదు. ఆయన సంపాదించిన సొమ్మంతా బిజినెస్‌లలో పెట్టారు. ప్రతీ పైసా ఆయన రియల్ ఎస్టేట్‌లో భూములపై పెట్టారు. చెన్నైలో సగం భూములు ఆయనవే అనే ప్రచారం ఉంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారట శోభన్ బాబు. ఆయన హీరోగా ఎంత స్టార్‌డమ్ చూసినా.. తన ఫ్యామిలీని మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వలేదు అందాల నటుడు. తన దగ్గర పనిచేసేవారిని చాలా బాగా చూసుకునేవారు. పనివారి కుటుంబాలకు కావాల్సిన ఆర్థిక అవసరాలు శోభన్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. వారి పిల్లలను కూడా ఆయన చదివించేవారు. అలా ఆయన చేసిన చాలా మంచి పనులు బయటకు రాలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
శోభన్ బాబు
కృష్ణంరాజు
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image3
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Related Stories
Recommended image1
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved