MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?

Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన జీవితంలో అస్సలు తినని ఫుడ్ ఏదో తెలుసా? ఇంతవరకు ముట్టుకోలేదట కూడా. ఇంతకీ ఏంటా ఫుడ్? సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ కూడా అదేనా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 08 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
50 ఏళ్లలో కూడా కుర్రాడిలా కనిపిస్తున్న మహేష్...
Image Credit : Asianet News

50 ఏళ్లలో కూడా కుర్రాడిలా కనిపిస్తున్న మహేష్...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును చూడగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన ఎవర్ గ్రీన్ గ్లామర్, ఫిట్‌నెస్. యాభై ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం ఆయన ప్రత్యేకత. ఈ వయసులో కూడా అంతటి గ్లామర్, ఎనర్జీని కాపాడుకోవడం వెనుక ఆయన పాటించే కఠినమైన ఆహార నియమాలు (Diet Routine), క్రమశిక్షణే ప్రధాన కారణం. గతంలో అనేక ఇంటర్వ్యూలలో మహేష్ తన ఫిట్‌నెస్-డైట్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ బాబు అస్సలు ముట్టుకోని ఆహారం ఏంటి?
Image Credit : urstrulymahesh/Instagram

మహేష్ బాబు అస్సలు ముట్టుకోని ఆహారం ఏంటి?

మహేష్ బాబు తన జీవితంలో అస్సలు ముట్టుకోని ఆహారం ఏంటో తెలుసా? వాటిని ఎందుకు పూర్తిగా దూరంగా పెడతారో తెలుసా? ఆ ఫుడ్ మరేదో కాదు డైరీ ప్రొడక్ట్స్.. అంటే పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, నెయ్యి.. ఇలాంటివి ఆయన జీవితంలో ముట్టుకోరట. వీటితో పాటు ‘ప్రాసెస్డ్ షుగర్’ (Processed Sugar) లేదా రిఫైన్డ్ చక్కెర, ‘జంక్ / జున్ను-నూనెతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్’ ను దూరంగా ఉంచుతారు. అయితే ఆయన ఏం తింటారు అంటే.. అందరూ తినే ఫుడ్ తింటారు కానీ దానికి ఓ పద్ధతిని పాటిస్తుంటారు.

మహేష్ బాబు చెప్పిన వివరాల ప్రకారం, ఆయన స్వీట్స్, రిఫైన్డ్ షుగర్‌తో చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన నూనె పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. అందరిలా ఇడ్లీలు, పూరీలు, బోండాలు.. సాంబారన్నం.. బిర్యానీలు తింటారు. కానీ వాటిని చాలా మితంగా తీసుకుంటారు మహేష్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నేను అన్నిరకాల ఫుడ్స్‌ను టేస్ట్ చేస్తాను.. కానీ చాలా మితంగా తింటాను.. పూరీ ఇష్టం కదా అని పది, ఇరవై తినేయను.. రెండు మూడు తింటే చాలు."

35
దీనికి కారణం ఏమిటి?
Image Credit : Asianet News

దీనికి కారణం ఏమిటి?

మహేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైనర్ల పర్యవేక్షణలో రోజూ వర్కౌట్స్ చేస్తారు. ప్రాసెస్డ్ షుగర్, జంక్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు, కేలరీలు చేరవు. ఇది ఆయన సిక్స్ ప్యాక్, లీన్ మజిల్స్ (Lean Muscle) కాపాడుకోవడానికి సహాయపడుతుంది. చక్కెర ఎక్కువ తీసుకుంటే చర్మంలో కొల్లాజెన్ తగ్గిపోయి త్వరగా ముసలితనం (Aging) ఛాయలు కనిపిస్తాయి.

ప్రాసెస్డ్ షుగర్‌ను పూర్తిగా దూరం పెట్టడం వల్లే మహేష్ బాబు చర్మం ఇప్పటికీ చిన్నపిల్లలా మెరుస్తూ, ముడతలు పడకుండా ఉంటుంది. చక్కెర పదార్థాలు తింటే తక్షణ శక్తి వచ్చినట్లు అనిపించినా, వెంటనే నీరసం వస్తుంది. సహజ సిద్ధమైన ఆహారం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా, చురుగ్గా ఉండవచ్చని మహేష్ నమ్ముతారు.

45
మహేష్ బాబు చాలా ఇష్టంగా తినే ఫుడ్..
Image Credit : Instagram / Mahesh babu

మహేష్ బాబు చాలా ఇష్టంగా తినే ఫుడ్..

మహేష్ బాబు మంచి ఫుడీ.. ఆ విషయం చాలామందికి తెలియదు. ఆయనకు బాగా ఇష్టమైన ఫుడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ.. చాలా ఇష్టంగా మహేష్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాడు. కానీ అది కూడా మితంగానే తింటారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించారు. అదే ఇంటర్వ్యూలో ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. "చిన్నప్పటి నుంచి అమ్మమ్మగారి వంటలంటే చాలా ఇష్టం. ఆవిడ దగ్గరే నేను పెరిగాను" అని మహేష్ అన్నారు.

55
వారణాసి బిజీలో సూపర్ స్టార్..
Image Credit : Instagram/ Mahesh babu

వారణాసి బిజీలో సూపర్ స్టార్..

మహేష్ బాబు చేసేదే ఏడాదికి ఒక్క సినిమా... ఆయన అభిమానులు కూడా ఆ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి ఆ టైమ్ మూడేళ్లకు పెరిగింది. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న 'వారణాసి' మూవీ షూటింగ్ లో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ మూవీని పరిగెత్తిస్తున్నారు. మరి చూడాలి అనుకున్న టైమ్‌కు మూవీ రిలీజ్ అవుతుందా లేదా. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు. 'వారణాసి' హిట్ అయితే సూపర్ స్టార్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image2
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved