- Home
- Entertainment
- ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పి శోభన్ బాబు చేసిన మోసం బయటపెట్టిన డైరెక్టర్, సోగ్గాడిలో ఈ యాంగిల్ ఊహించలేం
ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పి శోభన్ బాబు చేసిన మోసం బయటపెట్టిన డైరెక్టర్, సోగ్గాడిలో ఈ యాంగిల్ ఊహించలేం
శోభన్ బాబు అంటే నిబద్దతకి మారుపేరు అంటుంటారు. కానీ ఆయనలోని మరో కోణం బయటపెట్టాడు సీనియర్ దర్శకుడు. ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పి శోభన్ బాబు మోసం చేశాడట.

నిజాయితీకి మారుపేరు శోభన్ బాబు
శోభన్ బాబు సోగ్గాడిగా తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎంతో మందిని అలరించారు. ఫ్యామిలీ కథలతో ఇంటిళ్లిపాదిని మెప్పించారు. మహిళలు మెచ్చిన హీరోగా నిలిచారు. అందుకే ఆయనకు మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో శోభన్ బాబు అంటే సిస్టమాటిక్ లైఫ్‌కి కేరాఫ్. మాట మీద నిలబడే మనిషి అంటారు. చాలా నిజాయితీగా ఉంటారని, జెంటిల్‌మేన్‌గా చెబుతుంటారు. కానీ శోభన్ బాబులోని మరో యాంగిల్‌ని బయటపెట్టాడు సీనియర్ దర్శకుడు. తనతో సినిమా చేస్తానని చెప్పి మోసం చేశాడట.
`వీరాభిమాన్యు`తో సోగ్గాడికి మంచి గుర్తింపు
శోభన్ బాబు ప్రారంభంలో హీరోగా నిలబడేందుకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. చాలా సినిమాల నుంచి తీసివేతకు కూడా గురయ్యాడు. `గూఢచారి 116` సినిమాలో మొదట శోభన్‌బాబునే హీరోగా అనుకున్నారు. కానీ జయలలిత తల్లి కారణంగా ఆయన్ని తీసేసి కృష్ణని హీరోగా పెట్టారు. అలా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్‌ని మిస్ చేసుకున్నారు సోగ్గాడు. `వీరాభిమన్యు` మూవీ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. `బంగారు పంజరం`, `మనుషులు మారాలి` వంటి చిత్రాలతో సోలో హీరోగా హిట్ అందుకున్నాడు.
అసిస్టెంట్ డైరెక్టర్లని సత్కరించిన శోభన్ బాబు
అయితే `వీరాభిమన్యు` మూవీ సోగ్గాడికి మంచి హిట్‌ని అందించింది. ఇందులోని ఆయన పోషించిన అభిమన్యు పాత్రకి విశేషమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమా చేసే సమయంలోనే అసిస్టెంట్స్ అందరిని సత్కరించారట సోగ్గాడు. తనకు ఎంతో సపోర్ట్ చేశారని, ఈ మూవీ తనకు మంచి సంతృప్తినిచ్చిందని, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని ఆయన ఎంతో సంతోషంతో అసిస్టెంట్లని అభినందించారట. అదే సమయంలో తాను పెద్ద హీరో అయితే మీ అందరికి ఒక్కో మూవీ ఉచితంగా చేస్తానని మాటిచ్చాడట.
ఫ్రీగా సినిమా చేస్తానని మోసం చేసిన సోగ్గాడు
`వీరాభిమన్యు` చిత్రానికి పనిచేసి వారిలో సీనియర్ దర్శకుడు ఎన్ గోపాలకృష్ణ కూడా ఉన్నారు. ఆయన రైటర్‌గా చాలా సినిమాలు చేశారు. తాను దర్శకుడిగా మారిన తర్వాత ఓ సారి సోగ్గాడి వద్దకు వెళ్లాడట. తమిళంలో చేసిన ఓ మూవీ గురించి చెప్పాడట. సినిమా బాగుంది, మీకు బాగా సూట్ అవుతుందని చెప్పాడట. ఆ ప్రింట్ ఇవ్వమని అడిగాడట సోగ్గాడు. ప్రింట్‌ని శోభన్ బాబు థియేటర్ లో పెట్టాడు. చాలా రోజులు అయ్యింది, ఇంకా చూడలేదు. ఆ తర్వాత చూశాడు, కానీ ఎందుకో ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత టచ్ చేస్తే దాటవేస్తూ వచ్చాడట. కొంత గ్యాప్ తర్వాత అదే కథని మరో దర్శకుడు విజయ బాపినీడుతో చేశాడట సోగ్గాడు. తాను ఇచ్చిన కథని తనకు తెలియకుండా వేరే దర్శకుడితో సినిమా చేయడంతో దర్శకుడు ఎన్ గోపాలకృష్ణ చాలా హర్ట్ అయ్యాడు. సోగ్గాడు ఇంతటి మోసం చేస్తాడని ఆయన ఊహించలేదు. దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకున్నట్టు తెలిపారు దర్శకుడు.
చివరికి ఆ సినిమాతోనే పరాజయం
ఆ తర్వాత మరో సందర్భంలో కలిస్తే మీరు ఆ సినిమా చేశారుగా అని అన్నాడట. ఆ సమయంలో సోగ్గాడికి మొహం లేదు. ఏదో అలా జరిగిపోయిందని దాటవేశాడని, తాను కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు దర్శకుడు గోపాలకృష్ణ. సోగ్గాడు చేసిన ఆ సినిమానే `భార్యామణి`. 1984లో ఇది విడుదలైంది. ఇందులో జయసుధ హీరోయిన్. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలా శోభన్ బాబు తన అసిస్టెంట్ కి ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పి, చేయకుండా మోసం చేశాడు. అంతేకాదు ఆ సమయంలో ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు, నిర్మాత ఉన్నాడు, పారితోషికం, బడ్జెట్ కూడా ఉందని చెప్పినా, ఆయన నమ్మలేదట. అలా ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా జరుగుతుంటాయని, తనకు అలాంటి అనుభవం ఎదురైందని దర్శకుడు ఎన్ గోపాల్‌కృష్ణ తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.