- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్స్ కు రెడీ అవుతున్న టైమ్ లో బిగ్ బాస్ హౌస్ లో రకరకాల స్టంట్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలో టాప్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల తలకు గాయం అయ్యిందన్న వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్దంఅయ్యింది. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లుగా తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఓటింగ్ ను పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరి వారంలో ఆడియన్స ను ఇంప్రెస్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఓటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు కూడా వారి ప్రయత్నాలు మానుకోలేదు. ఈక్రమంలో మొదటి నుంచి టాప్ కంటెస్టెంట్స్ గా కళ్యాణ్ పడాల, తనూజ పేర్లు వినిపించగా.. చివరి వారం పవన్ ఎంతో కష్టపడి.. టాప్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అతితే ఈ ఐదుగురిలో విన్నర్ గా ఎవరు నిలుస్తారన్న ఆసక్తితో బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కళ్యాణ్ పడాల తలకు గాయం..?
ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ నుంచి షాకింగ్ విషయం ఒకటి లీక్ అయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న, వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. కళ్యాణ్ పడాల గాయపడ్డట్టు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన ఓ టాస్క్‌లో పవన్ కళ్యాణ్ పడాల తలకు గాయం అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఆ గాయం ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్‌ను మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తలకు బలమైన గాయం అయిందని, ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్నాడని కొందరు సోషల్ మీడియా యూజర్లు పోస్టులు చేస్తున్నారు.
ప్రోమోలో బాగానే కనిపించిన కళ్యాణ్ పడాల
కొంత మంది అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ఫైనల్స్ లో పాల్గొంటాడో లేదో.. హెల్త్ ఇష్యూస్ కారణంగా షో నుంచి బయటకు వెళ్తాడేమో అని చర్చలు మొదలు పెట్టాడు. అయితే ఈ గాయం విషయంలో నిజం ఎంతో తెలియదు.పవన్ కళ్యాణ్ పడాల గత ఎపిసోడ్స్‌లో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. తాజా ప్రోమోలో కూడా చాలా యాక్టీవ్ గా కనిపించాడు. శివాజీ లయ గెస్ట్ గా వస్తే వారితో బాగానే మాట్లాడాడు. అక్కడ ప్రోమోలో కూడా కళ్యాణ్ బాగానే ఉన్నట్టు అందరికి కనిపిస్తోంది. కానీ సడెన్ గా కళ్యాణ్ తలకు గాయం అని ఎందుకు ప్రాచారం జరుగుతంది అనేది తెలియడంలేదు. ఈ ప్రోమో షూట్ తరువాత ఏమైనా జరిగిందా? లేక పబ్లిసిటీ కోసం అభిమానులు ఇదంతా చేశారా? సోషల్ మీడియా జనాలు కూడా ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సిఉంది.
టాస్క్ లే జరగకుండా గాయం ఎలా..?
ఈ మధ్య కాలంలో కాలంలో తలకు గాయం అయ్యే స్థాయిలో కఠినమైన టాస్క్‌లు నిర్వహించలేదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. కళ్యాణ్ కాకుండా.. ఇతర కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం... ఈ గాయానికి సంబంధించిన ప్రచారం అంతా సింపతీ కోసం చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా ప్రమోషనల్ స్టంట్‌గా విమర్శిస్తున్నారు. తనూజ టాప్‌లో పవన్ కళ్యాణ్ పడాల రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. దాంతో ఫైనల్‌కు ముందు పవన్ కళ్యాణ్ టాప్ ప్లేస్‌కి చేరాలనే ఉద్దేశంతో ఇలా అభిమానులు.. సింపతీ గాయం గేమ్ ఆడారన్న విమర్శలు వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు?
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 యుద్దం ముగిసింది. ఈ సీజన్ ఫైనల్స్ కు చేరింది. విన్నింగ్ కప్ రేసులో లాస్ట్ వీక్ వరకూ.. కళ్యాణ్ పడాల, తనూజ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు డీమాన్ పవన్ కూడా ఈ లిస్ట్ లోకి వచ్చిచేరాడు. దాంతో పోటీ టఫ్ గా మారింది. ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అవ్వడంతో.. ఫైనల్ విన్నర్ ఎవరు అన్న విషయంలో ఉత్కంట కొనసాగుతోంది. ఎక్కవమంది అభిప్రాయం ప్రకారం కళ్యాణ్ పడాల విన్నర్ గా.. తనూజ రన్నర్ గా నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది.

