- Home
- Entertainment
- సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రావడానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా? క్రేజ్ ఏమాత్రం కేక
సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రావడానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా? క్రేజ్ ఏమాత్రం కేక
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా రాణించిన సుమన్ శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. మరి ఈ షోకోసం సుమన్ శెట్టి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా?

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా రాణించిన సుమన్ శెట్టి
టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి. తనదైన కామెడీతో అలరించారు. అమాయకుడిగా కనిపిస్తూ, అరుస్తూ నవ్వులు పూయించాడు. అప్పట్లో సుమన్ శెట్టి సినిమాల్లో ఉన్నాడంటే అది హిట్టే అనేట్టుగా ఉండేది. కామెడీకి కొదవ లేదని ఆడియెన్స్ భావించేవారు. అంతగా తన కామెడీతో నవ్వులు పూయించారు. అయితే ఆ తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించాడు. కొత్త కమెడియన్లు రావడంతో సుమన్ శెట్టి క్రేజ్ తగ్గింది. ఆయన కూడా ఇతర భాషల్లో చేయడంతో ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది. పెద్ద సినిమాలు పడకపోవడం కూడా ఆడియెన్స్ కి సుమన్ శెట్టి దూరమయ్యాడు.
`జయం` చిత్రంతో కమెడియన్‌గా పరిచయం అయిన సుమన్ శెట్టి
`జయం` చిత్రంతో తెలుగులో కమెడియన్‌గా పరిచయం అయ్యాడు సుమన్ శెట్టి. ఇందులో హీరో నితిన్ ఫ్రెండ్‌గా మెప్పించాడు. నవ్వించాడు. ఇందులో అధ్యక్షా డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చాలా వరకు తెలుసు. అలాగే `7జి బృందావన కాలనీ` చిత్రంలో దాన్ని మించి నవ్వులు పూయించాడు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ సుమన్‌శెట్టిని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. `నిజం`, `నా అల్లుడు`, `కొంచెం టచ్లో వుంటే చెబుతా`, `ధైర్యం`, `సంక్రాంతి`, `ఔనన్నా కాదన్నా`, `హ్యాపీ`, `రణం`, `కతర్నాక్`, `అన్నవరం`, `విజయదశమి`, `పౌరుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `రెడీ`, `ఉల్లాసంగా ఉత్సాహంగా`, `బలాదూర్`, `పిస్తా`, `రెచ్చిపో`, `ఎందుకంటే ప్రేమంటా`, `ఈ రోజుల్లో` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు సుమన్ శెట్టి.
సెకండ్ ఇన్నింగ్స్ కోసం `బిగ్ బాస్ తెలుగు 9`లోకి
ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేసినా అవి పెద్ద సినిమాలు కాకపోవడంతో సుమన్ శెట్టి పెద్దగా నోటిస్ కాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బిగ్ బాస్ తెలుగు 9లోకి వచ్చారు. ఈ షో ద్వారా మరోసారి అందరికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు సుమన్ శెట్టి. అయితే ప్రారంభంలో నెగటివ్ కామెంట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇతర కంటెస్టెంట్ల నుంచి. డల్‌గా ఉన్నాడని, యాక్టివ్‌గా కనిపించడం లేదని, ఈజ్, జోష్ లేదంటూ కొందరు నామినేట్ చేశారు. కానీ సుమన్ శెట్టికి విపరీతమైన ఓటింగ్ పడింది. తన రేంజ్ ఏంటో చూపిస్తుంది. తన క్రేజ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు.
సుమన్ శెట్టి బిగ్ బాస్ పారితోషికం
అంతేకాదు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడంతో షోలో పాల్గొన్న ఆడియెన్స్ హ్యాపీ అయ్యారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇది సుమన్ శెట్టికున్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రావడానికి సుమన్ శెట్టి ఎంత పారితోషికం తీసుకున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ శెట్టి ఈ షోకి రావడానికి వారానికి రెండున్నర లక్షల పారితోషికం తీసుకుంటున్నాడట. రోజుకి రూ.35వేలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. కమెడియన్‌గా ఇప్పుడు అంత క్రేజ్ లేకపోయినా టీవీ ఆర్టిస్ట్ లు తనూజ, రీతూ చౌదరీ, సంజన వంటి వారి రేంజ్‌లో సుమన్ శెట్టి పారితోషికం తీసుకోవడం విశేషం.