MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి కారణంగా సినిమా ఇండస్ట్రీనే వదిలేద్దామనుకున్న హీరో ఎవరో తెలుసా? కట్‌ చేస్తే సూపర్‌ స్టార్‌

చిరంజీవి కారణంగా సినిమా ఇండస్ట్రీనే వదిలేద్దామనుకున్న హీరో ఎవరో తెలుసా? కట్‌ చేస్తే సూపర్‌ స్టార్‌

చిరంజీవిని చూసి చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. కానీ ఒక హీరో మాత్రం చిరంజీవిని చూసి సినిమా ఇండస్ట్రీనే వదిలేద్దామనుకున్నాడు. అలాంటిది ఆయన సూపర్‌ స్టార్‌గా ఎదగడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 16 2025, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి
Image Credit : Asianet News

ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి చాలా కింది స్థాయి నుంచి సినిమాల్లోకి వచ్చి సూపర్‌ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. ప్రారంభంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వాటిని భరించాడు. తన ప్రతిభతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్‌ గా ఎదిగారు. తాను ప్రారంభ దశలోనే ఈగోకి పోయి, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకాబట్టే, ఆయన మెగాస్టార్‌ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

25
చిరంజీవిని చూసి భయపడ్డ నాగార్జున
Image Credit : Asianet News

చిరంజీవిని చూసి భయపడ్డ నాగార్జున

అయితే చిరంజీవిని చూసి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. హీరోలు అయ్యారు, దర్శకులు అయ్యారు. నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ ఓ హీరో మాత్రం భయపడ్డాడు. చిరుని చూసి ఏకంగా సినిమా ఇండస్ట్రీనే వదిలేద్దామనుకున్నాడు. అంతగా చిరంజీవిని చూసి భయపడ్డ హీరో ఎవరో కాదు మన్మథుడు నాగార్జున. ఆయన చిరుని మొదటిసారి చూసి టెన్షన్‌ బడ్డాడట. అన్నపూర్ణ స్టూడియో  సెట్‌లో అలా చూసి ఇక మన వల్ల కాదు, ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నాడట. స్వయంగా నాగార్జుననే ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఆ సందర్భం ఏంటి? నాగార్జున ఎందుకు అలా అనుకున్నాడు? చిరంజీవి ఏం చేశాడనేది చూస్తే.

Related Articles

Related image1
Tamannaah: ట్రోలర్స్ కి మళ్లీ దొరికిపోయిన తమన్నా, ఆ ఫోటోలు మొత్తం రచ్చ రచ్చ
Related image2
అర్థరాత్రి హీరోయిన్ల గాసిప్పులు అడిగేవాడు.. ఇళయరాజా బండారం బయటపెట్టిన రజనీకాంత్‌
35
నాగార్జున ఆ మాట చెప్పగానే ఏఎన్నార్‌ ఎమోషనల్‌
Image Credit : youtube print shot/zee telugu

నాగార్జున ఆ మాట చెప్పగానే ఏఎన్నార్‌ ఎమోషనల్‌

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే మొదట వ్యాపారం చేయాలనుకున్నాడట. అందుకే ఫారెన్‌లో చదువుకున్నాడు. కానీ సడెన్‌గా దృష్టి సినిమాలవైపు మళ్లింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లోనే సినిమాలు చేస్తున్నారు. హీరో కావాలి. ఎవరో ఎందుకు మన నాగార్జుననే ఉన్నాడు కదా అని అన్న వెంకట్‌ భావించారు. అదే విషయాన్ని నాగ్‌కి చెప్పగా, తన ఆసక్తిని  వెల్లడించారు. దీంతో ఆ విషయాన్ని ఏఎన్నార్‌కి నెమ్మదిగా చెప్పారు నాగ్‌. ఆ సమయంలో నాగ్‌ అన్నమాటలకు ఏఎన్నార్‌ ఎమోషనల్‌ అయ్యారట. మనసులో ఆయనకు కూడా ఇదే ఉంది, కానీ నాగార్జున ఇష్టం ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాగార్జునే ఇలా సినిమాల్లోకి వస్తానని చెప్పడంతో ఏఎన్నార్‌ మనుసులో ఆనందపడ్డారు.

45
చిరంజీవి డాన్సులు చూసి నాగ్‌లో గుబులు
Image Credit : Asianet News

చిరంజీవి డాన్సులు చూసి నాగ్‌లో గుబులు

అయితే నాగార్జునకు ఆ సమయంలోనే క్లారిటీ ఇచ్చాడు ఏఎన్నార్‌. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా నిన్ను అభిమానిస్తారు. కానీ ఆదరించడం వేరు, సినిమాల్లో రాణించడం వేరు, ఏఎన్నారు కొడుకు కదా, హీరో అయిపోవచ్చు అనుకుంటే పొరపాటే,  యాక్టింగ్‌తో నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. అదే మాటతో నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు నాగార్జున. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నాగార్జున.. తండ్రితోపాటు షూటింగ్‌లు తిరిగేవాడట. అలా ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లినప్పుడు అందులోనే చిరంజీవి సినిమా షూటింగ్‌ జరుగుతుంది. చిరు, రాధాలపై వాన సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎన్నార్‌ ఉండి, పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది, వెళ్లి చూడు, డాన్సులు నేర్చుకో అని నాగ్‌కి చెప్పారు ఏఎన్నార్.

55
ఇండస్ట్రీని వదిలేసి వేరే దారి చూసుకుందామనుకున్న నాగ్‌
Image Credit : youtube print shot/zee telugu

ఇండస్ట్రీని వదిలేసి వేరే దారి చూసుకుందామనుకున్న నాగ్‌

దీంతో నాగార్జున వెళ్లి ఆ షూటింగ్‌ చూశాడు. చిరంజీవి డాన్సులు చూసి షాక్ అయ్యాడట మన్మథుడు. ఆయనలా తాను డాన్సులు చేయగలనా అని గుబులు పట్టుకుందట. ఇలా డాన్సులు మనం చేయలేం, వద్దులే వేరే దోవ వెతుక్కుందాం అని బయటకు వచ్చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఏఎన్నార్‌ జాతీయ అవార్డుని అమితాబ్‌ బచ్చన్‌కి ప్రదానం చేసిన సందర్భంగా నాగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు అలా భయపడ్డ నాగార్జున `విక్రమ్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నెమ్మదిగా హీరోగా రాణించారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు డిఫరెంట్స్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related Stories
Recommended image1
Tamannaah: ట్రోలర్స్ కి మళ్లీ దొరికిపోయిన తమన్నా, ఆ ఫోటోలు మొత్తం రచ్చ రచ్చ
Recommended image2
అర్థరాత్రి హీరోయిన్ల గాసిప్పులు అడిగేవాడు.. ఇళయరాజా బండారం బయటపెట్టిన రజనీకాంత్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved