MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?

ప్రముఖ నటుడు శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దండోరా ఫస్ట్ రివ్యూ, సెన్సార్ డీటెయిల్స్ బయటకు వచ్చేశాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 24 2025, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివాజీ 'దండోరా' మూవీ
Image Credit : X/@Loukyaoffl

శివాజీ 'దండోరా' మూవీ

ప్రముఖ నటుడు శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలసి వస్తోంది. బిగ్ బాస్ 7 షోలో శివాజీ అదరగొట్టారు. ఆ తర్వాత శివాజీ నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. శివాజీ నెగిటివ్ పాత్రలో నటించిన కోర్ట్ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు శివాజీ దండోరా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివాజీతో పాటు ఈ మూవీలో నవదీప్, నందు, బిందు మాధవి, బుల్లితెర నటుడు రవికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దండోరా సెన్సార్ పూర్తి
Image Credit : X/@Loukyaoffl

దండోరా సెన్సార్ పూర్తి

ఈ చిత్రం మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో శివాజీ వార్తల్లో నిలవడమే కాక దండోరా చిత్రానికి కూడా ఫ్రీ పబ్లిసిటీ లభించింది. నెటిజన్లు ఈ మూవీ గురించి బాగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఫస్ట్ రివ్యూ బయటకి వచ్చింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 

Related Articles

Related image1
కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
Related image2
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
35
సెన్సార్ బోర్డు కట్ చేసిన సన్నివేశాలు
Image Credit : X/@Loukyaoffl

సెన్సార్ బోర్డు కట్ చేసిన సన్నివేశాలు

ఈ చిత్రం 136 నిమిషాల రన్ టైంతో ఉండబోతోంది. కులానికి సంబంధించిన వివాదాస్పద కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దీనితో సెన్సార్ సభ్యులు పలు కట్స్ చెప్పి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో 29 నిమిషాల వద్ద, అదే విధంగా 1.51 గంటల వద్ద రెడ్డి అనే సర్ నేమ్స్ ని డిలీట్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పింది. 24 నిమిషాల వద్ద ఉండే ఒక బూతు పదాన్ని కూడా సెన్సార్ వాళ్ళు తొలగించారు. 

45
సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్
Image Credit : X/@Loukyaoffl

సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్

లింగమార్పిడి చేయించాం, కులం తక్కువ తో పాటు మరికొన్ని అభ్యంతర డైలాగులు, బూతులని సెన్సార్ బోర్డు తొలగించింది. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలని కూడా సెన్సార్ బోర్డు తొలగించింది. ఇక సినిమా విషయానికి వస్తే సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందట. కులం నేపథ్యంలో తెరకెక్కించినప్పటికీ దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా బాగుంది అని అంటున్నారు. 

55
దండోరా మూవీ ఎలా ఉందంటే
Image Credit : X/@Loukyaoffl

దండోరా మూవీ ఎలా ఉందంటే

ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో రవికృష్ణ పాత్ర విషయంలో ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుంది. దర్శకుడు దానిని చాలా బాగా తెరకెక్కించారు. నటుడు శివాజీ చెప్పే డైలాగులు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. గ్రామాల్లో కులం ఎంతలా పాతుకుపోయింది అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. కుల హత్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రాత్రి తాగిన కల్లు మత్తు ఉదయం కల్లా దిగిపోతుంది. కానీ కులం మత్తు వదలడానికి చాలా టైం పడుతుంది అని శివాజీ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో ఉంటుంది. ఇలా ఆలోచించపజేసే డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి సరిపడా కంటెంట్ ఉందని అంటున్నారు. నటీనటుల పెర్ఫార్మెన్స్, బిజీయం అన్ని అద్భుతంగా కుదిరాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
Recommended image2
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved