MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం

Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం

Sittapata Sinukulu Folk Song : ప్రస్తుతం జానపద పాటల క్రేజ్ నడుస్తోంది. గతంలో సినిమా పాటల మాదిరిగా ఇప్పుడు ఎక్కడచూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే వందల మిలియన్స్ వ్యూస్ తో జానపదాలు దూసుకుపోతున్పాయి. అలాంటి ఓ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.. 

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 06 2026, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిటాపటా సినుకులకు ఫోక్ సాంగ్..
Image Credit : Screenshot to Amulya Studio Youtube Channel

సిటాపటా సినుకులకు ఫోక్ సాంగ్..

Folk Song : ప్రస్తుతం తెలుగు జానపదాలకు మంచి ఆదరణ లభిస్తోంది. పల్లె ప్రజలు పాడుకునే ఈ పాటలు సినిమా సాంగ్స్ ను తలదన్నే స్థాయిలో యూట్యూబ్, సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. చివరకు సినిమావాళ్ళు కూడా వీటినే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది... ''సిత్తరాల సిరపడు'' అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ''గున్నాగున్నా మామిడీ'' అంటూ కామెడీ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి జానపదాలను వాడుకుని హిట్ కొట్టారు. అయితే సినిమా పాటలకంటే ఈ జానపదాలే ఇటీవల ప్రజల్లోకి ఎక్కువగా వెళుతున్నాయి... ముఖ్యంగా తెలంగాణ జానపద పాటలకు యావత్ తెలుగు ప్రజలు ఫిదా అవుతున్నారు.

''రాను బొంబైకి రాను'' పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరం చూశాం... చివరకు ఈ సాంగ్ రాము రాథోడ్ ను సెలబ్రిటీని చేసింది. ఇక ''ఓ పిలగ యెంకటేశు'', ''కాపోళ్ల ఇంటికాడ'' వంటి సాంగ్స్ కూడా యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇలా హిట్ అయిన జానపదమే ''సిటపట సినుకులకు'' జానపదం. ఇందులో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. కట్టుకున్నవాడు దారితప్పితే ఆ భార్య వేదన ఎలా ఉంటుంది..? భర్త కోసం ఆమె ఎంతలా తరిపించింది..? అనేది ఇందులో చక్కగా చూపించారు. అందుకే ఈ సాంగ్ తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిటాపటా సినుకులు పాట సాగుతుందిలా...
Image Credit : Screenshot to Amulya Studio Youtube Channel

సిటాపటా సినుకులు పాట సాగుతుందిలా...

పల్లెటూరు భార్యాభర్తల సంసార జీవితాన్ని ఈ సిటాపటా సినుకులు పాటలో చూపించారు. తనను కాదని మరో మహిళతో ఉంటున్న భర్తను ప్రేమతో మార్చుకుంటుంది ఆ సతీమణి. రాత్రంతా భర్త చెడు తిరుగుళ్ళు తిరిగినా ఆ భార్య మాత్రం ఎక్కడున్నావు, ఏం తిన్నావు అని ప్రేమగా అడుగుతుంది... ప్రతిసారి భర్త అబద్దం చెప్పినా అసలు నిజం తెలిసి కూడా ఏమనదు. అయితే చివరకు ఆ భర్తే తప్పు తెలుసుకుని రియలైజ్ అవుతాడు... భార్యను అక్కున చేర్చుకుంటాడు... ఇలా భార్యాభర్తలిద్దరూ ఒక్కటవుతారు. ఈ పాటలో భార్యాభర్తల అనుబంధాన్ని చక్కగా చూపించారు.

Related Articles

Related image1
Folk Song on KCR : కేసీఆర్ పై వచ్చిన ఈ ఫోక్ సాంగ్.. 14861716 వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిగా..!
Related image2
Folk Song : యూట్యూబ్ లో 87M వ్యూస్, 240K లైక్స్ .. యూత్ తో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్ జానపదం
35
14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ షేక్...
Image Credit : Screenshot to Amulya Studio Youtube Channel

14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ షేక్...

వినసొంపైన పదాలతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో సిటాపటా సినుకులు సాంగ్ సాగుతుంది. అందుకే ఇప్పటివరకు యూట్యూబ్ లో 142 మిలియన్స్ అంటే 142,772,002 వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఏకంగా 502K అంటే ఐదు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ అంకెలను బట్టే ఈ పాటు ఏస్థాయిలో జన్నాల్లోకి వెళ్లింది, ఎంత హిట్టయ్యింది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ పాటపై ఎంతోమంది భార్యాభర్తలు వీడియోలు, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది మరింతమందికి రీచ్ అయ్యింది. మొత్తంగా పెళ్లయిన ప్రతిజంట చూడాల్సిన జానపదాల జాబితాలో ఇది చేరింది.

45
సిటాపటా సినుకులు సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే..
Image Credit : Screenshot to Amulya Studio Youtube Channel

సిటాపటా సినుకులు సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే..

ఈ సిటాపటా సినుకులు పాటకు ప్రాణంపోసింది జానపద గాయని ప్రభ (అమ్ములు). పల్లెల్లో పాడుకునే ఈ జానపదం లిరిక్స్ ను ఆమే సేకరించారు. అంతేకాదు స్క్రీన్ పై అద్బుత నటనతో ఆకట్టుకుంది. ఈ పాటను పాడింది కూడా ఈమే... అచ్చమైన పల్లెటూరి గొంతులో పడటంతో ఈ పాట వినసొంపుగా మారింది.

ఇక ఈ సూపర్ సాంగ్ లో మేల్ వాయిస్ గజ్వేల్ వేణుది. అతడే అద్భుతమైన మ్యూజిక్ కూడా అందించాడు. అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్లో కనిపించే ఈ వీడియో సాంగ్ కు డైరెక్షన్ వహించింది కూడా ఇతడే. ఇలా ప్రభ, గజ్వేల్ వేణు కలిసి సిట్టపటా సినుకులు పాటకు ప్రాణం పోశారు.

55
సిటాపట సినుకులు లిరిక్స్
Image Credit : Screenshot to Amulya Studio Youtube Channel

సిటాపట సినుకులు లిరిక్స్

సిట్టాపటా సినుకులకు యాడ తిన్నవ్రో రాతిరి

నువ్ యాడ పన్నవ్రో రాతిరి...

కోంటోళ్ళింటికాడ కోలాటమాడితే

ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి

సిట్టాపటా సినుకులకు యాడ తిన్నవ్రో రాతిరి

నువ్ యాడ పన్నవ్రో రాతిరి...

ఆ కోంటోళ్ళింటికాడ కోలాటమాడితే

ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి

కలమాంబాయే కరెంటు పాయె

యాడ తిన్నవ్రో రాతిరి.. నువ్ యాడ పన్నవ్రో రాతిరి

కాపోల్లింటికాడ కబడ్డి ఆడితే

ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి

సిట్టాపటా సినుకులకు యాడ తిన్నవ్రో రాతిరి

నువ్ యాడ పన్నవ్రో రాతిరి...

ఆ కాపోల్లింటికాడ కబడ్డి ఆడితే

ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి..

కండ్లన్ని కాయలు కాయంగా సూస్తిరో

యాడ తిన్నవ్రో రాతిరి… నువ్ యాడ పన్నవ్రో రాతిరి..

గౌండ్లోల్లింటికాడ గోళీలు ఆడితే

ఆడ వోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి

సిట్టాపటా సినుకులకు యాడ తిన్నవ్రో రాతిరి

నువ్ యాడ పన్నవ్రో రాతిరి...

గా గౌండ్లోల్లింటికాడ గోళీలు ఆడితే

ఆడ వోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి

నమ్మివచ్చిన దాన్నిరో నేను

ఆగం చెయ్యకో బావయ్య

నన్నాగం చెయ్యకో బావయ్యో

నామీద నీకు ఉన్న ప్రేమానుబంధం

నేను ఎరుగక పోతిని… ఛీ బుద్ది తక్కువోన్నైతిని..

కడదాక నీతోనే కలిసుంట బావయ్య

వదిలిపెట్టకో బావయ్య… నన్ను ఒంటరిచేయకు బావయ్య

నమ్ముకున్న నిన్ను ఆగం జెయ్యను

ప్రాణం ఇస్తనే జానకి… నీ మీద పమాణమే జానకి

వదిలి పెట్టకో బావయ్య

నన్ను ఒంటరి చేయకు బావయ్య

ఆ, ఆగం చెయ్యనే జానకి

నీ మీద పమాణమే జానకి

నన్ను వదిలి పెట్టకో బావయ్య

నువ్వు ఒంటరి చెయ్యకు బావయ్య

నిన్ను ఆగం చెయ్యనే జానకి

నీ మీద పమాణమే జానకి

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Buchi Babu: పెద్ది చిత్రానికి భారీ దెబ్బ, జాన్వీ కపూర్ సీన్లు తీసేస్తాం.. క్షమాపణ కోరిన బుచ్చిబాబు
Recommended image2
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image3
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Related Stories
Recommended image1
Folk Song on KCR : కేసీఆర్ పై వచ్చిన ఈ ఫోక్ సాంగ్.. 14861716 వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిగా..!
Recommended image2
Folk Song : యూట్యూబ్ లో 87M వ్యూస్, 240K లైక్స్ .. యూత్ తో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్ జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved