MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Folk Song on KCR : కేసీఆర్ పై వచ్చిన ఈ ఫోక్ సాంగ్.. 14861716 వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిగా..!

Folk Song on KCR : కేసీఆర్ పై వచ్చిన ఈ ఫోక్ సాంగ్.. 14861716 వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోందిగా..!

BRS Party Folk Song : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వచ్చిన ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు 14M మిలియన్ వ్యూస్ సాధించి టాప్ లో నిలిచింది. ఇంతకూ ఆ పాట ఏదో తెలుసా..?

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 04 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దుమ్మురేపుతున్న కేసీఆర్ సాంగ్..
Image Credit : X/Krishank_BRS

దుమ్మురేపుతున్న కేసీఆర్ సాంగ్..

Folk Song on KCR : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) గురించి తెలియనివారు ఉండరు. తన పదునైన మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు... స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత పదేళ్లు సుపరిపాలన అందించాడు. బిఆర్ఎస్ (గతంలో టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా... తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇలాంటి నాయకుడి గురించి, ఆయన పదేళ్ల గురించి ఒక్కమాటలో చెప్పలేం... కానీ ఒక్క పాటలో చెప్పవచ్చు..? అదే చేశాడు జానపద గాయకుడు గద్దర్ నరసన్న అలియాస్ నల్గొండ గద్దర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యూట్యూబ్ లో దూసుకుపోతున్న కేసీఆర్ సాంగ్..
Image Credit : KCR Twitter

యూట్యూబ్ లో దూసుకుపోతున్న కేసీఆర్ సాంగ్..

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ ప్రచారం కోసం ఓ పాటను రూపొందించింది. కేసీఆర్ గురించి, ఆయన పదేళ్ళ పాలన, బిఆర్ఎస్ ఎన్నికల హామీలను వివరిస్తూ ''సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల'' పాట సాగుతుంది. అయితే ఆకట్టుకునే పదాలతో కూడిన పాట మాస్ సింగర్ గద్దర్ నరసన్న గొంతులోపడి మరింత వినసొంపుగా మారింది. ప్రజల నాడి తెలిసిన ఈ ప్రజాగాయకుడు ప్రాణంపెట్టి పాడాడు.. అందుకే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడినా, కేసీఆర్ అధికారం కోల్పోయినా ఈ పాట మాత్రం జనాల్లోనే ఉండిపోయింది. ఇప్పటికీ వివిధ ఊరేగింపులు, వేడుకల్లో ఈ పాట వినిపిస్తుంది.

యూట్యూబ్ లో ''సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల.. మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్ల'' పాటను కోటిమందికిపైగా చూశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ పాటకు ఇప్పటివరకు 14 మిలియన్ అంటే 14,861,716 వ్యూస్ వచ్చాయి.. అలాగే 91 వేల లైక్స్ కూడా ఉన్నాయి. ఇక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నోళ్లలో ఈ పాట ఎప్పుడూ నానుతుంటుంది... ఆ పార్టీ కార్యక్రమాల్లో బాగా వినిపిస్తుంది. ప్రజల్లోకి కూడా బలంగా దూసుకెళ్లింది ఈ ప్రచార గీతం.

Related Articles

Related image1
KCR: ఉట్టి తెగదు పిల్లి కోరిక తీరదు.. కేసీఆర్ చెప్పిన ఈ సామెత అర్థం ఏంటో తెలుసా.?
Related image2
Now Playing
KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu
34
బిఆర్ఎస్ ప్రచార గీతం లిరిక్స్
Image Credit : X/BRS Party

బిఆర్ఎస్ ప్రచార గీతం లిరిక్స్

సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల..

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల

సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల

ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు

పండుగల్లె పల్లెకొచ్చినోడు

జనమంత జైకొట్టి పలికేటి పేరు

జనము బిడ్డ మన కేసీఆరు...

సారే.. మన సారే.. చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల..

ఏండ్లనుండి ఎనుకబాటు జూసిండు..

ఎత్తుకున్నాడమ్మా గులాబీ జెండా..

సావునోటిలోన తలపెట్టినాడు

స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు.. స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు..

పథకాలు ఎన్నో పంచినాడమ్మ

ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మా

రెండువేలు ఇచ్చే పింఛను నేడు ఐదువేలకు పెంచుతానండు.. ఐదువేలకు పెంచుతానండు..

కళ్యాణలక్ష్మితో కన్నండ్రై కట్నమిచ్చి కాళ్లు కడిగిండయ్యా..

కేసీఆరే ప్రతి ఇంటికి ధీమా.. అందించునే అయిదు లక్షల భీమా..

సారే.. మన సారే.. పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల…

ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినాడమ్మ..

రైతుబంధు రైతుభీమాను ఇచ్చిన పెద్దరైతు మన కేసీఆరు.. పెద్దరైతు మన కేసీఆరు..

ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మా..పంట పొలాలను తడిపినడమ్మ..

మిషన్ కాకతీయతో ఊరి చెరువు... మత్తడి పారి తీర్చింది కరవు.. మత్తడి పారి తీర్చింది కరవు..

తొలగించినాడురా కంటనీళ్లు... ఇంటింటికి వచ్చె నళ్లనీళ్లు..

అభివృద్ధికి ఆయనే మారుపేరు... నీళ్లకాల సృష్టికర్త కేసీఆర్

సారే.. బోల్ సారే.. చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల..

నిలువనీడలేని నిరుపేదలకు గ్రుహలక్ష్మితో సాయమందిచెనమ్మ...

పెరిగిన ధరలకు అల్లాడుతున్న బక్కచిక్కినోళ్ళ దిక్కయ్యినాడు... బక్కచిక్కినోళ్ళ దిక్కయ్యినాడు...

నాలుగొందలాకే గ్యాసు సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు..

మహిళా సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత... మాటిచ్చినాడమ్మ మనసున్న నేత...

అడగకుండనే అన్నిజేసే.. ఆత్మబంధువయ్యి మనలజూసే

బంగారు తెలంగాణ ఈ బాటసారి.. గెలిపించుకుందాము మల్లొక్కసారి..

సారే.. మన సారే.. చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల

దండి ధైర్యాన్నిచ్చేరా దళిత బందు... గుండె నిబ్బరమాయే బిసిల బందు..

అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తనండు.. రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తనండు..

సాయమైవచ్చింది మైనార్టీ బందు... ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్..

వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల..

ప్రజల క్షేమమే కోరేనయా..సంక్షేమ పథకాల సర్కారయా..

కష్టజీవుల సద్ది బువ్వయ్యినోడు.. తెలంగాణ బతుకు తోవ్వయ్యినాడు..

సారే.. మన సారే.. చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల

సన్నబియ్యంతోని కడుపులు నింపగ అన్నపూర్ణ ఆ పథకం జూడు...

ఉన్నతవిద్యకు నిలయమయ్యినా గురుకులా పాఠశాలలు నేడు... గురుకులా పాఠశాలలు నేడు

ఆడబిడ్డల ఆత్మగౌరవమాయే మూడువేల తోని సౌభాగ్యలక్ష్మి

పదిహేను లక్షల ఆరోగ్య రక్ష.. కేసిఆరే మనకు శ్రీరామ రక్ష..కేసిఆరే మనకు శ్రీరామ రక్ష

ప్రగతిలోన పరుగులెత్తే కారు.. పాలనకింకెవరు సాటిరారు..

ప్రపంచ దేశాలె కొనియాడినా తీరు... మళ్లీ రావాలే గులాబి సర్కారు..

సారే.. మన సారే.. కేసిఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల

మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల..

44
కేసీఆర్ సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే..
Image Credit : X/BRS Party

కేసీఆర్ సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 17, 2023న సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల సాంగ్ విడుదలయ్యింది. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉంది. అయితే ఈ కేసీఆర్ పాట ఇప్పటికీ లక్షల వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది.

ఈ కేసీఆర్ పాటను ఏనుగు రవీందర్ రెడ్డి సమర్పించారు. కేసీఆర్ పాలనను కళ్లకుగట్టినట్లుగా ఉండేలా బుర్రా సతీష్ లిరిక్స్ అందించాడు... ఇవి సింగర్ గద్దర్ నరసన్న గొంతులో అద్భుతంగా పలికాయి. మాస్ లిరిక్స్ కు తగ్గట్లుగా ఊరమాస్ మ్యూజిక్ అందించారు రవి కల్యాణ్. ఇలా మంచి టీమ్ కుదరడంతో ఓ పార్టీ ప్రచార గీతం అయినప్పటికీ సినిమా సాంగ్ స్థాయిలో హిట్ అయ్యింది... సారే కావాలంటున్నరే అంటూ జనాలు ఇప్పటికీ పాడుకుంటున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత రాష్ట్ర సమితి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Monsoon Rain Alert: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలకు ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Telangana: రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం
Recommended image3
Now Playing
పవన్..నీ భూటకపు నాటకాలు ఆపు కళ్యాణ్: ఎమ్మైల్సీ అద్దంకి దయాకర్ MLC Addanki Dayakar | Asianet Telugu
Related Stories
Recommended image1
KCR: ఉట్టి తెగదు పిల్లి కోరిక తీరదు.. కేసీఆర్ చెప్పిన ఈ సామెత అర్థం ఏంటో తెలుసా.?
Recommended image2
Now Playing
KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved