సినిమా ఫ్లాప్, కానీ నాన్న క్యారెక్టర్ మాత్రం ఐకానిక్.. సితారకి విపరీతంగా నచ్చిన మహేష్ బాబు మూవీ
అదేంటో కానీ ఇటీవల ఫ్లాప్ చిత్రాలకు ఫ్యాన్స్ ఎక్కువవుతున్నారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డప్పటికీ వాటిని క్లాసిక్ అని అభివర్ణిస్తున్నారు. అలాంటి చిత్రాల్లో మహేష్ నటించిన కొన్ని మూవీస్ ఉన్నాయి. మహేష్ ముద్దుల కూతురు సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
అదేంటో కానీ ఇటీవల ఫ్లాప్ చిత్రాలకు ఫ్యాన్స్ ఎక్కువవుతున్నారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డప్పటికీ వాటిని క్లాసిక్ అని అభివర్ణిస్తున్నారు. అలాంటి చిత్రాల్లో మహేష్ నటించిన కొన్ని మూవీస్ ఉన్నాయి. మహేష్ ముద్దుల కూతురు సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మాట్లాడే విధానం, క్యూట్ నెస్, డ్యాన్స్ స్కిల్స్ తో సితార అభిమానులకు బాగా చేరువైంది.
ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఒక జ్యువెలరీ సంస్థని ప్రమోట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నటిగా మారేందుకు సితార ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమాలపై అవగాహన పెంచుకుంటోంది. తన తండ్రి మహేష్ బాబు నటించే చిత్రాలని క్షుణ్ణంగా పరిశీలిస్తుందట.
Also Read: నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్, నేను అలా అనుకోలేదు.. పిల్లల్ని కనడంపై శోభిత కామెంట్స్
మహేష్ బాబు నటించిన చిత్రాల్లో తనకి బాగా ఇష్టమైన చిత్రం ఖలేజా అని చెప్పి ఆశ్చర్యపరిచింది. సితార సమాధానం విని యాంకర్ కూడా ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఖలేజా గురించి చెప్పాలంటే ఎవరైనా కాస్త ఆలోచిస్తారు. కానీ నువ్వు అదే బెస్ట్ మూవీ అని అంటున్నావు ఎందుకు అని అడగగా.. అందులో నాన్న సీతారామరాజు క్యారెక్టర్ ఐకానిక్ అని సితార పేర్కొంది.
ఆ సినిమా అంటే నాకు పిచ్చ ఇష్టం. నాన్న సినిమాల్లోనే ఖలేజా ది బెస్ట్ మూవీ అంటూ సితార కితాబిచ్చింది. నాన్న క్యారెక్టర్ మాత్రమే కాదు.. ఆ చిత్రంలో ప్రతి విషయం నాకు ఇష్టం అని సితార పేర్కొంది.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. కానీ టీవీల్లో మాత్రం ఆడియన్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా చూస్తుంటారు. మహేష్ బాబులో కామెడీ యాంగిల్ ని త్రివిక్రమ్ ఈ చిత్రంలో బయట పెట్టారు. అనుష్క ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది.