- Home
- Entertainment
- Sameera Bharadwaj Remuneration: సింగర్ సమీరా భరద్వాజ్ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
Sameera Bharadwaj Remuneration: సింగర్ సమీరా భరద్వాజ్ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
అల్లాడిపోతున్నాడమ్మా అంటూ చేసిన ఒక్క వీడియోతో పాపులర్ అయిన సింగర్ సమీరా భరద్వాజ్ ఇప్పుడు గాయనిగా బిజీగా ఉంది. మరి ఆమె ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

ఒక్క వీడియోతో పాపులర్ అయిన సమీరా భరద్వాజ్
ప్లేబ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా చెప్పొచ్చు. `అల్లాడిపోతున్నాడమ్మా` అంటూ భర్తని ఉద్దేశ్యించి ఆమె చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాని ఊపేసింది. దెబ్బకి పాపులర్ అయ్యింది. ఆమె సింగర్‌గా చాలా ఏళ్ల నుంచే రాణిస్తున్నా, పెద్దగా గుర్తింపు రాలేదు, మ్యూజిక్ ప్రపంచానికి తప్ప సాధారణ ఆడియెన్స్ కి ఆమె ఎవరో తెలియదు, ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆ వీడియో ఆమెని ప్రపంచానికి తెలిసేలా చేసింది. స్టార్‌గా మార్చేసింది.
సింగర్‌గా బిజీగా ఉన్న సమీరా భరద్వాజ్
ప్రస్తుతం సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా, ఇన్ ఫ్లూయెన్సర్‌గా బిజీగా ఉంటోంది. ఇప్పుడు ఆమెకి నటిగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో హీరోయిన్లకి డబ్బింగ్ కూడా చెబుతుంది. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తోన్న సమీరా భరద్వాజ్ కెరీర్ ఇప్పుడు పరుగులు పెడుతుందని చెప్పొచ్చు. ఆమె చాలా బిజీగా ఉంటోంది. సింగర్‌గానూ ఆఫర్లు పెరిగాయి. క్రేజీ సింగర్‌గానూ రాణిస్తోంది. యంగ్ హీరోల సినిమాల నుంచి పాన్ ఇండియా చిత్రాల వరకు అన్నింటిలోనూ పాటలు పాడుతూ ఆకట్టుకుంటోంది.
సమీరా భరద్వాజ్ పారితోషికం
`బ్రూస్‌లీ`లోని టైటిల్ సాంగ్ సమీరా భరద్వాజ్‌ని పాపులర్ చేసింది. `సరైనోడు`లో తెలుసా తెలుసా, `అర్జున్ రెడ్డి`లో మధురమే ఈ క్షణమే, `శతమానం భవతి`లో నాలో నేను, `మిస్టర్ బచ్చన్`లో అబ్బ చ్ఛా.. `తండేల్`లో బుజ్జితల్లి, `కోర్ట్`లో ప్రేమలో.. వంటి చాలా పాటలు ఆలపించింది. మరి ఆమె ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఒక్కో పాటకి సమీరా భరద్వాజ్ రెండు నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటుందని టాక్. చిన్న సినిమాలకు రూ.1.5లక్షల నుంచి రెండు లక్షలు, పెద్ద సినిమాలకు రెండు నుంచి మూడు లక్షల వరకు అందుకుంటుందని సమాచారం.
మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తోన్న సమీరా రెడ్డి
ఇలా సమీరా భరద్వాజ్ ఇప్పుడు గట్టిగానే సంపాదిస్తోంది. కేవలం పాటల ద్వారానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ బాగానే సంపాదిస్తోంది. ఇంకోవైపు సినిమాల్లో నటిస్తోంది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటే, తనకు నచ్చిన పాత్రలు వస్తే నటించేందుకు తాను సిద్ధమే అని చెబుతోంది. ఖమ్మం జిల్లాకి చెందిన సమీరా భరద్వాజ్ చెన్నైలోనే పెరిగింది. అమ్మవాళ్లది గోదావరి, నాన్నది విజయవాడ, ఇప్పుడు ఉండేది హైదరాబాద్. ఇలా మూడు రాష్ట్రాలను చుట్టేసిన సమీరా రెడ్డి భర్త టీసీఎస్‌లో జాబ్ చేస్తున్నారు. వీరికి కూతురు ఆద్య ఉంది. పెళ్లికి ముందు స్ట్రగుల్ అయిన సమీరా రెడ్డి.. పెళ్లి తర్వాత గుర్తింపు తెచ్చుకుంది. మ్యారేజ్ తర్వాతనే తన లైఫ్ మారిపోయిందని చెబుతుంది.
