- Home
- Entertainment
- సిల్క్ స్మిత నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆమె చనిపోవడానికి డాక్టర్ కారణం కాదు.. ఇదెక్కడి ట్విస్ట్
సిల్క్ స్మిత నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆమె చనిపోవడానికి డాక్టర్ కారణం కాదు.. ఇదెక్కడి ట్విస్ట్
ఐటెమ్ సాంగ్స్ తో సౌత్ సినిమాని షేక్ చేసిన సిల్క్ స్మిత మరణానికి సంబంధించిన మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆమె ఓ నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకుందట.

సిల్క్ స్మిత మరణంపై ఇప్పటికీ అనుమానాలు
వ్యాంప్ పాత్రలతో, ఐటెమ్ సాంగ్స్ తో సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనేది అందరికి తెలిసిన విషయం.
అక్కడ సూసైడ్ నోట్ కూడా లభించడంతో ఆమె ఆత్మహత్యనే చేసుకుందని పోలీసులు ధృవీకరించారు. అంతా అదే నమ్మారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇదే అనేక అనుమానాలకు తావిచ్చింది.
సిల్క్ స్మిత మరణానికి డాక్టర్ రాధాకృష్ణ కారణం కాదా?
ఇదిలా ఉంటే సిల్క్ స్మిత రాసిన సూసైడ్ నోట్ ప్రకారం, ప్రచారంలో ఉన్న దాని ప్రకారం, తనని చాలా మంది మోసం చేశారని తెలిపింది. అందులో డాక్టర్ రాధాకృష్ణ కూడా ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు.
ఆయనే మెయిన్ కారణం అని అంటుంటారు. ఆయన పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, డబ్బులు వాడుకున్నాడని, తనని అన్నిరకాలుగా వాడుకుని మోసం చేశాడనేది ప్రచారంలో ఉంది.
మరోవైపు ఆయన కొడుకుతో సిల్క్ స్మిత ప్రేమాయణం నడిపిందని, దీంతో వాళ్లే హింసలు పెట్టి చనిపోయేలా చేశారనే మరో వాదన కూడా వినిపిస్తుంటుంది. కొడుకుతో సిల్క్ స్మిత వ్యవహారం చూసి రాధాకృష్ణనే ఆమెని చంపేసి ఉంటాడని మరో ప్రచారం కూడా వినిపించింది.
సిల్క్ స్మిత మరణంలో కొత్త కోణం
మరోవైపు ఓ స్టార్ హీరోని ప్రేమించిందని, అతను మోసం చేశాడని అంటుంటారు. ఇలా రకరకాల వాదనలు, వార్తలు చలామణిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది.
సీనియర్ జర్నలిస్ట్ తోట భవనారాయణ మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సిల్క్ స్మిత గురించి మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు జర్నలిస్ట్ గా వెళ్లిన తొలి వ్యక్తిని తానే అని ఆయన చెప్పారు.
చెన్నైలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని, సూసైడ్ నోట్ మొదట తనతోనే చదివించారని తెలిపారు. ఆ లెటర్‌ని చదివిన మొదటి వ్యక్తిని తానే అని, అది తన పత్రికలోనే ప్రచురించినట్టు తెలిపారు.
నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుకున్న సిల్క్ స్మిత
అయితే అందులో తెలిపినదాని ప్రకారం ఆమె తనకు మేనేజర్‌గా వ్యవహరించిన డాక్టర్ రాధాకృష్ణని ఎక్కడా బ్లేమ్ చేయలేదని, బాబు ఒక్కరే మంచివారు అని, తనకు అండగా ఉన్నారని ఆమె వెల్లడించింది.
కొంత మంది చేత తాను మోసపోయినట్టు ఆమె తెలిపిందన్నారు. అయితే సిల్క్ స్మిత ఓ తమిళ నిర్మాతని పెళ్లి చేసుకోవాలనుందనే కొత్త విషయాన్ని ఈ సందర్భంగా జర్నలిస్ట్ వెల్లడించారు.
ఆయనతో కలిసి కొన్ని సినిమాలు కూడా చేసిందట, కానీ అవి ఆడలేదని, దీంతో ఆ నిర్మాతతో గ్యాప్ వచ్చిందని, దాని వల్ల కూడా ఆమె బాధపడి ఉండొచ్చు అని ఆయన చెప్పారు.
జీవితంలోని శూన్యం కారణంగానే సిల్క్ స్మిత ఆత్మహత్య?
తనకు అర్థమైన విషయం ఆయన చెబుతూ, సిల్క్ స్మితని చాలా మంది చాలా రకాలుగా మోసం చేశారు, తనకంటూ ఫ్యామిలీ లేదు, దీంతో ఒంటరైపోయిన ఫీలింగ్ ఆమెకి వెంటాడి ఉండొచ్చు అని,
జీవితంలో ఒక శూన్యాన్ని ఆమె చూసి ఉండొచ్చు అని, దీని కారణంగానే మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అని, అదే తనకు సూసైడ్ నోట్ ద్వారా అర్థమైందని ఆయన వెల్లడించారు.
సిల్క్ స్మిత ఆస్తులను ఆ డాక్టర్ దోచుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు, కానీ రాధాకృష్ణ అలా చేయలేదని పోలీసులు చెప్పినట్టుగా జర్నలిస్ట్ తెలిపారు. ఆయన కూడా అన్ని విషయాలకు సపోర్ట్ చేశారని వెల్లడించారు.
సిల్క్ స్మిత మరణానికి ఆర్థిక నష్టాలు కారణం కాదని, ఆమెకి మంచి ఆస్తులు,డబ్బులు ఉందని ఆయన చెప్పడం గమనార్హం. ఆర్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.