సిల్క్ స్మిత హీరోయిన్‌గానే కాదు, ఆమెలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలుసా ?
సిల్క్ స్మిత హీరోయిన్‌గానే, బోల్డ్ రోల్స్ తో ఆకట్టుకుంది. సౌత్ సినిమాని ఓ ఊపు ఊపేసింది. అయితే నటిగా కాకుండా ఆమెలో మరో టాలెంట్ కూడా ఉంది.
సిల్క్ స్మిత బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. సినిమా ద్వారా ఆమె ఎంతో మందికి వినోదాన్ని పంచింది. ఎంతగానో ఆకట్టుకుంది. సిల్క్ స్మిత సినిమాలో ఉందంటే మాస్ ఆడియెన్స్ కి పండగే. ఎగబడి సినిమా చూసిన సందర్భాలున్నాయి. సినిమాకి క్రేజ్ కోసం ఆమెని పెట్టుకున్న మేకర్స్ కూడా ఉన్నారు. స్టార్ హీరోలు సైతం సిల్క్ స్మితని తమ సినిమాల్లో ఉండాలని పట్టుపట్టేవారు. ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేసేవారు.
అంతగా సౌత్ సినిమాని దశాబ్దన్నరపాటు శాషించింది సిల్క్ స్మిత. కరెక్ట్ గా 16ఏళ్లు ఆమె నటిగా కొనసాగింది. ఈ టైమ్‌లోనే ఆమె 360కిపైగా సినిమాల్లో నటించడం విశేషం. ఏడాదికి ఇరవై, ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యేవి. అంటే ప్రతి వారం ఏదో ఒక సినిమాలో కనిపించేది సిల్క్ స్మిత. ఆమె ఉన్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ థియేటర్లకి క్యూ కట్టేవారు.
సిల్క్ స్మిత హీరోయిన్‌గానూ సినిమాలు చేసింది. బోల్డ్ రోల్స్ చేసింది. వేశ్య పాత్రలు చేసింది. కొన్ని అడల్ట్ కంటెంట్ మూవీస్ చేసింది. పాత్రని ఏదైనా రక్తికట్టించేది. అయితే ఆమె పాత్రల్లో రొమాంటిక్ ఎలిమెంట్లు ఉండేవి తప్ప, వల్గారిటీ ఉండేది కాదు. అందుకే పెద్ద పెద్ద హీరోలు కూడా సిల్క్ స్మితని కోరుకునే వారు.
read more: రోజాకి చుక్కలు చూపించిన బాలకృష్ణ.. సెట్‌కి రోజూ ముందుగా రమ్మన్నది ఎందుకో తెలుసా?
అయితే నటిగానే కాదు, సిల్క్ స్మితలో మరో టాలెంట్ ఉంది. ఆమె పేదరికం ఉన్న స్థితిలో సినిమాల్లోకి వచ్చింది. పెళ్లి జీవితం సెట్ కాకపోవడంతో పనిమనిషిగానూ పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సిల్క్ స్మిత మంచి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. నటిగా మారకముందు చాలా సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిందట. అంతేకాదు మేకప్ ఆర్టిస్ట్ గానూ వర్క్ చేసింది. ఈ విభాగాల్లో బెస్ట్ అనిపించుకుందట. ఈ క్రమంలోనే ఆమెనిలోని ఫీచర్స్ గమనించిన మేకర్స్ సినిమాల్లోకి తీసుకొచ్చారు.
Tamil Actress Silk Smitha
సిల్క్ స్మిత మొదటి సారి మలయాళ మూవీ `ఒట్టపట్టేవార్` మూవీలో నటించింది. ఆ మూవీలో సిల్క్ స్మితని చూసిన మేకర్స్ వరుసగా బుక్ చేసుకున్నారు. ఇలా మొదటి ఏడాదే ఆమెకి బ్యాక్ టూ బ్యాక్ ఏడు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక్క తమిళ సినిమా, ఆరు మలయాళ చిత్రాల్లో నటించి అలరించింది. దీంతో ఆమె గురించి తెలిసి `సీతాకోక చిలుక` సినిమా ద్వారా తెలుగుకి పరిచయం చేశారు దర్శకుడు భారతీరాజా. మొదట్లో కొంత ఆసక్తి చూపించలేదు. కానీ ఒకటి రెండు ఏళ్లలోనే ఆమెకి తెలుగు మేకర్స్ కూడా క్యూ కట్టారు.
ఇలా వరుసగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ రాణించింది. దీంతో హిందీతోపాటు సౌత్ సినిమాని ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఆమె 1996లో ఆత్మహత్య చేసుకుని కన్నుమూసిన విషయం తెలిసిందే. తాను నమ్మినవాళ్లే మోసం చేశారని ఆమె చివరగా రాసిన లెటర్‌లో పేర్కొంది. అయితే ఆమె మద్యానికి బానిసగా మారి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. సిల్క్ స్మిత ఉన్నంత కాలం మాత్రం తన వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నా, తెరపై మాత్రం హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్లకి మించిన క్రేజ్‌తో రాణించడం విశేషం.
read more:నాగచైతన్య, శోభితా పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు వీళ్లే, గెస్ట్ లిస్ట్.. ఆమెనే స్పెషల్ ఎట్రాక్షన్