రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
పెద్ద సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. ఈ సినిమా ఏప్రెల్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈక్రమంలో పెద్ది సినిమాను చిరంజీవి చూసినట్టు తెలుస్తోంది. ఆయన రివ్యూ ఏంటంటే?

రామ్ చరణ్ పెద్ది రిలీజ్ ఎప్పుడు?
వరుసగా రెండు ప్లాప్ లు చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
సక్సెస్ కోసం ఎదురుచూపులు
ఈ సినిమాతో రామ్ చరణ్, బుచ్చిబాబు ఎలాంటి విజయాన్ని సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్‌కు ఒక సాలిడ్ హిట్ అవసరం. ఆ లక్ష్యంతోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ హీరోగా మారిన చరణ్.. ఆతరువాత చేసిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో పెద్ది సినిమా హిట్ చరణ్ కెరీర్ కు చాలా ముఖ్యమని చెప్పాలి.
పెద్ది సినిమాను చూసిన చిరంజీవి?
తాజాగా ఈ సినిమా రఫ్ ఫుటేజ్‌ను మెగాస్టార్ చిరంజీవి చూసినట్లు తెలుస్తోంది. ఫుటేజ్‌పై ఆయన కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కొన్ని సన్నివేశాల విషయంలో మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు కొన్ని సీన్స్‌ను తొలగిస్తారా? లేక మరింత మెరుగులు దిద్దుకుని స్క్రీన్‌పై ప్రదర్శిస్తారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
చిరంజీవి జడ్జిమెంట్‌పై నమ్మకం..
చిరంజీవి జడ్జిమెంట్‌పై దర్శక నిర్మాతలకు విశ్వాసం ఉంది. ఇప్పటికే 150 సినిమాలకు పైగా నటించిన ఆయనకు 45 సంవత్సరాలకు పైగా సినీ అనుభవం ఉంది. మాస్ హీరో నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆయనకు అవగాహన ఉన్నదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అందుకే ఆయన సూచనలను మూవీటీమ్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక గత సంవత్సరం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ, ‘పెద్ది’ మాత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు సమాచారం.

