నాగచైతన్య, శోభితా పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు వీళ్లే, గెస్ట్ లిస్ట్.. ఆమెనే స్పెషల్ ఎట్రాక్షన్
నాగచైతన్య హీరోయిన్ శోభితా దూళిపాళని రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రేపే వీరి పెళ్లి జరగబోతుంది. అయితే ఈ మ్యారేజ్‌కి హాజరయ్యే గెస్ట్ ల లిస్ట్ చూద్దాం.
Naga Chaitanya
అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో శుభం కార్డు వేయబోతున్నారు. ఈ ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్‌గానే జరుగుతున్నాయి. రేపు బుధవారం(డిసెంబర్ 4) రాత్రి వీరి వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పెళ్లి పనుల్లో అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు శోభితా ఫ్యామిలీ బిజీగా ఉంది. ఇటీవల హల్దీ వేడుక నిర్వహించారు.
Naga Chaitanya
నేడు పెళ్లి కూతురిని చేయడం, పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కాబోతుంది. స్టూడియోలో చాలా పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి. షూటింగ్‌ల నిమిత్తం వాటిని ఉపయోగిస్తుంటారు. వాటిలో ఒక ఫ్లోర్‌లో చైతూ, శోభిత పెళ్లి వేడుక జరగబోతుందట. చైతూకి ఇప్పటికే సమంతతో పెళ్లి అయ్యింది. ఆమెకి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. శోభితాని రెండో వివాహంగా చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే చైతూ మ్యారేజ్‌కి సెలబ్రిటీలు ఎవరెవరు హాజరవుతారు. గెస్ట్ లు ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు చాలా పరిమితిలోనే గెస్ట్ లు హాజరయ్యే అవకాశం ఉందట. ఇరు కుటుంబాలు ప్రధానంగా ఉంటారు. వారి దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తుంది.
ఇక వీరితోపాటు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అమల, అఖిల్, సుమంత్, సుశాంత్, సుశీలమ్మ ఇలా నాగార్జున అక్కలు, అన్నయ్య, వారి ఫ్యామిలీ మెంబర్స్ హాజరవుతారు. వీరితోపాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా హాజరవుతుంటుంది. హీరో వెంకటేష్, సురేష్‌బాబు, రానా, అభిరామ్ వారి పిల్లలు హాజరు కాబోతున్నారు. ఇక నాగచైతన్య అమ్మ లక్ష్మి కచ్చితంగా హాజరు కాబోతుంది. ఓ రకంగా ఆయనకు ఆమెనే స్పెషల్ గా నిలవబోతుందని చెప్పొచ్చు.
Allu Arjun
వీరు కాకుండా బయట నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ అటెండ్ అవుతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. `తండేల్` టీమ్ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అంటే సాయి పల్లవి కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇది నిజమే అయితే నిజంగానే చైతూ మ్యారేజ్ అతి కొద్ది మందితో చేసుకున్నా చాలా స్పెషల్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. జగన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారని టాక్. అయితే రిసెప్షన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ రిసెప్షన్ ఉంటే కచ్చితంగా సినీ ప్రముఖులను హాజరవుతారని చెప్పొచ్చు.
read more: రష్మిక ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
also read: ఒక్క వేషం ఇవ్వమని ఎన్టీఆర్ ని బతిమాలిన కుర్రాడు, కట్ చేస్తే ఆయనకే పోటీగా సినిమాలు చేసి స్టార్ హీరోగా సంచలనం