రోజాకి చుక్కలు చూపించిన బాలకృష్ణ.. సెట్‌కి రోజూ ముందుగా రమ్మన్నది ఎందుకో తెలుసా?
బాలకృష్ణ, రోజా కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే ఓ సినిమా సెట్లో మాత్రం బాలయ్య చాలా ఇబ్బంది పెట్టాడట. షూటింగ్‌కి ముందుగా రమ్మని చెప్పి ఆ పని చేసేవాడట.
బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పేవాళ్లు ఉన్నారు? నెగటివ్‌గా చెప్పే వాళ్లూ ఉన్నారు. బాలయ్య కోపం ఎక్కువ అని, చిన్న వాళ్లని పట్టించుకోడని, పురుగులను చూసినట్టు చూస్తాడని అంటుంటారు. మరికొందరు బాలయ్య బయటకే అలా కనిపిస్తాడని, ఆయన మనసు వెన్న, చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఏది లోపల ఉంచుకోరని, ఎంతో ప్రేమగా చూస్తారని, తోటి ఆర్టిస్ట్ లను ఎంతో రెస్పెక్ట్ చేస్తారని అంటుంటారు. ఎవరి అనుభవాలు వారివి.
balakrishna roja
అయితే మాజీ మంత్రి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజాని మాత్రం అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టాడట బాలయ్య. సెట్‌లో చుక్కలు చూపించాడట. మరి ఏం చేశారు? ఏ సినిమా సెట్‌లో ఇబ్బంది పెట్టాడనేది చూస్తే. బాలకృష్ణ, రోజా కలిసి చాలా సినిమాలు చేశారు. `భైరవద్వీపం`, `బొబ్బిలి సింహం`, `గాంఢీవం`, `మాతో పెట్టుకోకు`, `శ్రీ కృష్ణా విజయము`, `పెద్దన్నయ్య`, `సుల్తాన్` చిత్రాల్లో కలిసి నటించారు. `పరమ వీర చక్ర`, `శ్రీరామ రాజ్యం` చిత్రాల్లో జోడీగా కాకుండా నటించారు. ఇలా దాదాపు పది సినిమాల్లో ఈ ఇద్దరు భాగమయ్యారు. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పొచ్చు.
కానీ `పెద్దన్నయ్య` సినిమా సెట్లో మాత్రం బాలయ్య.. రోజాకి చుక్కలు చూపించాడట. ఫుడ్‌తో ఇబ్బంది పెట్టాడట. రోజూ త్వరగా సెట్ కి రావాలని, ఎక్కువగా టిఫిన్, భోజనం పెట్టించేవాడట. ఆమె కడుపు నిండా తినాలని ఒత్తిడి చేసేవాడట. రోజూ అలానే జరిగేదట. దీంతో రోజా చాలా ఇబ్బంది పడిపోయిందట.
అయితే అదంతా ప్రేమతో చేస్తున్నాడని భావించింది రోజా. కానీ దానికి అసలు కారణం వేరే ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషించారు. అన్నగా, తమ్ముడిగా కనిపిస్తారు. పెద్దన్న పాత్రకు జోడీగా రోజా నటించింది.
అయితే ఆ సమయంలో రోజా కాస్త సన్నగా ఉందట. పెద్దన్న పాత్రకు జోడీగా ఇలా సన్నగా ఉంటే సెట్ కాదని చెప్పి, లావు అయ్యేందుకు బాగా భోజనం పెట్టాడట బాలయ్య. అందుకోసమే షూటింగ్ ప్రారంభానికి ముందుగానే సెట్‌కి రావాలని రోజాకి చెప్పాడట.
వచ్చాక బాగా కడుపునిండా భోజనం పెట్టించేవాడట. కాస్త లావుగా కనిపించిన తర్వాత షూటింగ్ చేసేవారట. అది పాత్ర కోసమే చేసినా రోజా మాత్రం బాగానే ఇబ్బంది పడిందట.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి, ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా బాలయ్య గురించి గొప్పగా చెప్పింది. ఆయన సెట్‌లో ఉన్నాడంటే సందడే సందడి అని, అందరి పిలిపించుకుని మాట్లాడతారని తెలిపారు రోజా. చాలా జోవియల్‌గా ఉంటారని, ఇప్పుడూ కూడా అంతే ఫ్రీగా ఉంటారని తెలిపింది రోజా. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది.
read more;నాగచైతన్య, శోభితా పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు వీళ్లే, గెస్ట్ లిస్ట్.. ఆమెనే స్పెషల్ ఎట్రాక్షన్
also read: రష్మిక మందన్న ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే