- Home
- Entertainment
- Shriya Saran: రెడ్ శారీలో శ్రియా శరణ్ అదిరిపోయే లుక్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
Shriya Saran: రెడ్ శారీలో శ్రియా శరణ్ అదిరిపోయే లుక్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ఇంటర్నెట్‌లోకి వచ్చింది. ఆమె తన గ్లామర్ ఫోటోలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. రెడ్ శారీలో దుమ్మురేపుతోంది.

సోషల్ మీడియా ద్వారా అలరిస్తోన్న శ్రియా
శ్రియా శరణ్ గత కొంత కాలంగా మన తెలుగు సినిమాల్లో మెరవడం లేదు. ఆమెకి ఆఫర్లు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో తాను కూడా సెలక్టీవ్‌గా వెళ్తోంది. దీంతో గ్యాప్ వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లని, ఆమె అభిమానులను అలరిస్తోంది.
రెడ్ శారీలో మెరిసిన శ్రియా
తాజాగా శ్రియా రెడ్ శారీలో మెరిసింది. పలుచని రెడ్ శారీలో మెరిసింది. అదిరిపోయే పోజులిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. విభిన్నమైన లుక్ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఏంజెల్‌లా ఉందంటున్న నెటిజన్లు
శ్రియా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ, ఏంజెల్‌లా ఉందని కామెంట్ చేస్తున్నారు. గార్జియస్ లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా క్యూట్‌గా ఉందని, అందం ఓవర్‌లోడ్ అంటున్నారు. మొత్తంగా శ్రియా గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు.
ఇష్టంతో శ్రియా టాలీవుడ్ ఎంట్రీ
శ్రియా శరణ్ `ఇష్టం` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. `సంతోషం` మూవీతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత భారీ ఆఫర్లు అందుకుంది. `చెన్నకేశవరెడ్డి`తో బిగ్ బ్రేక్ అందుకుంది. స్టార్ అయిపోయింది.
శ్రియా తెలుగు సినిమాలు
`నువ్వే నువ్వే` ఆమెకి మరో బిగ్ హిట్ ఇచ్చింది. దీంతో అటు సీనియర్లు, జూనియర్లతో కలిసి నటించింది. `నీకు నేను నాకు నువ్వు`, `ఠాగూర్`, `ఎలా చెప్పాను`, `నేనున్నాను, `నీ మనసు నాకు తెలుసు`, `అర్జున్`, `బాలు`, `నా అల్లుడు`, `సదా నీ సేవలో`, `సోగ్గాడు`, `సుభాష్ చంద్రబోస్`, `ఛత్రపతి`, `భగీరథ`, `మున్నా`, `డాను శీను` వంటి చిత్రాల్లో నటించి మెప్పింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో అలరిస్తోన్న శ్రియా
చివర్లో శ్రియా నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అదే సమయంలో పెద్ద ఆఫర్లు లేవు. దీంతో క్రమంగా డౌన్ అయ్యింది. అదే సమయంలో ఆమె ప్రేమలో పడింది. ఆండ్రీ కోచ్చీవ్‌తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత 2018లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు జన్మించింది. ఆమెకి రాధా అని పేరు పెట్టడం విశేషం. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రియా.. ఆ మధ్య `మిరాయ్`లో మెరిసింది. ఇప్పుడు తమిళంలో, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్స్ తో అలరించేందుకు వస్తోంది శ్రియా.

