- Home
- Entertainment
- Paradise Team Remunerations: ప్యారడైజ్ మూవీ టీమ్ పారితోషికాలు.. నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంతంటే?
Paradise Team Remunerations: ప్యారడైజ్ మూవీ టీమ్ పారితోషికాలు.. నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంతంటే?
Paradise Team Remunerations: నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్` మూవీ ఈ రాత్రినే ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన ఆర్టిస్ట్ ల పారితోషికాల సమాచారం లీక్ అయ్యింది. నాని ఎంత తీసుకున్నాడంటే?

ప్యారడైజ్ మూవీ పారితోషికాలు
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ విడుదలకు సిద్ధమైంది. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ విలన్‌గా నటించగా.. మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీపై భారీ హైప్ ఉంది. మరి దాన్ని సినిమా ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి. అయితే సినిమా విడుదలకు ముందు `ది ప్యారడైజ్`లో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నీషియన్ల పారితోషికాలపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి ఎవరు ఎంత తీసుకున్నారనేది చూద్దాం.
నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్
ది ప్యారడైజ్‌లో హీరోగా నటిస్తున్న నాని ఈ సినిమాకు సుమారు రూ.35-40 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇది నాని కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. అంతకు ముందు ముప్పై కోట్ల లోపే ఆయనకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి పెంచారట. సినిమాకి అయిన బడ్జెట్‌లో మేజర్‌గా నానికే వెళ్లిందని చెప్పొచ్చు.
మోహన్ బాబు రెమ్యునరేషన్
సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపిస్తున్న మోహన్ బాబు పారితోషికంపై కూడా గతంలో వార్తలు వచ్చాయి. సుమారు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు ఆయనకు చెల్లించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పాత్ర ఇంపార్టెన్స్, లుక్ కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కారణంగా ఆయనకు భారీ మొత్తమే ఇచ్చినట్లు సమాచారం.
రాఘవ్ జుయల్, కయాదు లోహర్
బాలీవుడ్‌లో తన డ్యాన్స్, నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ జుయల్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు దాదాపు ఐదు కోట్లు ఇచ్చినట్టు సమాచారం. మరో కీలక పాత్రలో నటించిన సంపూర్నేష్ బాబుకి రూ.38లక్షలు ఇచ్చారట.
ఇక కయాదు లోహర్‌ది సినిమాలో కీలకమైన పాత్ర. ఆమెకి రూ.1.5 కోట్ల పారితోషికం తీసుకుంటుందట.
అనిరుధ్‌కు భారీ మొత్తం?
సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ పారితోషికం కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ది ప్యారడైజ్ కోసం ఆయనకు సుమారు రూ.15 కోట్ల పారితోషికం అందినట్లు టాక్. సినిమా టెక్నికల్ టీమ్‌లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంతో పాటు అనిరుధ్ సంగీతం, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ వంటి విభాగాలు ఉన్నాయి. దర్శకుడికి ఐదు కోట్లలోపు ఇచ్చారట. మిగిలిన వారికి లక్షల్లో దక్కిందని సమాచారం.

