Shriya Saran: అమేజింగ్.. శారీలో శ్రీయ శరన్ అందాలు చూశారా.. చూపు తిప్పుకోవడం కష్టం
అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ.
ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. శ్రియా తాజాగా నటించిన చిత్రం గమనం. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత కొన్ని రోజులుగా శ్రీయ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీయ ట్రాన్స్పరెంట్ శారీలో అందంతో వెలిగిపోతోంది. నడుము అందాలు ప్రదర్శిస్తూ తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని నిరూపిస్తోంది శ్రీయ.
శ్రీయ తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
శ్రీయ, కొశ్చివ్ దంపతులకు ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు గర్భం దాల్చితే ఆ సీక్రెట్ బయటకు రాకుండా ఉండదు. కానీ శ్రీయ మేనేజ్ చేయగలిగింది. లాక్ డౌన్ లో శ్రీయ ఇండియాలో లేదు, ఇటలీ, స్పెయిన్ లో ఎక్కువగా గడిపింది. బహుశా ఆ టైంలో శ్రియ గర్భవతి అయి ఉండవచ్చు.
ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్ లో శ్రీయ పాత్రని చూపించారు. వివాహం అయినప్పటికీ తాను ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనే కోరికని శ్రీయ బయట పెట్టింది. Also Read: Gamanam Review: శ్రియా `గమనం` మూవీ రివ్యూ