Karthika Deepam: ఏయ్.. ముందు నీ పేరు చెప్పవే.. హిమను నిలదీసిన జ్వాల!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 24 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ(hima), సౌర్య గురించి సౌందర్యకు చెబుతూ ఒకరోజు ఐస్ క్రీమ్ పార్లర్ లో సౌర్య, నిరుపమ్ బావను ప్రేమిస్తున్నట్టు తెలిసింది. తన మొబైల్ లో బావ పేరు నా మొగుడు అని సేవ్ చేసుకుని అనడంతో సౌందర్య (soundarya)షాక్ అవుతుంది. ఇక అప్పటి నుంచి నా మనసును మార్చుకున్నాను అని చెప్పి అమ్మ నాన్న చనిపోయేముందు శౌర్య జాగ్రత్త హిమ అని చెప్పారు అంటూ హిమ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
అప్పుడు హిమ(hima) నేనే అని తెలియకుండా ఉండటం కోసం నేను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను. నాపై తనకు పీకల వరకు కోపం ఉంది అని చెబుతుంది హిమ. ఆ మాటలకు సౌందర్య(soundarya) ఎమోషనల్ అవుతూ హిమ ను ఓదారుస్తుంది. మరొకవైపు నిరుపమ్,జ్వాలా కి తన మనసులో మాట చెప్పినందుకు సంతోషంగా రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ జ్వాలా తో అలా మాట్లాడినందుకు సారీ జ్వాలా అని అంటాడు.
అప్పుడు హిమ(hima) గురించి ఆలోచిస్తూ హిమ ను పెళ్లి చేసుకొని అపురూపంగా చూసుకుంటాను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అని నిరుపమ్(Nirupam). మరొకవైపు జ్వాలా జరిగిన విషయం తలుచుకుని బాధ పడుతూ ఉండగా అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు సౌందర్య జరిగిన విషయం గురించి జ్వాలా ని అడుగుతుంది.
అతనికి నీకు గొడవ ఏంటి అని అడగగా అప్పుడు సౌర్య,నిరుపమ్ విషయంలో తాను కన్న కలల గురించి చెబుతూ బాధ పడుతుంది. జ్వాలా (jwala)మాటలకు సౌందర్య లోలోపల బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జ్వాల అంత బాగుంటే డాక్టర్ పెళ్ళాన్ని అయ్యేదాన్ని అని అనడంతో సౌందర్య మరింత బాధపడుతుంది. అప్పుడు జ్వాలా సినిమాకి వెళ్దామా అని అనగా అప్పుడు సౌందర్య(soundarya)ఇప్పుడే కదే లవ్ ఫెయిల్యూర్ అన్నావ్ మరి సినిమాకి అంటున్నావు అని అనగా మనం దెబ్బ తగిలితే ఏడ్చుకుంటూ కూర్చుని టైపు కాదు అంటుంది జ్వాలా.
అప్పుడు జ్వాలా(jwala) మాటలకు సౌందర్య లోలోపల కుమిలిపోతు ఉంటుంది. అప్పుడు జ్వాలా,హిమ గురించి మాట్లాడుతూ తన గురించి నేను చూసుకుంటాను అని అనడంతో సౌందర్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పడు జ్వాలా,నిరుపమ్ కోసం తను రక్తంతో గీసిన బొమ్మను చూపించడంతో సౌందర్య బాధపడుతూ ఎమోషనల్ అవుతూ జ్వాలాని హత్తుకుంటుంది. మరొకవైపు శోభ(shobha) ,స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు శోభ,నిరుపమ్(Nirupam)తో తన పెళ్లి చేయమని అడుగుతుంది. మరొకవైపు సౌందర్య ,జ్వాలా ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు వారిద్దరు కాస్త ఫన్నీగా మాట్లాడుకుంటూ వుంటారు. రేపటి ఎపిసోడ్ లో శోభ,హిమ(hima) ను జ్వాలా ముందు అడ్డంగా బుక్ చేయాలని జ్వాలాకి ఫోన్ చేసి నేను హిమని ఇక్కడికి రా అని చెప్పి హిమ ఉన్న అడ్రస్ చెబుతుంది. అప్పుడు జ్వాలా అక్కడికి వచ్చి హిమ ను అసలు నీ పేరు ఏంటో చెప్పవే అంటూ హిమ ను నిలదీస్తుంది.