- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్యను బంగారం అంటూ ముద్దు పెట్టుకున్న సౌందర్య.. సీరియల్ లో డాక్టర్ బాబు సీన్!
Karthika Deepam: శౌర్యను బంగారం అంటూ ముద్దు పెట్టుకున్న సౌందర్య.. సీరియల్ లో డాక్టర్ బాబు సీన్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే శోభా (Sobha) నా సంగతి నీకు తెలీదు నేను డేంజర్ అని చెబుతుంది. ఇక జ్వాల (Jwal) నేను డబల్ డేంజర్ అని చెబుతుంది. మరోవైపు ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హిమ తో అర్జెంటుగా పెళ్లి గురించి మాట్లాడాలి అని అనుకుంటాడు.
మరోవైపు శోభా (Sobha) ఎలాగైనా నిరూపమ్ ను పెళ్లి చేసుకోవాలి, నా హాస్పిటల్ కి చేసిన అప్పు అంతా ఇద్దరం కలిసి హ్యాపీ గా తీర్చు కోవచ్చు అని అనుకుంటుంది. ఇక నిరూపమ్ (Nirupam) మనసు మార్చడమే నా ముందున్న కర్తవ్యం అని అనుకుంటుంది. ఒకవైపు ఇంద్రుడు ఫుల్ గా మందుకొట్టి ఉంటాడు.
ఇక జ్వాల (Jwala) ఇద్రుడిని తన భుజాల మీద వేసుకొని తీసుకువస్తుంది. ఈలోగా అక్కడకు సౌందర్య (Jwala) వచ్చి మీ బాబాయి ఇలా తాగి తిరుగుతుంటే నీ కళ్ళలో కోపం లేకుండా.. ప్రేమ కనిపిస్తుంది ఏంటి అని అడుగుతుంది. ఇక హిమ చెప్పిన సమాధానానికి.. నా గుండెని తాకవ్ బంగారం అని సౌందర్య అంటుంది.
మరోవైపు శోభా (Sobha) నువ్వు వేరే అమ్మాయితో చనువుగా ఉన్నట్లు నటించు, అప్పుడు నువ్వు హిమ (Hima) మనసులో ఉన్నావో లేదో తెలుస్తుంది అని అంటుంది. ఐడియా బాగుంది నేను ఫాలో అవుతాను అని నిరూపమ్ అంటాడు. ఈలోగా అక్కడకు డాక్టర్ సాబ్ అంటూ జ్వాల వస్తుంది.
ఇక నిరూపమ్ (Nirupam) జ్వాలా చేయి పట్టుకొని హిమ ముందు క్లోజ్ గా నడుస్తాడు. ఇక శోభా (Sobha) నాతో క్లోజ్ గా ఉండాడు అనుకుంటే హిమతో ఉంటున్నాడు ఏంటి? అని ఆలోచిస్తుంది. ఈ విషయం గురించి శోభా స్వప్న తెలుపుతుంది. స్వప్న శోభా కు జ్వాల విషయంలో సలహాలు ఇస్తుంది. అంతే కాకుండా దాని తో జాగ్రత్త అది ఊర మాస్ ఉంటుంది.
ఇక తరువాయి భాగం జ్వాల (Jwala) నిరూపమ్ (Nirupam) లు రెస్టారెంట్ లో పక్క పక్కన కూర్చుని ఉంటారు. ఈలోపు అక్కడకు హిమ కూడా వస్తుంది. మీరిద్దరూ ఉన్నప్పుడు నన్ను పిలవడం ఎందుకు అని అంటుంది. అంతేకాకుండా వేడివేడిగా ఒక వెజ్ సూప్ తీసుకురా కాలి పోవాలి అని అంటుంది. ఇక నిరూపమ్ హిమ కు మనసులో మండుతున్నటుంది అని అనుకుంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.