- Home
- Entertainment
- Karthika Deepam: జ్వాలను అవమానించేందుకు పార్టీ ఏర్పాటు చేసిన శోభ.. శౌర్య కోసం ఏమైనా చేస్తానన్నా హిమ!
Karthika Deepam: జ్వాలను అవమానించేందుకు పార్టీ ఏర్పాటు చేసిన శోభ.. శౌర్య కోసం ఏమైనా చేస్తానన్నా హిమ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 3వ తేదీన ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిరుపమ్ వాళ్ళ అమ్మ స్వప్నతో మాట్లాడుతుంటాడు.. నీ జీవితం ఇది నష్టపోతావు అని తిడుతుంది.. అపుడే ఆటో వాళ్ళతో తిరగడం ఏంటి అని తిడుతుంది. అప్పుడు నిరుపమ్ నాకు నచ్చింది చేస్తానంటూ సీరియస్ గా చెప్తాడు. ఆటో వాళ్ళతోనే తిరుగుతాను అంటూ షాక్ ఇస్తాడు.
మరోవైపు.. మోనిత లాంటి శోభ జ్వాలా గురించి నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. జ్వాలా బాబాయ్ పిన్ని దొంగలు అని తెలుసుకున్న శోభ నీ అంతు చూస్తా అని అంటుంది.. మరోవైపు హిమను సౌందర్యను తిడుతుంది. ఎందుకు వద్దన్నావే.. మీ అమ్మ నాన్నలకు మనశాంతి లేకుండా చేస్తున్నావ్ అంటూ తిడుతుంది.
ఇంకా మరోవైపు ప్రేమ్ హిమకు ప్రేమిస్తున్న అని చెప్పేందుకు ఒక వీడియో పంపిస్తాడు. అది హిమ చూడకుండా సౌందర్య, ఆనంద్ రావులతో గొడవ పడుతూ కోపంతో ఫోన్ ను విశేరేస్తుంది. దీంతో ప్రేమ్ సంతోషం మరోసారి ఆవిరి అయిపోతుంది. రిప్లై ఇస్తే బాగుండు అని వెయిట్ చేస్తుంటాడు.
ఇక మరో సీన్ లో జ్వాలా, నిరుపమ్ ఆటోలో వెళ్తూ మాట్లాడుకుంటారు.. కానీ నిరుపమ్ మాత్రం ఆలోచనల్లో ఉంటాడు.. జ్వాలా ఎంత అడిగిన సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూ చెప్తాడు. అలా అలా మాట్లాడుతూ జ్వాల నిరుపమ్ ను కూల్ చేస్తుంది.
ఒకవైపు ప్రేమ్ పిచ్చోడిలా హిమ రిప్లై కోసం ఎదురుచూస్తుంటాడు. ఎందుకు చూడలేదు హిమ అంటూ తిట్టుకుంటుంటాడు.. ఇక మరోవైపు శోభ ఓ పార్టీ ఏర్పాటు చేశాను.. నువ్వు, నిరుపమ్, జ్వాలా ముగ్గురు రావాలని ఇన్వైట్ చేస్తుంది. జ్వాలా నిరుపమ్ ని కలపడానికే పార్టీ కి వెళదాం అనుకుంటుంది.
ఎంతకైనా తెగిస్తాను అని మనసులో అనుకుంటుంది.. ఇక మరో సీన్ లో జ్వాలా బాబాయ్, పిన్నిని ఆ పార్టీలోనే పని చేయించేందుకు పిలిపించుకుంటుంది.. ఈ సీన్ చూస్తే జ్వాలాకు అవమానం గ్యారెంటీ అని తెలుస్తుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి..