MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Sharwanand: 23 ఏళ్ల కుర్రాడి టాలెంట్‌కి శర్వానంద్‌ ఫిదా.. టాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Sharwanand: 23 ఏళ్ల కుర్రాడి టాలెంట్‌కి శర్వానంద్‌ ఫిదా.. టాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

శర్వానంద్‌ త్వరలో `బైకర్‌` మూవీతో రాబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఒక తమిళ డబ్బింగ్‌ చిత్రాన్ని ఎంకరేజ్‌ చేశాడు. అంతేకాదు ఈ మూవీని తీసిన 23ఏళ్ల కుర్రాడికి ఫిదా అయ్యాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2026, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
23ఏళ్ల కుర్రాడి శర్వానంద్‌ ఫిదా
Image Credit : Asianet News

23ఏళ్ల కుర్రాడి శర్వానంద్‌ ఫిదా

యంగ్‌ హీరో శర్వానంద్‌ ఇప్పుడు `బైకర్‌` మూవీతో రాబోతున్నాడు. ఇది వచ్చే వారం రిలీజ్‌ కాబోతుంది. అయితే ఇటీవల ఆయన ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీలోకి ఇరవై ఏళ్లు దాటిందని, ఇంకా హీరోగా రాణిస్తున్నానని తెలిపారు. తనపై చాలా మంది విమర్శలు చేశారని, అవమానించారని, కానీ తాను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని, సినిమాలు చేస్తున్నానని, ఇదే వారికి తాను ఇచ్చే సమాధానం అని తెలిపారు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే 23ఏళ్ల కుర్రాడు శర్వానంద్‌ని ఇంప్రెస్‌ చేశాడు. అతని టాలెంట్‌కి శర్వా ఫిదా అయ్యాడు. ఆ కథేంటంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
`యూత్‌` సినిమాకి శర్వానంద్‌ సపోర్ట్
Image Credit : Asianet News

`యూత్‌` సినిమాకి శర్వానంద్‌ సపోర్ట్

తమిళ కుర్ర హీరో కెన్‌ కరునాస్‌ దర్శకుడిగా, హీరోగా నటిస్తూ `యూత్‌` అనే చిత్రాన్ని రూపొందించాడు. అనిష్మ అనిల్‌ కుమార్‌, దేవ దర్శిని చేతన్‌, సూరజ్‌ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్‌, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలో` యూత్‌` అనే చిత్రం రూపొందింది. గత వారం తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ శుక్రవారం తెలుగులో రిలీజ్‌ అయ్యింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో శనివారం సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. దీనికి శర్వానంద్‌ గెస్ట్ గా వచ్చాడు. చిత్ర బృందాన్ని అభినందించాడు.

34
తెలుగు ఇండస్ట్రీ  చాలా గొప్పది
Image Credit : Asianet News

తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ, `నేను చెన్నై వెళ్లినప్పుడు అక్కడ `యూత్` మూవీ సూపర్ హిట్ అని తెలిసింది. తెలుగులో కూడా ఈ మూవీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీ, మనలాంటి గొప్ప ప్రేక్షకులు ఎక్కడా ఉండరు. మనం అన్ని భాషల మూవీస్ చూస్తాం, ఆదరిస్తాం. ఇతర భాషల హీరోలను తెచ్చుకుని ఇక్కడ మూవీస్ నిర్మిస్తున్నాం. మన ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ఈ సినిమాను ఒక 23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్(కెన్‌ కరునాస్‌) చేసి హీరోగా నటించి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. వాళ్లలో హానెస్టీ కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి మంచి మూవీ ఎలా చేశారో మీ దగ్గర నుంచే తెలుసుకుంటాను. నేను తమిళ మూవీస్ చేసినప్పుడు కూడా అక్కడ థియేటర్స్ లో ఇలాగే ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూశాను. ఇలాంటి మంచి మూవీస్ రావాలి, టీమ్‌ అందరికి అభినందనలు` అని తెలిపారు.

44
యూత్‌ మూవీకి వస్తోన్న స్పందనపై డైరెక్టర్‌ రియాక్షన్‌
Image Credit : Asianet News

యూత్‌ మూవీకి వస్తోన్న స్పందనపై డైరెక్టర్‌ రియాక్షన్‌

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ, `శర్వానంద్ `బైకర్` మూవీ ట్రైలర్ బాగుంది. ఆ మూవీని ఇక్కడికి వచ్చి చూస్తాను. సందీప్, వినీత్ మా మూవీ కంటెంట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీ మా దగ్గర సక్సెస్ కావడం సంతోషం, కానీ మరో రాష్ట్రంలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సక్సెస్ కావడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నేను ఈ సినిమాలో ప్రభాస్ గారి అభిమానిగా నటించాను. ప్రభాస్ అభిమానులు అంతా మా మూవీని సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు చిన్నా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌, ప్రొడ్యూసర్‌ సందీప్‌, వినీత్‌, హీరోయిన్‌ మీనాక్షి, ప్రియాన్షి, దర్శకుడు వశిష్ట, నిర్మాత ధీరజ్‌ మొగిలినేని వంటి వారు పాల్గొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే
Recommended image2
Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved