MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ నటిస్తోన్న `పెద్ది` సినిమా కోసం అఖిల్‌ అక్కినేని వెనక్కి తగ్గాడు. తన సినిమాని వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2026, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్‌ చరణ్‌, అఖిల్‌ మధ్య మంచి అనుబంధం
Image Credit : india today

రామ్‌ చరణ్‌, అఖిల్‌ మధ్య మంచి అనుబంధం

రామ్‌చరణ్‌, అఖిల్‌ మధ్య మంచి స్నేహం ఉంది. అది ఇప్పటిది కాదు, చాలా ఏళ్లుగా ఆ స్నేహం కొనసాగుతుంది. చిరంజీవి, నాగార్జున మధ్య ఎలాంటి స్నేహం ఉందో, అదే విధంగా, చరణ్‌, అఖిల్‌ ల మధ్య కూడా అలాంటి అనుబంధమే ఉంది. సినిమాల్లోకి రాకముందు నుంచే ఈ బాండింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చరణ్‌ కోసం అఖిల్‌ వెనక్కి తగ్గాడు. రామ్‌ చరణ్‌ పై ఉన్న గౌరవంతో, ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం కోసం అఖిల్‌ బ్యాక్‌ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్దితో రాబోతున్న రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

పెద్దితో రాబోతున్న రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల షూటింగ్‌ రామ్‌ చరణ్‌కి గాయమైనప్పటికీ దాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. షూటింగ్‌ కొంత బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. శ్రీరామ నవమి సందర్భంగా సినిమా గ్లింప్స్ ని విడుదల చేయగా, రామ్‌ చరణ్‌ లుక్‌ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో, కుస్తీ వీరుడిగా చరణ్‌ ఇందులో కనిపిస్తారని టీమ్‌ తెలిపింది.

Related Articles

Related image1
Allu Arjun కోసం అమ్మ నిర్మల చేసిన త్యాగం ఏంటో తెలుసా?.. ఆమెకి ఇష్టమైన బన్నీ మూవీ ఇదే
Related image2
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
35
లెనిన్‌తో రాబోతున్న అఖిల్‌
Image Credit : our own

లెనిన్‌తో రాబోతున్న అఖిల్‌

ఇక అక్కినేని అఖిల్‌ వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు `లెనిన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రేమ కథా నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రేమ కోసం తిరుగుబాటు ప్రధానంగా మూవీ కథ సాగుతుందని సమాచారం. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట శ్రీలీలని ఎంపిక చేశారు. కానీ అనుకోని కారణాలతో ఆమె తప్పుకుంది. దీంతో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు.

45
లెనిన్‌ మూవీ రిలీజ్‌ వాయిదా
Image Credit : our own

లెనిన్‌ మూవీ రిలీజ్‌ వాయిదా

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. బెస్ట్ ఔట్‌పుట్‌ కోసం టీమ్‌ శ్రమిస్తోంది. అఖిల్‌ హీరోగా నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ఈ క్రమంలో ఇప్పుడుఈ చిత్రంతో అయినా హిట్‌ కొట్టాలని చూస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న డేట్‌ ప్రకారం ఈ సినిమా మే 1న రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమా కోసం ఈ సినిమాని పోస్ట్ పోన్‌ చేస్తున్నట్టు తెలిపింది టీమ్‌. రామ్‌ చరణ్‌తో ఉన్న రిలేషన్‌, సినిమా మధ్య పోటీ ఉండకూడదని, సినిమాని అంతా సెలబ్రేట్‌ చేసుకోవాలని, దాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పి, `లెనిన్‌`ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

55
లెనిన్‌ కొత్త రిలీజ్‌ డేట్‌
Image Credit : our own

లెనిన్‌ కొత్త రిలీజ్‌ డేట్‌

అందులో భాగంగానే కొత్త రిలీజ్‌ డేట్‌ని ఇచ్చారు. జూన్‌ 26న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సారి మంచి ఔట్‌పుట్‌తో, మంచి కంటెంట్‌తో, అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునే కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలిపింది టీమ్‌. ఇదిలా ఉంటే అఖిల్‌ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి 11ఏళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాడు. ఇప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేదు. హీరోగా నిలబడలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రంతో అయినా హిట్‌ కొడతాడా? అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Allu Arjun కోసం అమ్మ నిర్మల చేసిన త్యాగం ఏంటో తెలుసా?.. ఆమెకి ఇష్టమైన బన్నీ మూవీ ఇదే
Recommended image2
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved