MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే

Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే

Prabhas vs Salman Khan: 2027 ఈద్ పండక్కి బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద క్లాష్ జరిగేలా కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్, ప్రభాస్ తమ భారీ బడ్జెట్ సినిమాలతో ముఖాముఖి తలపడొచ్చు. ఈ వైరల్ వార్తతో అభిమానుల్లో ఇప్పటినుంచే విపరీతమైన ఉత్కంఠ మొదలైంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2026, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈద్ 2027పై సల్మాన్ ఖాన్ భారీ ప్లాన్
Image Credit : X

ఈద్ 2027పై సల్మాన్ ఖాన్ భారీ ప్లాన్

సల్మాన్ ఖాన్ ప్రతీ ఈద్ పండక్కి తన సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా గ్యాప్ వచ్చినా, చాలాకాలంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు 2027లో మరోసారి తన అభిమానులకు 'ఈదీ' (పండగ కానుక) ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈద్ 2027 బరిలో సల్మాన్ సినిమా ఇదే
Image Credit : X

ఈద్ 2027 బరిలో సల్మాన్ సినిమా ఇదే

సల్మాన్ ఖాన్ తన తర్వాతి సినిమాను ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఈ సినిమాను సౌత్ ఇండియా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ హై-స్కేల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఏప్రిల్ 14 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మేకర్స్ ఈ సినిమాను 2027 ఈద్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

35
ముంబై గోరేగావ్‌లో సల్మాన్ సినిమా కోసం భారీ సెట్
Image Credit : X

ముంబై గోరేగావ్‌లో సల్మాన్ సినిమా కోసం భారీ సెట్

సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి సినిమా కోసం ముంబైలోని గోరేగావ్‌లో ఒక పెద్ద మినీ-సిటీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడే చాలా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తారట. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, గ్రాండ్‌గా తీస్తున్నారు.

45
బాక్సాఫీస్ వద్ద సల్మాన్‌ను ఢీకొట్టనున్న ప్రభాస్
Image Credit : X

బాక్సాఫీస్ వద్ద సల్మాన్‌ను ఢీకొట్టనున్న ప్రభాస్

ప్రభాస్ మెగా బడ్జెట్ సినిమా 'స్పిరిట్' రిలీజ్ డేట్‌ను మార్చి 5, 2027గా ఇప్పటికే ఫిక్స్ చేశారు. కానీ, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను వాయిదా వేసి, 2027 ఈద్‌కు రిలీజ్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో తృప్తి డిమ్రి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ 'స్పిరిట్' రిలీజ్ డేట్ మారి, సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమాతో ఈద్‌కు రిలీజ్ అయితే, అది ఈ మధ్య కాలంలో అతిపెద్ద బాక్సాఫీస్ ఫైట్ అవుతుంది. 

55
2027లో బ్లాక్‌బస్టర్ ఫైట్ ఖాయమా?
Image Credit : X

2027లో బ్లాక్‌బస్టర్ ఫైట్ ఖాయమా?

సల్మాన్ ఖాన్, ప్రభాస్ ఇద్దరూ  ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్స్.  ఇద్దరు హీరోలు, రెండు మెగా ప్రాజెక్టులు.. ఈ లెక్కన 2027 ఈద్‌కి బాక్సాఫీస్ వద్ద హిస్టారికల్‌ ఫైట్‌ ఖాయమని అంటున్నారు. ఒకవేళ రెండూ పోటీ పడితే ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కానీ పోటీ పడేందుకు మేకర్స్ ఆసక్తి చూపకపోవచ్చని టాక్‌.  ఎందుకంటే దిల్‌ రాజు తెలుగు నిర్మాత. ఆయన అంతటి సాహసం చేయకపోవచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బాలీవుడ్
దిల్ రాజు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Related Stories
Recommended image1
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
Recommended image2
Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved