Prema Entha Madhuram: ప్రమాదపు అంచుల్లో అను.. భయంతో వణికి పోతున్న శారదమ్మ!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి టిఆర్పిని సాధించి జీ తెలుగులో ఈ వారం నెంబర్ వన్ సీరియల్ గా నిలబడింది. శత్రువుల దగ్గర నుంచి తన భార్యను కాపాడుకోవడానికి తపన పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అనుని గుడిలో కూర్చోబెడతాడు ఆర్య. వాళ్ళు ఎవరో.. ఎందుకు అటాక్ చేస్తున్నారో తెలుసుకొని వస్తాను ఇక్కడే కూర్చో అంటాడు ఆర్య. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లొద్దు దయచేసి నా మాట వినండి మీరు నా పక్కనే ఉండండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది అను. ఐదు నిమిషాల్లో నీ ముందు ఉంటాను అంటూ బయలుదేరుతాడు ఆర్య.
అయితే ఇంతలో గుడి టైం అయిపోవడంతో పూజారి తలుపులు వేసుకొని వెళ్లిపోతారు. ఆర్య వెళ్లేటప్పటికీ తలుపులు వేసి ఉండటంతో మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చేసారా అంటుంది అను. అసలు నేను వెళ్తే కదా.. టైం అయిపోయినట్లుగా ఉంది ఈ గుడి తలుపులు వేసేసారు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండాలేమో అంటాడు ఆర్య. పర్వాలేదు సార్ గుడిలో నిద్ర చేస్తే చాలా మంచిదంట ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది అంటుంది అను. భార్యని తన ఒడిలో తలపెట్టుకొని పడుకో మంటాడు ఆర్య.
మధ్య రాత్రిలో ఆమెకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇద్దరూ చాలా కంగారు పడతారు. సీన్ కట్చేస్తే అను ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఆర్య. అనుని స్పెషల్ వార్డుకి తీసుకెళ్తారు డాక్టర్లు. అంతలోనే ఆర్య కుటుంబ సభ్యులందరూ వస్తారు. అనుని రూమ్ కి తీసుకెళ్లారని తెలుసుకుని సుఖ ప్రసవం జరగాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది శారదమ్మ. రాత్రంతా ఏమయ్యారు అని అడుగుతారు వాళ్ళందరూ. రాత్రంతా గుడిలో ఉండవలసి వచ్చింది అంటాడు ఆర్య. కావాలనే ఉన్నారా లేకపోతే ప్రమాదవశాత్తు ఉన్నారా?
ప్రమాదవశాత్తు అయితే కనుక ఆ ప్రమాదం ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అంటాడు జెండే. వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా జలంధర్ ఈపాటికి లేపేసి ఉంటాడు అనుకున్నాను ఇంతకీ జలంధర్ హాస్పిటల్ కి వచ్చాడా లేదా అని ఆలోచనలో పడుతుంది మాన్సీ. హాస్పిటల్ లో భద్రత పెంచమంటుంది శారదమ్మ. మిగిలిన పేషంట్లకి ఇబ్బంది పడకుండా చూడు అలాగే బయట వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా చూడు అని జెండేకి చెప్తాడు ఆర్య. ఫూల్స్.. బయటి నుంచి రావటం ఏమిటి ఆల్రెడీ ప్రమాదం లోపలే ఉంది అనుకుంటుంది మాన్సీ.
సుబ్బు వాళ్ళని తీసుకురమ్మని నీరజ్ ని పంపిస్తుంది అంజలి. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు తిరుపతి వెళ్లారు అని తెలుసుకొని మళ్లీ వెనక్కి వచ్చి అదే విషయం శారదమ్మ వాళ్ళకి చెప్తాడు నీరజ్. ఆర్య వర్ధన్ ఫ్యామిలీ అంతా మన హాస్పిటల్ లోనే ఉన్నారు డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ స్టాఫ్ అందరికీ ఇంటిమేట్ జారీ చేస్తారు హాస్పిటల్ మేనేజ్మెంట్. ఆ స్టాఫ్ లో జలంధర్ డాక్టర్ వేషంలో ఉంటాడు. మరోవైపు అంజలి నొప్పులతో బాధపడుతూ ఆర్య సార్ ని పిలవండి అంటూ ఏడుస్తుంది. ఆర్యవాళ్ళు అను దగ్గరికి వస్తారు.
నీకేమీ కాదు మీ అమ్మగారు వాళ్లు తిరుపతి వెళ్ళారంట తీసుకురావడానికి వెళ్లారు అంటాడు ఆర్య. నాకు వాళ్ళందరూ అక్కర్లేదు మీరు మాత్రమే తోడు ఉండండి చాలు అని ఏడుస్తుంది అను. నీ పక్కన భార్య కాదు ఆ దేవుడే ఉన్నా నీ బిడ్డని కాపాడలేడు అనుకుంటుంది మాన్సీ.అంతలో డాక్టర్లు వచ్చి ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు బయటికి వెళ్లిపోండి మేము ఉన్నాం కదా చూసుకుంటాము అంటారు.
అలా అనటంతో ఆర్య తప్ప అందరూ బయటకు వచ్చేస్తారు. అసలే అష్టమి ఘడియలు అను ఒంట్లోకి రాజనందిని ఆవహిస్తే ఏం చేయాలి నాకు కంగారుగా ఉంది సుబ్బు వాళ్ళు ఉంటే బాగుండు అంటుంది శారదమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.