MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?

Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?

Youtuber Shanmukh Jaswanth: ఈమధ్యే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ వీడియోస్, మూవీస్ తో పాటు పలు వివాదాలతో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ సడెన్ గా హాస్పిటల్ లో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైష్ణవిని పెళ్లాడిన షణ్ముఖ్ జస్వంత్
Image Credit : Shanmulh Jaswanth Instagram

వైష్ణవిని పెళ్లాడిన షణ్ముఖ్ జస్వంత్

స్టార్ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. వైష్ణవి చొడిశెట్టితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, వైష్ణవి పెళ్లి జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా జరిగింది. ఎటువంటి హడావిడి లేకుండా ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు,స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించారు.

పెళ్లి తర్వాత విశాఖపట్నంలోని వారి స్వగృహం వద్ద గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హాస్పిటల్ లో ప్రత్యక్షమైన స్టార్ యూట్యూబర్..
Image Credit : instagram.com/shannu

హాస్పిటల్ లో ప్రత్యక్షమైన స్టార్ యూట్యూబర్..

పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో సెలైన్ తో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. ఆస్పత్రిలో చేరినట్లు కనిపించడంతో షణ్ముఖ్ కు ఏమయ్యిందా అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫోటోను షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఆయనకు సెలైన్ ఎక్కిస్తున్నట్లు కనిపించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి కానీ.. ఆస్పత్రిలో చేరడానికి గల కారణం గురించి షణ్ముఖ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Related Articles

Related image1
Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?
Related image2
Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
35
షణ్ముఖ్ జస్వంత్ కు ఏమయ్యింది?
Image Credit : our own

షణ్ముఖ్ జస్వంత్ కు ఏమయ్యింది?

ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు షణ్ముఖ్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయనకు ఏమైందా అని ఆందోళన చెందుతున్నారు. అయితే పెళ్లి, రిసెప్షన్ వంటి వరుస వేడుకల కారణంగా షణ్ముఖ్ తీవ్రంగా అలసిపోయి ఉండవచ్చని, ఎండదెబ్బతో.. డీహైడ్రేషన్ లేదా నీరసం కారణంగా ఆస్పత్రికి వెళ్లి ఉండవచ్చని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా షణ్ముఖ్ స్పందిస్తేనే పూర్తి విషయం తెలుస్తుంది.

45
బిగ్ బాస్ లో అలరించిన షణ్ముఖ్..
Image Credit : Asianet News

బిగ్ బాస్ లో అలరించిన షణ్ముఖ్..

ఇదిలా ఉంటే, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా యూత్ లో అతనికి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. షోలో రన్నరప్‌గా నిలిచి మరింత ప్రజాదరణ పొందాడు.

55
దీప్తీ సునైనతో బ్రేకప్..
Image Credit : Youtube/@ShanmukhJaswanth

దీప్తీ సునైనతో బ్రేకప్..

వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిన షణ్ముఖ్ ప్రస్తుతం తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో దీప్తీ సునైనను ప్రేమించాడు షణ్ముఖ్ జస్వంత్.. ఇద్దరు కలిసి చాలా ఈవెంట్లు కూడా చేశారు. పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైమ్ లో.. షణ్ముఖ్ బిగ్ బాస్ కు వెళ్లడం.. అక్కడ సిరీ షణ్ముఖ్ ను మాటికి హగ్ చేసుకోవడంతో.. సునైనాతో విభేదాలు వచ్చాయి. ఇద్దరు బ్రేకప్ చేప్పుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Related Stories
Recommended image1
Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?
Recommended image2
Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved