MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?

Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?

ఎట్టకేలకు తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా. పెద్దలను ఎదిరించి తను అనుకున్నది సాధించింది. ఇంతకీ ఆమె ప్రియుడు ఎవరు? పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందంటే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సింపుల్ గా జబర్దస్త్ ఫైమా పెళ్లి..
Image Credit : Asianet News

సింపుల్ గా జబర్దస్త్ ఫైమా పెళ్లి..

పటాస్ ద్వారా కమెడియన్ గా జర్నీ స్టార్ట్ చేసి.. జబర్దస్త్, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన ఫైమా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో సాదాసీదాగా జరిగింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత సన్నిహితులు , స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన వీడియోను ఫైమా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫైమా ఎమోషనల్ కామెంట్స్..
Image Credit : instagram.com/faima_patas

ఫైమా ఎమోషనల్ కామెంట్స్..

తన పెళ్లి గురించి ప్రకటిస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఫైమా. తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, తమను విడదీయడానికి ప్రయత్నాలు జరిగాయని బాధపడింది పైమా. ఆమె మాట్లాడుతూ.. “ఇక నుంచి మేము భార్యాభర్తలం. వాళ్లు మమ్మల్ని అనుమానించారు, నిందించారు, మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమే ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి మా వైపు బలంగా నిలిచింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పోరాటం చేసి, అంతులేని సహనంతో భరించాం. మేము విడిపోవడానికి వేయి కారణాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ప్రతిరోజూ కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నాం. మొత్తానికి భార్యాభర్తలం అయ్యాం” అంటూ ఫైమా తన పోస్ట్‌లో పేర్కొంది.

Related Articles

Related image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Related image2
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
35
అసలు విషయం ఎందుకు చెప్పలేదు?
Image Credit : instagram.com/faima_patas

అసలు విషయం ఎందుకు చెప్పలేదు?

పెద్దలు ఒప్పుకోలేదు అని చెప్పింది కానీ.. తమ పెళ్లిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఎవరు అనే విషయాన్ని మాత్రం ఫైమా వెల్లడించలేదు. వారు ఎవరు? ఎందుకు ఇంతటి పోరాటం చేయాల్సి వచ్చింది? అనే విషయాలను మాత్రం ఫైమాచెప్పలేదు. అయితే ఫైమా, ప్రవీణ్ నాయక్ వేర్వేరు కులాలు, మతాలకు చెందినవారు కావడంతో వారి వివాహానికి పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం.ఇటీవలి కాలంలో ఫైమా, ప్రవీణ్ నాయక్ తమ వివాహంపై పలు వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సంకేతాలు ఇచ్చారు. చివరికి ఇద్దరూ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

45
గతంలో ఏం జరిగిందంటే..?
Image Credit : instagram.com/faima_patas

గతంలో ఏం జరిగిందంటే..?

పటాస్ షోలో కమెడియన్‌గా గుర్తింపు పొందిన ఫైమా, అదే షోలో పనిచేసిన ప్రవీణ్ అనే మరో కమెడియన్‌తో గతంలో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రేమ వ్యవహారం బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రవీణ్ వేరే పెళ్లి చేసుకోగా.. ఫైమా, ప్రవీణ్ నాయక్‌ తో మళ్లీ ప్రేమలో పడింది. ఈ విషయంపై అప్పట్లో ఫైమా మాట్లాడుతూ.. “పెళ్లి మన చేతుల్లో ఉండదు కదా” అని వ్యాఖ్యానించింది.

55
ఫైమాకు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు..
Image Credit : instagram.com/faima_patas

ఫైమాకు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు..

ఇక ఫైమా పెళ్లి విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసత్య, అరియానా గ్లోరీ, ఇనయా సుల్తానా, కీర్తి భట్, రాజ్, ప్రియాంక జైన్, భానుశ్రీ, రోల్ రైడా, ఆదిరెడ్డి తదితరులు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. పేదరికం నుంచి వచ్చిన ఫైమా.. తన సంపాదనతో ఇంటిని నిలబెట్టింది. తల్లీ తండ్రుల కోసం ఇల్లు కూడా కట్టింది. కుటుంబాన్ని సెటిల్ చేసిన తరువాత తను పెళ్లి చేసుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved