MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?

Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?

ఎన్టీఆర్ యాటీట్యూడ్ చూసి చాలామంది ఆయనకు పొగరెక్కువేమో అనుకుంటారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి రావడంతో గర్వం చూపిస్తారేమో అని ఫీల్ అవుతుంటారు. అసలు ఎన్టీఆర్ తోటి నటీనటులతో ఎలా ఉంటారు? ఈ విషయంలో సీనియర్ హీరో ఒకరు ఏం చెప్పారంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూనియర్ ఎన్టీఆర్ ను చూసి ఏమంటారంటే?
Image Credit : Asianet News

జూనియర్ ఎన్టీఆర్ ను చూసి ఏమంటారంటే?

నందమూరి వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పొగరు ఎక్కువగా ఉంటుందా? ప్రతీ ఒక్కళ్ల దగ్గర ఆయన యాటీట్యూడ్ చూపిస్తారా? ఫస్ట్ టైమ్ తారక్ ను చూసిన వారు ఏమనుకుంటారు? ఆయనతో మాట్లాడిన తరువాత వారి అభిప్రాయం ఏముంటుంది? ఈ విషయంలో చాలామంది స్టార్స్ కన్ ఫ్యూజ్ అయ్యారు. 

ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో ఫస్ట్ సీనిమా చేసేప్పుడు...వీడెక్కడ దొరికాడురా ఖర్మ అని అనుకున్నారట. ''స్టూడెంట్ నెం.1 సినిమా సమయంలో కలిసినప్పుడు చాలా మొండిగా, పొగరుగా ఉంటాడేమో అనిపించిందని, కానీ ఆయనలో మంచి స్నేహితుడు, అద్భుతమైన నటుడు ఉన్నాడని'' దర్శకుడు రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ విషయంలో దివంగత సీనియర్ నటుడు శ్రీహరి కూడా గతంలో సంచలన కామెంట్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్ పై శ్రీహరి కామెంట్స్..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ పై శ్రీహరి కామెంట్స్..

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరితో జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆసినిమా మరేదో కాదు బృందావనం. ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్ తో శ్రీహరికి పెద్దగా పరిచయం లేదట. జూనియర్ ఎన్టీఆర్ కు పొగరు ఉంటుందేమో.. సరిగ్గా మాట్లాడుతాడో లేదో అని అనుమానం వచ్చిందట. కానీ షూటింగ్ స్టార్ట్ అయినతరువాత తారక్ గురించి తాను అనుకున్నది అంతా తప్పని అర్ధం అయ్యిందట. తారక్ ఎంతలా క్లోజ్ అయ్యాడంటే.. '' నేను ఎన్టీఆర్ ను ఎప్పుడు నాన్నా అనే పిలుస్తాను.. '' అని బృందావనం సినిమా ఈవెంట్ లో శ్రీహరి స్వయంగా వెల్లడించారు.

Related Articles

Related image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Related image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
35
తారక్ తోటి నటీనటులతో ఎలా ఉంటాడు..
Image Credit : Asianet News

తారక్ తోటి నటీనటులతో ఎలా ఉంటాడు..

తాత ముఖ్యమంత్రిగా చేశాడు, పెద్ద హీరో కూడా.. తండ్రి, బాబాయ్ కూడా హీరోనే.. అతి పెద్ద సినీ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా.. ఎన్టీఆర్ మాత్రం ఎవరితోనైనా చాలా వినయంగా ఉంటాడు. తోటి నటీనటులు ఎంత చిన్నవారైనా.. వారికి గౌరవం ఇస్తాడు. తనకు సింక్ అయితే ఫ్రెడ్షిప్ చేయడానికి ఏమాత్రం ఆలోచించడు ఎన్టీఆర్. శ్రీహరి విషయమే చూసుకుంటే.. ఆయనతో చేసిన ఒక్క సినిమాతో బాగా క్లోజ్ అయ్యాడు. శ్రీహరిని సొంత ఇంటి మనిషిలా ఫీల్ అయ్యేవాడు తారక్. శ్రీహరి మాత్రమే కాదు.. తనకంటే వయసులో పదేళ్లు పెద్దవాడైన రాజమౌళి, రాజీవ్ కనకాల లాంటి స్టార్స్ తో ఎన్టీఆర్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

45
చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు..
Image Credit : Asianet News

చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు..

విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు చూసిన శ్రీహరి.. ఆతరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా మగధీర సినిమాలో సాల్మోన్ రాజు లాంటి పాత్రలు ఆయనకుమంచి పేరును తెచ్చిపెట్టాయి. అనారోగ్య కారణంగా 49 ఏళ్లవయసులోనే శ్రీహరి కన్నుమూశాడు. ఆయన బ్రతికి ఉండి ఉంటే.. బాహుబలిలో కట్టప్ప లాంటి.. ఆయన మాత్రమే చేయగలిగే కొన్ని పాత్రలు వేరొకరికి వెళ్లేవి కావు. ఆ పాత్ర శ్రీహరికోసమే రాసుకున్నారన్న టాక్ ఉంది. ఆ క్యారెక్టర్ శ్రీహరి చేసి ఉంటే బాగుండేదని అభిమానులు, నెటిజన్లు అప్పట్లో సోషల్ మీడియాలో చర్చించుకున్న రోజులు ఉన్నాయి.

55
పాన్ ఇండియా స్టార్ గా యంగ్ టైగర్..
Image Credit : youtube

పాన్ ఇండియా స్టార్ గా యంగ్ టైగర్..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈమూవీ తరువాత ఆయన ఖతాలో దేవర2 తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన తారక్.. దేవరతో తన ఇమేజ్ ను నిలబెట్టుకున్నాడు. వరుస సక్సెస్ లతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. తారక్ ఇమేజ్ మరో రేంజ్ కు వెళ్లడమే కాదు.. రెమ్యునరేషన్ డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved