MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: తప్పంతా జగతిదే అంటున్న ఫణీంద్ర కుటుంబం.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన మురుగన్!

Guppedantha Manasu: తప్పంతా జగతిదే అంటున్న ఫణీంద్ర కుటుంబం.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన మురుగన్!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ప్రాణప్రదమైన కాలేజీని కాపాడుకోవడానికి తపన పడుతున్న ఓ భార్యాభర్తల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Sep 16 2023, 07:42 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

 ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీని ఎమ్మెస్సార్ హ్యాండ్ ఓవర్  చేసుకునే లాగా ఉన్నాడు. ఇక మన చదువులు ఆగిపోతాయేమో అని కంగారుపడుతూ ఉంటారు స్టూడెంట్స్. మరోవైపు బాధపడుతున్న ఫణీంద్ర ని ఓదారుస్తాడు  మహేంద్ర. నువ్వు రిషి దగ్గర నుంచి కదా వచ్చావు, తనకి ఫోన్ చెయ్యు, తను మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలడు అంటాడు ఫణీంద్ర. రిషి రాడు అని ఎంతో బాధగా చెప్తాడు మహేంద్ర.
 

28
Asianet Image

మరోవైపు వసుధార రిషికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. కాలేజీ చేజారి పోయేలాగా ఉంది రెస్పాండ్ అవ్వండి అని మెసేజ్ పెడుతుంది వసుధార. నన్ను డిస్టర్బ్ చేయకండి అనిమెసేజ్ పెడతాడు రిషి. రిషి ని తిట్టుకుంటుంది వసుధార. మరోవైపు జగతి డబ్బుల కోసం మినిస్టర్ కి ఫోన్ చేస్తుంది  కానీ వర్క్ అవుట్ అవ్వదు. మరోవైపు కొడుకుని మెచ్చుకుంటుంది దేవయాని. గడువు పూర్తయ్యలోగా  వాళ్ళకి అస్సలు డబ్బు పుట్టదు.
 

38
Asianet Image

 ఇక కాలేజీ మన చేతికే అని సంతోషపడుతుంది. ఇదంతా ఎమ్మెస్సార్  హెల్ప్ వల్లే అంటూ ఎమ్మెస్సార్ కి థాంక్స్ చెప్తాడు మహేంద్ర. మరోవైపు బాధపడుతున్న జగతి దగ్గరికి వచ్చి ఆమెని ఓదారుస్తాడు మహేంద్ర. ఈ కాలేజీ చేజారి పోతుందంటే చాలా బాధగా ఉంది. ఈ కాలేజీ అంటే రిషికి ప్రాణం ఇప్పుడు ఆ ప్రాణం పోయేలాగా ఉంది అంటూ ఏడుస్తుంది. మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన దేవయాని ఇప్పుడు ఏం చేయటం.. పోనీ మన బంగారం తాకట్టు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేద్దామా అని అమాయకంగా మొహం పెట్టి భర్తని అడుగుతుంది.
 

48
Asianet Image

మన దగ్గర ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టినా అంత అమౌంట్  రాదు. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేము అంటాడు ఫణీంద్ర. మరోవైపు మళ్ళీ, మళ్ళీ రిషి కి ఫోన్ చేస్తూనే ఉంటుంది వసుధార. ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి డిస్టర్బ్ చేయొద్దు అంటే ఎందుకు  పదే పదే ఫోన్ చేస్తున్నారు, అయినా రుణం తీర్చుకుంటానని వెళ్లారు కదా మీకు చేతనైతే ఆ పని చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకుంటుంది వసుధార.
 

58
Asianet Image

 మరోవైపు గడువు ముగియటానికి కాస్త సమయం ముందు అందరూ మీటింగులో కూర్చుంటారు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. నేను అడిగిన డబ్బు మీరు ఇవ్వలేదు కాబట్టి ఈ కాలేజ్ నాకు రాసి ఇచ్చేయండి. అందుకు ఒప్పుకుంటున్నట్లుగా బోర్డు మెంబర్స్ అందరూ సంతకం పెట్టండి అని జగతి ఎదురుగా ఫైల్ పెడతాడు ఎమ్మెస్సార్. సంతకం పెట్టడానికి చాలా ఇబ్బంది పెడుతుంది జగతి. ఇదంతా నీ వల్లే పిన్ని, కాలేజీ హ్యాండిల్ చేయలేవు అంటే వినిపించుకోలేదు. ఈరోజు కాలేజీని చేజార్చే పరిస్థితికి తీసుకువచ్చావు అంటూ జగతి మీద కేకలు వేస్తాడు శైలేంద్ర.
 

68
Asianet Image

 దేవయాని కూడా జగతిని తప్పుపడుతుంది. ఫణీంద్ర అయితే నీ నిర్లక్ష్యం వల్లే  కాలేజీ ఈ దుస్థితికి వచ్చింది అంటూ ఆమెని తప్పు పడతాడు. బాధపడుతుంది జగతి. రిషి..నువ్వు లేని సమయం చూసి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. నీకు ఆ రోజే నిజం చెప్పవలసింది తప్పు చేశాను. అందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నాను అనుకుంటూ ఏడుస్తూ ఫైల్ మీద సంతకం పెట్టే సమయానికి  కరెక్ట్ గా మురుగన్ వస్తాడు. అతడిని చూసి అందరూ షాక్ అవుతారు.
 

78
Asianet Image

 నువ్వు ఎవరివి ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర. నేను ఎవరినో పక్కన పెట్టు, నాకేం కావాలో కాదు మీకు కావాల్సింది ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ ఎవరికో డబ్బులు కావాలంట కదా అని అంటాడు మురుగన్. నాకే అంటాడు ఎమ్మెస్సార్. అతని ముందు కోటి రూపాయలు పెట్టి ఈ డబ్బులు తీసుకొని మీ దగ్గర ఉన్న పత్రాలు ఇచ్చేయ్  అంటాడు మురుగన్. అప్పుడు శైలేంద్ర సైగ చేయడంతో  తన వాచ్ లో టైం ఫాస్ట్ గా పెట్టి మీకు ఇచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడు నాకు డబ్బు వద్దు కాలేజీ కావాలి అంటాడు.
 

88
Asianet Image

అలాగా అని మురుగన్ ఎమ్మెస్సార్ పీక మీద కత్తి పెట్టి  అతని వాచ్ కూడా చూపించి ఎవరిది కరెక్ట్ టైం అని అడుగుతాడు. భయపడిన ఎమ్మెస్సార్ మీదే కరెక్ట్ టైం అంటాడు. అప్పుడు శైలేంద్ర కోపంగా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన  హృతిక్ రోషన్  యాక్షన్ సినిమాలు
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలు
త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు  2, ఎక్కడ చూడొచ్చంటే?
త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న రానా నాయుడు 2, ఎక్కడ చూడొచ్చంటే?
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
Top Stories