Guppedantha Manasu: రిషిని ఒప్పించే ప్రయత్నంలో వసుధార.. శైలేంద్రకు షాకింగ్ రిప్లై ఇచ్చిన జగతి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం కోసం బాబాయ్ కుటుంబాన్ని ముక్కలు చేసిన ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఈరోజు జూలై 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో తన క్లాసు వినటానికి ఒప్పుకున్నందుకు రిషికి థాంక్స్ చెప్తుంది వసుధార. కాబట్టి ఒప్పుకుంటున్నాను లేదంటే మీరు ఎలా వెళ్తే నాకేంటి అంటాడు రిషి. ఎలా అయితే ఏం క్లాస్ వినటానికి ఒప్పుకున్నారు అంతే చాలు అంటుంది వసుధార. ఇంతలో కార్ డోర్ సౌండ్ వినిపించడంతో స్పృహలోకి వస్తుంది. ఇంతసేపు నేను బ్రమలో ఉన్నానా అని అనుకుంటుంది.
కారు తాళాలు తీసుకొచ్చి వసు కి ఇచ్చి మీ పాఠాలు వినకపోతే మీరు ఆటలో వెళ్ళిపోతాను అన్నారు కదా మీకు ఎందుకు ఆశ్రమ నేనే వెళ్ళిపోతాను. మీ మాటలు వినడానికే నా మనసు ఒప్పుకోదు అలాంటిది మీ పాఠాలు ఎలా వింటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత కాలేజీలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అంతలోనే వసుధార అక్కడికి వచ్చి కొంచెం దూరంలో నిలబడుతుంది.
ఇంతలో పాండ్యన్ వాళ్ళు వచ్చి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నాము అది మీరే చెప్పాలి అంటాడు. అది తర్వాత చెప్తాను కానీ ప్రొఫెషన్ అనే పదానికి విలువ తీసుకువచ్చిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఆయన వాదిస్తున్నప్పుడు భార్య చనిపోయింది అని తెలిసినా వాదన ఆపలేదు.
అలా ఎందుకు చేశారు అని పక్కనున్న వాళ్ళు అడిగితే ప్రొఫెషన్ లోకి పర్సనల్ ని తీసుకురాకూడదు అని చెప్పారు అని చెప్తుంది వసుధార. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అని అయోమయంగా అడుగుతాడు పాండ్యన్. అదే మీకోసం చెప్పలేదు నేను వినాలని చెప్పింది అని మనసులో అనుకుంటాడు రిషి. పాండ్యన్ వాళ్ళకి క్లాస్ టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పటంతో వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్లతో పాటే రిషి కూడా వెళ్ళిపోతాడు. మిమ్మల్ని మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది వసుధార. మరోవైపు కాలేజీకి వస్తాడు శైలేంద్ర. నన్ను మీటింగ్ కి పిలవకపోవడానికి కారణమేమిటి.. అంటే నాకు తెలియకుండా ఏదో విషయాన్ని బోర్డు మెంబర్స్ కి చెప్పాలని చూస్తుంది అదేంటో నేను కూడా తెలుసుకోవాలి..
వస్తున్నాను పిన్ని అనుకుంటాడు శైలేంద్ర. మారవైపు కాలేజీకి వచ్చిన ఏంజెల్ ని చూసి నువ్వేంటి సడన్గా అని అడుగుతాడు రిషి. ఎక్కడికో వెళ్లాలంట వసుధార రమ్మంది అని చెప్తుంది ఏంజెల్. నువ్వు ఖాళీ అయితే నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తుంది. నేను రాను నాకు పని ఉంది అంటాడు రిషి. అంతలోనే వసుధార వస్తుంది. రిషి ని రమ్మంటే రావడం లేదు అని చెప్తుంది ఏంజెల్. పోనీలెండి మేడం రానంటే మనం ఏమి చేయలేము కదా అని చెప్పి ఏంజెల్ని తీసుకొని వెళ్ళిపోతుంది వసుధార.
వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్లు అనుకుంటాడు రిషి. వసుధార ని అడుగుదామనుకుంటాడు కానీ మళ్ళీ ఎందుకులే అని ఆగిపోతాడు. ఇదంతా ఒక అటెండర్ చూస్తాడు వసుధార మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటాడు. మరోవైపు మీటింగ్ లో ఉన్న జగతి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు మరో కాలేజీకి అప్ప చెప్తున్నాను అని చెప్తుంది. అంతలోనే శైలేంద్ర సడన్గా వచ్చి ఏ కాలేజీకి అప్పగిస్తున్నారు కూడా తెలియాలి కదా అని అంటాడు.
మీటింగ్ విషయం శైలేంద్ర కి తెలియదు కదా ఎలా వచ్చాడు అనుకుంటుంది జగతి. జగతి దంపతులు ఏమీ మాట్లాడకపోవడంతో మళ్లీ శైలేంద్ర రెట్టించి కాలేజీ పేరేంటి అని అడుగుతాడు. కాలేజీ పేరు విష్ కాలేజీ అక్కడ మంచి టీం ఉంది అంటాడు మహేంద్ర. అయితే అక్కడ ఎవరికి అప్పగిస్తున్నారు వారి పేర్లు ఏంటి అని అడుగుతాడు మహేంద్ర.
నేను చెప్పను అయినా మనకి కావలసింది పని మాత్రమే వాళ్ళ వివరాలు మనకెందుకు అయినా నేను వాళ్లకి పూర్తి బాధ్యతలు అప్పగించలేదు కేవలం పనిచేసే అవకాశాన్ని మాత్రమే ఇస్తున్నాను అయినా నీకు ఈ విషయంలో ఇంట్రెస్ట్ లేదు కదా అందుకే నిన్ను మీటింగ్ కి కూడా పిలవలేదు అని స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.