- Home
- Entertainment
- Guppedantha Manasu: ధరణిని చంపేస్తానంటూ హెచ్చరించిన శైలేంద్ర.. రిషి చెంతకు చేరిన వసుధార?
Guppedantha Manasu: ధరణిని చంపేస్తానంటూ హెచ్చరించిన శైలేంద్ర.. రిషి చెంతకు చేరిన వసుధార?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులకు హృదయాలను గెలుచుకుంటుంది. అధికారం కోసం అయిన వాళ్ళని చంపటానికి సిద్ధపడుతున్న ఒక మూర్ఖుడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు రిషి. వసుధారకి ట్రీట్మెంట్ అవుతుండగా ఆమె తాలూకా వాళ్ళు ఈ ఫామ్ ఫీల్ చేయాలి అని రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇవన్నీ మీరు చూసుకోండి మేడం నేను వెళ్తాను అని పక్కన ఉన్న లెక్చరర్ కి చెప్తాడు రిషి. అదేంటి సార్ ఇప్పటివరకు ఆమెకి అంత హెల్ప్ చేశారు. తనకి మీకు పరిచయం తక్కువే అయినా ఆమె కోసం ఇంత కంగారు పడుతున్నారు.
అలాంటిది ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి అంటుంది లెక్చరర్. లేదు మేడం నాకు పని ఉంది అంటాడు రిషి. సరే సార్ మీరు తనని సేవ్ చేశారని చెప్తాను అంటుంది లెక్చరర్. మేడం మనం చేసే మంచి కనిపిస్తే చాలు మన పేరు అక్కర్లేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి వస్తాడు. ట్రీట్మెంట్ కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఇలా అడుగుతాడు. లేదు సార్ కంగారుగా వచ్చేసాము కదా అని లెక్చరర్ అనడంతో ఆమెకి డబ్బులు ఇచ్చే జాగ్రత్తలు చెప్పే వెళ్ళిపోతాడు రిషి.
వెళ్తూ దారిలో ఎందుకు వసుధార మీద అంత కన్సన్ చూపించావు నిజంగా నీ మనసులో ఏమీ లేదా అని రిషి ని ఆత్మ సాక్షి ప్రశ్నిస్తుంది. నిజంగానే నా మనసులో ఏమీ లేదు ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా తనని అలాగే రక్షించే వాడిని అదే ప్రేమ కాదు కేవలం మానవతా దృక్పథం అంతే అని తనని తానే సమాధానపరుచుకుంటాడు. మరోవైపు కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. కామ్ గా ఉన్న జగతిని నువ్వే రెచ్చగొడుతున్నావు కాస్త ఆవేశం తగ్గించు అంటుంది దేవయాని.
నీ సోది ఆపు.. అయినా పిన్నికి అంత ధైర్యం ఏంటి బాబాయ్ చూసుకునే కదా.. బాబాయ్ ని లేపేస్తాను అంటే డాడీ కి ఏమైనా అవుతుందని నువ్వు సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావు. నా చేతులు కట్టేస్తున్నావు బాబాయ్ ని ఎలా అయినా లేపేస్తాను అంటాడు శైలేంద్ర. అలా అంటూనే డోర్ వైపు చూసేసరికి అక్కడ ధరణి ఉంటుంది. అంతా వినేసిందేమో అనుకొని ఈ విషయం ఎవరికైనా చెప్తే నువ్వు ఇంట్లోనే కాదు అసలు లోకంలోనే ఉండవు అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర.
అసలు నేను విన్నాను లేదో తెలియకుండా ఎందుకు అలా కేకలు వేస్తున్నారు అంటుంది ధరణి. తను ఏమీ విన్నట్టు లేదు నువ్వు ఎక్కువగా బెదిరించకు అంటూ కొడుకుని హెచ్చరిస్తుంది దేవయాని. మరోవైపు స్పృహలోకి వచ్చిన వసుధారకి రిషి చేసిన హెల్ప్ గురించి చెప్తుంది లెక్చరర్. నాకు తెలుసు రిషి సార్ మీరు పైకి అగ్ని శిఖరం అయినా లోపల మంచి శిఖరం నాకోసం కరుగుతూనే ఉంటారు కానీ మనసులో ఆనంద పడుతుంది.
ఇంతలో వసుధారకి ఏంజెల్ ఫోన్ చేయటంతో ఆ ఫోన్ లెక్చరర్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్తుంది. కంగారుపడిన ఏంజెల్ హాస్పిటల్ కి వచ్చి జరిగిందంతా తెలుసుకుని వసుధారని నేను చూసుకుంటాను అని చెప్పి లెక్చరర్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది. మరోవైపు రిషి లెక్చరర్ కి ఫోన్ చేసి వసుధార కండిషన్ తెలుసుకుంటాడు. వసు బాగుంది అని తెలియడంతో రిలాక్స్ ఫీల్ అవుతాడు. మరోవైపు యాక్సిడెంట్ సంగతి మీ ఇంట్లో చెప్పావా మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అని అడుగుతుంది ఏంజెల్.
నాన్నకు చెప్తే కంగారు పడతారు అందుకే చెప్పలేదు ఇక్కడికి మా ఇల్లు చాలా దూరం అంటుంది వసుధార. అప్పటికే డాక్టర్ వసుధార కి పెద్దగా దెబ్బలేని తగల్లేదు. మెడిసిన్ తీసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి డిశ్చార్జి ఇచ్చేస్తాను అనటంతో వసుని తనతో తీసుకువెళ్తాను అంటుంది ఏంజెల్. వసుధార వద్దు అని చెప్తున్నా ఆమెని కన్వెన్స్ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది ఏంజెల్.
దెబ్బలతో ఇంటికి వచ్చిన వసు ను చూసి కంగారు పడతాడు విశ్వనాథం. జరిగింది తెలుసుకొని బాధపడతాడు. వసుధార మన ఇంటికి రావటానికి మొహమాటపడుతుంది అని తాతయ్యకి చెప్తుంది ఏంజెల్. ఎందుకమ్మా మొహమాటం ఇది కూడా నీ ఇల్లు లాంటిదే అంటాడు విశ్వనాథం తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.